ఢిల్లీ విద్యార్థికి గూగుల్ భారీ ఆఫర్ | Delhi boy gets Rs 1.27 crore offer from Google | Sakshi
Sakshi News home page

ఢిల్లీ విద్యార్థికి గూగుల్ భారీ ఆఫర్

Published Fri, Nov 20 2015 11:18 AM | Last Updated on Sun, Sep 3 2017 12:46 PM

ఢిల్లీ విద్యార్థికి గూగుల్ భారీ ఆఫర్

ఢిల్లీ విద్యార్థికి గూగుల్ భారీ ఆఫర్

న్యూఢిల్లీ: ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీ విద్యార్థి చేతన్ కక్కర్కు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సంస్థ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. గూగుల్ తనకు ఏడాదికి 1.27 కోట్ల రూపాయల వేతనాన్ని ఆఫర్ చేసినట్టు చేతన్ కక్కర్ చెప్పారు.

ఢిల్లీకి చెందిన చేతన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఫైనలియర్ చదువుతున్నారు. చేతన్ కోర్సును పూర్తి చేశాక వచ్చే ఏడాది కాలిఫోర్నియాలో గూగుల్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరనున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారీ ఆఫర్ అందుకున్న విద్యార్థి చేతన్ కావడం విశేషం. గూగుల్ సంస్థలో చేరడానికి ఉత్సుకతతో ఉన్నానని చేతన్ సంతోషం వ్యక్తం చేశారు. చేతన్ తల్లిదండ్రులు ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకులు. తల్లి రీతా కెమిస్ట్రీ విభాగంలో, తండ్రి సుభాష్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగంలో పనిచేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement