వైఎస్సార్సీపీ కటౌట్లకు నిప్పు
కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు
రావికమతం: మండలంలో కొత్తకోట గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన కటౌట్లను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పటించారు. ఇటీవల గ్రామంలో నిర్వహించిన గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమానికి ధర్మశ్రీకి మద్దతుగా నాయకులు ఈ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్లకు నిప్పటించడంతో గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు గుమ్మడు సత్యదేవ, శీలం శంకరరావు, పందల దేవాలు సోమవారం కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్.ఐ శేఖరం కేసును నమోదు చేశారు.