Dhammika Prasad
-
నిరాహారదీక్షకు దిగిన శ్రీలంక మాజీ క్రికెటర్
శ్రీలంక మాజీ క్రికెటర్ దమ్మిక ప్రసాద్ శుక్రవారం 24 గంటల నిరాహారదీక్షకు దిగాడు. ప్రస్తుతం శ్రీలంక ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంతో పాటు 2019లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు కుటుంబాలకు న్యాయం చేకూరేందుకే తాను నిరాహారదీక్షకు దిగినట్లు దమ్మిక ప్రసాద్ తెలిపాడు. ''బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరిగేవరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.. దీంతో పాటు లంక ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వం పరిష్కారం చూపించాలని'' మీడియాకు తెలిపాడు. అంతకముందు లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స నివాసం ఉంటున్న గాలేలోని సెక్రటరియట్ ఎదుట ఆందోళన చేస్తున్న లంక ప్రజలకు మద్దతుగా దమ్మిక ప్రసాద్ తన నిరసనను వ్యక్తం చేశాడు. కాగా 2019లో ఈస్టర్ సండే రోజున ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో 269 మంది ప్రాణాలు పోయాయి. మూడు చర్చిలు, మూడు హోటళ్లు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. కాగా ఈ కుట్ర వెనుక సూత్రధారులపై శ్రీలంక ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీంతోపాటు బాంబు దాడిలో మరణించిన బాధితుల కుటుంబాలకు కూడా ఎలాంటి నష్టపరిహారం అందించలేదు. చదవండి: Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి! -
అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీలంక బౌలర్ గుడ్‌బై
కొలంబో: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ధమ్మిక ప్రసాద్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2006లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన 37 ఏళ్ల ధమ్మిక 25 టెస్టుల్లో 75 వికెట్లు,24 వన్డేల్లో 32 వికెట్లు తీశాడు. కాగా ప్రసాద్ చివరి టెస్టును 2015లో విండీస్‌తో ఆడాడు. అదే ఏడాది 9 టెస్టుల్లో ఏకంగా 41 వికెట్లు పడగొట్టి ఆ ఏడాది టాప్-10 బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఆ తర్వాత భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ధమ్మిక అప్పటినుంచి క్రమక్రమంగా జట్టుకు దూరమవుతూ వచ్చాడు. కాగా ధమ్మిక రిటైర్మెంట్ సందర్భంగా అతని సేవలను గుర్తు చేసుకుంటూ శ్రీలంక క్రికెట్ బోర్డ్ ట్విటర్లో వీడియో షేర్ చేసింది. 2015లో భారత్‌తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల్లో ధమ్మిక ప్రసాద్ 15 వికెట్లు పడగొట్టాడు. 2002 నుంచి సింఘలీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్ (ఎస్ఎస్సీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న ధమ్మిక 130 ఫస్ట్‌క్లాస్ గేముల్లో 351 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఆ సమయంలో ఎవరూ లేరు: కోహ్లి 'రోహిత్, పాండ్యా గట్టిగా హగ్ చేసుకున్నారు' Dhammika Prasad officially announced his retirement from international cricket..#ThankYouDhammika 👏🙏 What's your favourite @imDhammika moment? pic.twitter.com/xIiyfjAuwW — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) February 19, 2021 -
శ్రీలంక లక్ష్యం 153
కొలంబో: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఓటమి పాలైన శ్రీలంకకు సిరీస్‌ను సమం చేసే అవకాశం లభించింది. రెండో టెస్టులో పాక్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటై లంక ముందు 153 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. పాక్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ (117; 6 ఫోర్లు) సెంచరీ సాధించగా, ఇతర బ్యాట్స్‌మన్ నుంచి సహకారం లభించలేదు. 171/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన పాక్ మరో 158 పరుగులు మాత్రమే జోడిం చింది. లంక బౌలర్లలో దమ్మిక ప్రసాద్‌కు 4, చమీరాకు 3 వికెట్లు దక్కాయి. శ్రీలంక బ్యాటింగ్‌కు దిగాల్సి ఉన్నా... పాక్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారీ వర్షం రావడంతో ఆట సాధ్యం కాలేదు. సోమవారం మ్యాచ్‌కు చివరి రోజు. మూడు టెస్టుల సిరీస్‌లో పాక్ 1-0తో ఆధిక్యంలో ఉంది.