Delhi Pradesh Congress Committee
-
డీపీసీసీ అధ్యక్షుడిగా అజయ్ మాకెన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) అధ్యక్షునిగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్‌ను నియమించనున్నారు. మాకెన్ నియామకానికి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదం తెలిపారని సమాచారం. ఈ మేరకు అధికారిక ప్రకటనను త్వరలోనే జారీచేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జ్ పీసీ చాకోతో పాటు జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ తమ పదవులకు రాజీనామా చేశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఈ రాజీనామాలను ఆమోదించలేదు. షీలా వ్యాఖ్యలతో నొచ్చుకున్న అజయ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ మాకెన్‌ను ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జ్గా నియమించింది. ఎన్నికల కోసం ఆయన గట్టిగా ప్రచారం చేసినప్పటికీ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. మాకెన్ కూడా ఎన్నికల్లో ఓడిపోవడమే కాకుండా డిపాజిట్ కూడా కోల్పోయారు. అయితే ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత మాజీ సీఎం షీలాదీక్షిత్ చేసిన బహిరంగ వ్యాఖ్యలు మాకెన్‌ను బాధించాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా ఈ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఓటమిపై ఎవరూ కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని పార్టీ నేతలను ఆమె ఆదేశించారు. పార్టీకి ప్రాణం పోయగలిగేది మాకెన్ మాత్రమే ఢిల్లీలో పూర్తిగా చతికిలపడ్డ కాంగ్రెస్‌లో తిరిగి ప్రాణం పోయగల సత్తా అజయ్ మాకెన్‌కు ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఢిల్లీ కాంగ్రెస్‌లో ప్రస్తుతం ప్రజాదరణ కలిగిన నేతలు కరువయ్యారు. షీలాదీక్షిత్ శకం ముగిసిన తర్వాత ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ నేత మాకెన్ మాత్రమే కావడంతో పార్టీ పగ్గాలను ఆయనకు అప్పగించాలని అధిష్టానం యోచిస్తోంది. అంతేకాక అర్వింద్ కేజ్రీవాల్‌ను ఎదుర్కోగల సత్తా మాకెన్కే ఉందని కాంగ్రెస్ అంచనా. కాంగ్రెస్ ఓటుబ్యాంకు పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలోకి చేరడంతో పునాదులు లేని స్థితికి చేరిన కాంగ్రెస్‌కు మళ్లీ ప్రాణం పోయడానికి అజయ్ మాకెన్ వంటి అనుభవ జ్ఞుడైన నేత అవసరమని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. -
ఆప్, బీజేపీలు నాణేనికి రెండు ముఖాలు
న్యూఢిల్లీ: బీజేపీ, ఆప్‌లు నాణానికి రెండు ముఖాల వంటివని, వాటి తప్పుడు వాగ్దానాలకు మోసపోకూడదని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నగర ఓటర్లను హెచ్చరించింది. ఇప్పటివరకు ఆ రెండు పార్టీలు ఏమి సాధించాయో చూసి అందుకనుగుణంగా ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి హరూన్ యూసఫ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 130వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఉధృతంగా ప్రచారం చేస్తోందని, ఆ పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ ప్రశ్నించారు. ఢిల్లీ అంతటా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లకు సుమారు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, రేడియో ప్రకటనలకు ఐదు కోట్లు వెచ్చించారని చెప్పారు. దశాబ్దాల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ పార్టీకి హోర్డింగులు, అడ్వర్టయిజ్మెంట్ల కోసం ఖర్చు పెట్టేందుకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు రావడం లేదని అన్నారు. కేవలం రెండేళ్ల క్రితం ఏర్పడిన పార్టీకి ఆర్థిక మద్దతు ఎక్కడి నుంచి లభిస్తోందని అన్నారు. సామాన్యుని గొంతుకగా ఉంటామని పార్టీని ఏర్పాటు చేశారని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన 49 రోజుల్లోనే జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం రాజీనామా చేశారని అన్నారు. ఇప్పుడు వారు నెలకొల్పిన హోర్డింగుల్లో జన్‌లోక్‌పాల్ ప్రస్తావనే లేదని విమర్శించారు. 49 రోజుల పాలనలో చౌకగా విద్యుత్, తాగునీరు అందించామని చెబుతున్నారని, ఆ సదుపాయాలను పొందిన వ్యక్తి ఒక్కరు కూడా తమకు ఎదురు పడలేదని లవ్లీ ఎద్దేవా చేశారు. -
బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి
