శ్రీలంక లక్ష్యం 153 | Lanka set 153-run target to win second Test | Sakshi
Sakshi News home page

శ్రీలంక లక్ష్యం 153

Published Mon, Jun 29 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

Lanka set 153-run target to win second Test

 కొలంబో: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఓటమి పాలైన శ్రీలంకకు సిరీస్‌ను సమం చేసే అవకాశం లభించింది. రెండో టెస్టులో పాక్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటై లంక ముందు 153 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. పాక్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ (117; 6 ఫోర్లు)  సెంచరీ సాధించగా, ఇతర బ్యాట్స్‌మన్ నుంచి సహకారం లభించలేదు. 171/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన పాక్ మరో 158 పరుగులు మాత్రమే జోడిం చింది. లంక  బౌలర్లలో దమ్మిక ప్రసాద్‌కు 4, చమీరాకు 3 వికెట్లు దక్కాయి. శ్రీలంక బ్యాటింగ్‌కు దిగాల్సి ఉన్నా... పాక్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారీ వర్షం రావడంతో ఆట సాధ్యం కాలేదు. సోమవారం మ్యాచ్‌కు చివరి రోజు. మూడు టెస్టుల సిరీస్‌లో పాక్ 1-0తో ఆధిక్యంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement