ఇంకో కేజీ పెరిగినా నాకు కష్టాలే: నటి
ముంబయి: ఇప్పటికే అధిక బరువు ఉన్నానని, ఇంతకంటే ఒక్క కేజీ కూడా పెరగబోనని టీవీ నటి అంజలి ఆనంద్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె బరువు 108 కేజీలు. త్వరలో ‘దాయి కిలో ప్రేమ్’ అనే మరో టీవీ ప్రోగ్రాం ప్రారంభంకానుంది. దీనికోసం ప్రస్తుతం ఉన్న బరువుకంటే అదనంగా పెరగాలని ఈ ప్రోగ్రాం నిర్మాతలు అంజలిని కోరగా అందుకు ఆమె ససేమిరా అని చెప్పేసింది.
‘నేను ఇంత బరువున్నప్పటికీ చాలా యాక్టివ్గా ఉంటాను. ఇతరుల మాదిరిగానే ట్రెక్కింగ్, సైక్లింగ్లాంటివి చేస్తుంటాను. ప్రస్తుతం నా పాత్ర కోసం 108కేజీల బరువు పెరిగాను. ఇంతకంటే ఏ మాత్రం పెరిగినా నేను క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పరిస్థితి తారుమారవుతుంది. అందుకే నేనిక ఏ మాత్రం పెరగను’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఈమె స్టార్ ప్లస్ టీవీ చానెల్లో వచ్చే టీవీ షోలో నటిస్తోంది.