విధానసభ ఎన్నికలపై డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)యే తమ ప్రధాన ప్రత్యర్థి అనే వాదనను ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) కొట్టిపారేసింది. త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీయేనని పేర్కొంది. తమ పార్టీకి ప్రజాదరణ బాగా పెరిగిందని, ఇటీవల తాము జరిపిన ఓ సర్వేలో ఈ విషయం తేటతెల్లమైందని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో సహచర నేతలతో కలసి మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తమ ఓటుబ్యాంకు పెరిగిందనే విషయం ఇటీవల తాము జరి పిన అధ్యయనంలో తేలిందన్నారు. ఈ విష యం త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ నిర్ధారణ అవుతుందన్నారు. విధానసభ ఎన్నికల్లో తాము బీజేపీతోనే తలపడతామని ఆయన పునరుద్ఘాటించారు. ‘గత 11 నెల లుగా నగరంలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. చలికాలం వచ్చేసిన్పటికీ నగరవాసులకు విద్యుత్ సరఫరాలో కోత కష్టాలు తప్పడం లేదు. వేలాదిమంది వృద్ధులు, వితంతువులు, అంగవికలురు పింఛన్ల కో సం కళ్లు కాయలు కాచేవిధంగా ఎదురుచూస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉం డగా ప్రారంభించిన రాజీవ్ ఆవాస్ యోజన కింద మురికివాడల్లో ఫ్లాట్ల నిర్మాణ పనులు కూడా జరగడం లేదు’ అని అన్నారు. తాల్కటోరా స్టేడియంలో చాచా జయంతి దివంగత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి వేడుకలను నగరంలోని తాల్కటోరా స్టేడియంలో ఈ నెల 13వ తేదీన నిర్వహిస్తామని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరువుతారని, ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఇదిలాఉండగా వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నవారిలో మున్సిపల్ కౌన్సిలర్, పూర్వాంచల్ నాయకుడు సతేంద్ర రాణా, మరో మున్సిపల్ కౌన్సిలర్ రేఖా వశిష్ట్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జీవన్‌లాల్, బీజేపీ నాయకుడు డాక్టర్ వీర్పాల్ తదితరులు ఉన్నారు. -
ఇక అంతా హైటెక్
న్యూఢిల్లీ: దీన్ద యాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లోని కాంగ్రెస్ కార్యాలయం (రాజీవ్ భవన్)ను ఆ పార్టీ ఐటీ విభాగం ఈ-మేక్ ఓవర్ చేయనుంది. ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఐటీ విభాగానికి చెందిన సిబ్బ ంది వెల్లడించారు. ఢి ల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో వెల్లడించింది. ఏ సమయంలోనైనా ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా ఉండడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయఢంకా మోగించాలనే లక్ష్యంతో రాష్ట్ర కాంగ్రెస్ విభా గం ముందుకు సాగుతోంది. ఇందులోభాగ ంగా పదిమందితో కూడిన కమ్యూనికేషన్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ-మేకోవర్ ప్రక్రియృ పూర్తికాగానే కమ్యూనికేషన్ బృందం నగరవాసుల అభిప్రాయాలు, స్పందనలను ఎప్పటికప్పుడు విశ్లేషించనుంది. కాగా ఐటీ విభాగం సమన్వయకర్తగా ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి రాధికా ఖేరా వ్యవహరిస్తున్నారు. ఇక యూ ట్యూబ్ చానల్లో కీలక నాయకుల ప్రసంగాలను అందుబాటులో ఉంచనున్నారు. ఇంకా నిరసన ప్రదర్శనలు, కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయనున్నారు. తద్వారా తాము ప్రజల కోసం పనిచేస్తున్నదనే సంకేతాలను ప్రజల్లోకి పంపాలనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల లక్ష్యం. అందులోభాగంగానే ఫేస్బుక్లో ఖాతా తోపాటు ట్విటర్లోనూ మరో ఖాతా తెరిచింది. దీంతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలకు సోషల్ మీడియాపై అవగాహన కల్పించడం కోసం త్వరలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. -
ప్రజావ్యతిరేక బడ్జెట్: డీపీసీసీ
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దిశానిర్దేశం లేనిదని, ప్రజావ్యతిరేకమని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) విమర్శించింది. ఇది పేదలకు ఎలాంటి మేలూ చేయకపోగా, నిరుద్యోగాన్ని ప్రోత్సహించేలా ఉందని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ ఆరోపించారు. ధరల పెరుగుదలను అడ్డుకోవడానికి ఒక్క చర్యను కూడా ప్రకటించలేదని మండిపడ్డారు. కరెంటు, నీటి సమస్యల పరిష్కారానికి నిధులు అంటూ ఢిల్లీవాసులను కేంద్రం మోసగించిందని లవ్లీ అన్నారు.