కేంద్ర బస్సుల్లో ఢిల్లీకి మొండి చేయి
సాక్షి, న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ పట్టణాభివృద్ధి మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) ఆధ్వర్యంలో దేశంలోని అన్ని నగరాలకు కేటాయించిన వెయ్యి బస్సులు కేటాయించినా, రాజధాని నగరానికి మాత్రం మొండిచెయ్యి చూపారు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదికలు పంపని కారణంగానే ఢిల్లీకి అదనపు బస్సుల కేటాయింపులో జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు కేటాయించగా మిగిలిన 468 బస్సుల్లోనూ 407 బస్సును ఈశాన్య రాష్ట్రాలకు కేటాయించారు.
మిగిలిన 61 బస్సులకోసం ఇతర పట్టణాల నుంచి ఇప్పటికే కేంద్రానికి నివేదికలు అందాయి. దీంతో ఈ మారు కేటాయింపుల్లో ఢిల్లీ నగరానికి కొత్త బస్సులు వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వ పట్టణాభివృద్ధిశాఖ అధికారులు చెబుతున్న ప్రకారం..ప్రభుత్వం అదనపు నిధులు కేటాయిస్తే వాటిలోంచి కొత్త బస్సులు కొనే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అంది నా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు అందని కారణంగానే బస్సుల కేటాయింపులో కోత పడినట్టు తెలి పారు.
కొత్తగా కొనుగోలుచేసిన బస్సుల్లో లోఫ్లోర్వి గాక స్టాండర్డ్ఫ్లోర్ బస్సులే ఉన్నందునే ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపలేదని వారు పేర్కొన్నా రు. వాస్తవానికి షీలా సర్కార్ ఆధ్వర్యంలో నగరంలోని మరికొన్ని కొత్త బస్సులు తేవాలని నిర్ణయిం చారు. అయితే ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి రావడంతో అది సాధ్యపడలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆదిశగా ఇంకా పనులు ప్రారం భం కాలేదని అధికారులు పేర్కొంటున్నారు.