తెలంగాణ కోసం పదవి వదులుకున్నా.. : రాజయ్య
హన్మకొండ: తెలంగాణ రాష్ట్రం కోసం వైద్యులు ముందుండి పోరాడారు... స్వరాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమంలో భాగంగా కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే పదవి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నానని ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. హన్మకొండలో శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి దంత వైద్యుల సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు కొనసాగనున్న సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి వచ్చిన దంత వైద్యులు, వైద్య విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆశీస్సులతో డిప్యూటీ సీఎం అయ్యాయని... ఇది వైద్యులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.