క్వారీలో పడి ఇద్దరు యువకుల మృతి
హైదరాబాద్: జగద్గిరిగుట్ట పరిధిలోని దేవేందర్‌నగర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ క్వారీ గుంతలో పడి ఇద్దరు యువకులు మరణించారు. మృతులు కౌసర్‌నగర్‌కు చెందిన రహీం(22), అస్లాం(18)గా గుర్తించారు. మృతదేహాలను వెలికి తీసి గాంధీఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.