diagnostic centre
-
బాబోయ్ అక్కడ దయ్యాలు తిరుగుతున్నాయా!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో దయ్యాలు సంచరిస్తున్నాయన్న వదంతులు స్థానికులను బెంబెలెత్తిస్తున్నాయి. గతేడాది డిల్లీలోని ఓ ఇంట్లో 11 మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ ఇంట్లో మోహన్ సింగ్ అనే డాక్టర్ డయాగ్నోస్టిక్ సెంటర్ నడిపిస్తున్నాడు. కాగా, గత కొన్నిరోజులుగా ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఆ ఇంట్లో చనిపోయినవారి ఆత్మలు తిరుగుతున్నాయంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే ల్యాబ్ యాజమాని మాత్రం ఆ వార్తలను కొట్టిపారేసారు. ల్యాబ్ యాజమాని మాట్లాడుతూ.. ‘ఇక్కడ దయ్యలు ఉన్నాయనేది ముఢ నమ్మకం. నేను అలాంటి వార్తలను నమ్మను. దయ్యాలు ఉన్నాయన్నది నిజమైతే నేను ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టే వాడినే కాదు. ఎలాంటి భయం లేకుండానే చాలా మంది రోగులు ఇక్కడికి టెస్టులు చేయించుకునేందుకు వస్తున్నారు. నేను ఇక్కడ గణపతి పూజతో పాటు గౌరి పూజలు చేయిస్తాను. అలా చేసిన తర్వాత మళ్లీ చెడు శక్తులు ఉన్నట్లు భావించకుడదని పూజారి నాకు సూచించారు. ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను నడపడానికి నాకు ఎలాంటి సమస్య లేదు. ఇది ప్రధాన రహదారికి ఆనుకుని ఉంది’ అని తెలిపారు. అలాగే సురేశ్ అనే స్థానికుడు ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘ఆ ఇంట్లో చనిపోయినవారు చాలా మంచివారు. కాబట్టి వారి ఆత్మలు నేరుగా స్వర్గానికి చేరుంటాయి.. ఇక వారు దయ్యలుగా మారే అవకాశం లేదు’ అని అభిప్రాయపడ్డారు. -
డయగ్నాస్టిక్ సెంటర్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రామ్‌గోపాల్‌పేట పరిధిలోగల పాస్‌పోర్ట్ ఆఫీస్ దగ్గర్లోని కలింగా డయాగ్నస్టిక్ సెంటర్లో ఈరోజు మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిఉండ వచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. -
లంచం కేసులో ఎన్నారై వైద్యుడికి 46 నెలల జైలు
అమెరికాలో డయాగ్నస్టిక్ సెంటర్ నడిపిస్తున్న ఓ ఎన్నారై వైద్యుడికి 46 నెలల జైలుశిక్ష పడింది. న్యూజెర్సీలో ల్యాబ్ నడుపుతున్న డాక్టర్ అశోక్ కుమార్ బబారియా (64) రోగులను తన వద్దకు పంపేందుకు కొంతమంది వైద్యులకు లంచాలు ఇచ్చిన కేసులో ఈ శిక్ష పడింది. అమెరికా జిల్లా జడ్జి క్లైర్ సి సెచి ఎదుట వాదనలు జరగగా, అందులో అశోక్ కుమార్ నేరం నిరూపితమైంది. దీంతో ఆయనకు 46 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు విడుదలైన తర్వాత మరో మూడు నెలల పాటు ఆయన్ను పరిశీలిస్తూ ఉండాలని జడ్జి ఆదేశించారు. అశోక్ కుమార్ బబారియాకు 25వేల డాలర్ల జరిమానా విధించి, మరో 2 మిలియన్ డాలర్లు జప్తుచేయాల్సిందిగా ఆదేశించారు. లైసెన్సు గల రేడియాలజిస్టు అయిన అశోక్ కుమార్.. న్యూజెర్సీలో ఆరంజ్ కమ్యూనిటీ ఎంఆర్ఐ సెంటర్ నడిపిస్తున్నారు. ఆ సెంటర్‌కు రోగులను పంపినందుకు గాను వైద్యులకు లంచాలు చెల్లించి, దాదాపు 2 మిలియన్ డాలర్ల లాభాలు ఆర్జించినట్లు ప్రాసిక్యూషన్ వర్గాలు ఆరోపించాయి. ఒక ఎమ్మారై కేసు పంపితే ఒక్కో డాక్టర్‌కు సుమారు 100 డాలర్ల వరకు లంచం ఇచ్చేవారన్నాయి.అలాగే అల్ట్రా సౌండ్ లేదా డెక్సా స్కాన్ కేసు పంపితే 25 డాలర్లు ఇచ్చేవారట.