Dhanaraj
-
'మహమ్మద్ ఖయ్యుమ్'గా సునీల్..
సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బుజ్జి ఇలా రా’. ‘సైకలాజికల్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. కెమెరామ్యాన్ ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. చాందినీ అయ్యంగార్ హీరోయిన్. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్పి, జి. నాగేశ్వర రెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని సునీల్ పాత్ర లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. ‘‘సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. సునీల్‌గారు మహమ్మద్ ఖయ్యుమ్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్‌కి కూడా మంచి స్పందన వస్తోంది. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు, కెమెరా–దర్శకత్వం ‘గరుడవేగ’ అంజి. చదవండి : సిస్టర్‌కు ట్రీట్ ఇచ్చిన రామ్‌చరణ్ అనాథ చిన్నారులకు విశాల్ గోరుముద్దలు -
నాకు తగ్గ పాత్రలు వస్తే నటిస్తా!
‘వెన్నెల’ పోగ్రాం ఫేమ్ జయతి గడ్డం లీడ్ రోల్లో నటించి, నిర్మించిన చిత్రం ‘లచ్చి’. చంద్రమోహన్, రఘుబాబు, ధనరాజ్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఈశ్వర్ దర్శకుడు. ఈ నెల 24న ‘లచ్చి’ విడుదల కానుంది. జయతి మాట్లాడుతూ– ‘‘ఈశ్వర్‌గారు పవన్‌కల్యాణ్‌గారి వద్ద డైరెక్షన్ టీంలో వర్క్ చేశారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో సినిమా నిర్మించాలనుకున్నా. అయితే... ముందు నటించాలనుకోలేదు. పాత్ర చాలా డీసెంట్‌గా, నాకు సరిపోయేలా ఉందనిపించి నటించా. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరించాం. ఆత్మలను పట్టే దేవి అనే అమ్మాయి ఓ ఊరి సమస్యను ఎలా పరిష్కరించిందన్నదే కథ. లచ్చి పాత్రలో మరో అమ్మాయి కనిపిస్తుంది. ఆ లచ్చి ఏమైందో తెలుసుకునే దిశగా దేవి పాత్ర సాగుతుంది. గతంలో ఎంత మంది మహిళా నిర్మాతలు వచ్చారో నాకు తెలియదు. కానీ, నేను చాలా ఇష్టపడి ఈ సినిమా కోసం కష్టపడ్డా. మంచి అవుట్ రావాలని బాగా టెన్షన్ పడ్డాను. ఫస్ట్ కాపీ చూశాక హ్యాపీ. ఎం.వి. రఘుగారు ప్రతి సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించారు. సురేశ్ యువన్ మంచి పాటలిచ్చారు. ఈ సినిమా హిట్టయితే మలయాళ ‘మై బాస్’ రీమేక్ చేస్తా. దర్శకత్వం చాలా కష్టం. ఆ ఆలోచనే లేదు. గ్లామర్ పాత్రల్లో నటించలేను. నాకు తగ్గ పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తా’’ అన్నారు. -
ఫేర్వెల్ పార్టీలో గొడవ: విద్యార్థి మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని ఓ కాలేజ్ లో విషాదం చోటు చేసుకుంది. స్థానికి ఎస్.ఆర్.ఐ.టి ఇంజినీరింగ్ కాలేజ్ లో ఆదివారం రాత్రి ఫేర్ వెల్ పార్టీ జరిగింది. అయితే ఈ పార్టీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మెకానికల్ విద్యార్థి ధన్‌రాజ్‌ను కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. -
‘సినిమా’ చూపించేవాడిని ..
హైదరాబాద్ : ‘భీమిలి కబడ్డీ జట్టు’ చిత్రం చూసినవారికి బాగా గుర్తుండిపోయిన నటుడు ‘ధన్‌రాజ్’. బక్కపలచగా ఉన్నా వంద చపాతీలు తింటానని పందెం కాసి గెలుస్తాడు. హోటల్ యజమాని లెక్క తప్పాడని మరలా మొదటి నుంచి పందెం ప్రారంబిద్దామని అమాయకంగా మొహం పెట్టి చెప్పడం ప్రతి ఒక్కరికీ ఇప్పటికీ గుర్తే. ధన్‌రాజ్ తన చిన్నప్పుడు వేసవి సెలవుల్లో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.. ‘నాన్న లారీ డ్రైవర్ కావడంతో విజయవాడ, నెల్లూరు, తెనాలి, గుంటూరు ఇలా చాలా ఊళ్లలో వేసవి సెలవులు గడిపాను. సెలవులిచ్చారంటే చాలు ఉదయం బయటకు వెళితే ఇంటికి చేరేది రాత్రికే. ఆటలన్నీ సినిమా చుట్టూనే తిరిగేవి. వాడేసిన ఫిల్మ్ల్ని సేకరించి ఫిల్మ్ బాక్సులో పెట్టి అందరికీ చూపించేవాడిని. సినిమా రీళ్లను కత్తిరించి వాటిమధ్య చీపురుపుల్లలు పెట్టి భూతద్దంతో సూర్యకాంతిని ఫోకస్ చేసి తెల్లకాగితంపై అందరికీ చూపించి సరదాపడేవాడిని. సందర్భానుసారం డైలాగ్స్ కూడా నేనే చెప్పేవాడిని. ఎండ తగ్గితే చాలు ఈతపళ్లు ఏరుకుని కాలువ గట్టుని కూర్చుని తినడం మరిచిపోలేని అనుభూతి. ఈత నేర్చుకుందాం అనుకున్నా. ఓ సారి కృష్ణానదిలో మునిగిపోయా. నీటిగండం ఉందని తెలిసి ఈత జోలికి పోలేదు’ అంటూ ముగించారు.