తల్లి పాదాలకు మంత్రి క్షీరాభిషేకం
బాన్సువాడ: వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం తన మాతృమూర్తి పాపమ్మ పాదాలను క్షీరాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల పాదసేవా మహోత్సవం నిర్వహించారు. మంత్రి 102 ఏళ్ల వయసున్న తన తల్లి పాదాలను అభిషేకించి, ఆశీర్వాదం పొందారు. అన్ని దీక్షల కంటే తల్లిదండ్రుల పాదసేవే అతి పెద్ద దీక్ష అని త్రిదండి దేవనాథ జీయర్‌స్వామి పేర్కొన్నారు.