నష్టాలకు ఆర్టీసీ రైట్.. రైట్!
♦ వజ్ర మినీ బస్సుల విషయంలో ముందుకెళ్తున్న వైనం
♦ లోపాలు సరిదిద్దకుండా మరిన్ని కొత్త మార్గాల ఎంపిక
♦ త్వరలో కరీంనగర్, గోదావరిఖనిలకు బస్సులు
♦ ఉన్నవాటికే ప్రయాణికులు లేక ఖజానాకు భారం
♦ 20 శాతానికి మించని ఆక్యుపెన్సీ రేషియో
♦ తీరు మార్చకుండా మరిన్ని ఏసీ బస్సులు నడిపేందుకు సిద్ధమైన ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రయోగం విఫలమై నష్టాలు మిగులుస్తోంది. అప్పుడేం చేయాలి.. నష్టాలను అధిగమించేందుకు ఉన్న మార్గాల ను అన్వేషించాలి. సమస్యకు మూలం ఎక్క డుందో గుర్తించి సరిదిద్దాలి. ఆ తర్వాత దాన్ని విస్తరించే ప్రయత్నం చేయాలి. కానీ తీవ్ర నష్టాలు, అప్పులతో కునారిల్లి జీతాలు చెల్లిం చేందుకు దిక్కులు చూసే దుస్థితిలో ఉన్న ఆర్టీసీ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. దీనికి తాజా నిదర్శనమనే వజ్ర ఏసీ మినీ బస్సుల విస్తరణ యత్నం.
యాప్ ద్వారానే టికెట్లు..
ఇప్పటి వరకు ప్రయాణికులు బస్టాండ్లకు వెళ్లి బస్సులెక్కే పద్ధతి కొనసాగుతూ వచ్చింది. దీనికి భిన్నంగా కాలనీల నుంచే బస్సులు నడిపితే ‘ప్రయాణికుల ముంగిటకు ఆర్టీసీ’ నినాదం అమలులోకి వచ్చినట్లవుతుందనే ఉద్దేశంతో కొత్త ఆలోచనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంకురార్పణ చేశారు. ఆయన ఆదేశాల మేరకు వజ్ర పేరుతో మినీ ఏసీ బస్సులను ఆర్టీసీ ప్రారంభించిన విష యం తెలిసిందే.
బస్సుల్లో టికెట్ ఇచ్చే పద్ధతి లేకపోవటం, నేరుగా నగదు చెల్లించి టికెట్లు బుక్ చేసుకోకుండా మొబైల్ యాప్ ద్వారా కొనే పద్ధతి, బస్టాండ్లు ప్రయాణికులుండే చోట ఆపి అప్పటికప్పుడు వచ్చే వారిని ఎక్కిం చుకోకపోవటంతో ఆ ప్రయోగం దారుణంగా విఫలమైంది. దీనికి తోడు కొత్తగా కొనుగోలు చేసిన బస్సుల్లో తీవ్ర సాంకేతిక సమస్యలు ఉత్పన్నమై ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తు న్నాయి. దీంతో సమస్యలను పరిష్కరిం చేం దుకు దృష్టి సారించాల్సింది పోయి అదే పద్ధతిలో మరిన్ని బస్సులను కొత్త ప్రాంతా లకు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది.
కొత్త మార్గాల్లో కూడా..
ప్రస్తుతం హైదరాబాద్–వరంగల్, హైద రాబాద్–నిజామాబాద్ మార్గాల్లో 46 బస్సులు తిరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త గా హైదరాబాద్–గోదావరిఖని, హైదరా బాద్–కరీంనగర్ మధ్య కొత్త బస్సులను తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం తిరుగుతున్న బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం వరకు మాత్రమే ఉండటంతో తీవ్ర నష్టాలొస్తున్నాయి. పైగా వరంగల్ మార్గంలో ఉప్పల్ క్రాస్ రోడ్డు వద్ద, నిజామాబాద్ మార్గంలో సుచిత్ర జంక్షన్ వద్ద టికెట్ల జారీని ప్రైవేటు ఏజెంట్లకు అప్పగించారు. అక్కడ సాధారణ బస్సులకు టికెట్లు ఇచ్చేందుకు ఆర్టీసీ కండక్టర్లుంటున్నా.. వజ్ర టికెట్ల జారీ బాధ్యతను మాత్రం ప్రైవేటు ఏజెంట్లకు ఇవ్వటంతో ఒక్కో టికెట్‌పై కమీషన్ రూపంలో ఆర్టీసీ రూ.18 వరకు వారికి చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా నష్టాలు మరింత పెరిగాయి.
సీఎం ఆదేశించారని..
సీఎం ఆదేశంతో ప్రారంభమైన పథకం కావటంతో, నష్టాలొచ్చినా దాన్ని అలాగే కొనసాగించాలన్న ఆలో చనతో అధికారులున్నారు. కరీంనగర్, రామగుండం, గోదావరి ఖనిలకు కూడా బస్సులు నడపాలని ముఖ్య మంత్రే ఆదేశించారని అధికారులు చెబుతున్నారు. ఆయన ఆదేశాల మేరకే కొత్తగా ఆ పట్టణాలకు 16 బస్సులు తిప్పాలని నిర్ణయించారు. వీటికి కూడా ఆన్లైన్, యాప్ ద్వారా టికెట్లు బుక్ చేయించుకునే పద్ధతే అను సరించనున్నారు. నష్టాలను మరింతగా పెంచుకునే ఆలోచనతోనే అధికారులు ఉన్నట్టు కనిపిస్తోంది. టిమ్ ద్వారా టికెట్లు జారీ, ఎక్కడ ప్రయాణికులు ఉన్నా ఎక్కించుకోవటం, బస్టాండ్ల వద్దకు వెళ్లాలని ఆయా డిపోల మేనేజ ర్లు కోరుతున్నారు. ఇటీవల ఉన్నతా ధికారులతో జరిగిన సమీ క్షలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిం చారు. కానీ మార్పులు చేస్తే సీఎం ఆదేశాన్ని విస్మ రించినట్టవుతుందనే మార్పులు చేసేం దుకు అధికారులు జంకుతున్నారు.