Diamonds worth
-
బాబా హుండీలో భారీ కానుక
షిర్డీ: షిర్డీ సాయి బాబాకు ఓ అజ్ఞాత భక్తుడు భారీ కానుకను సమర్పించుకున్నాడు. గుర్తు తెలియని భక్తుడొకడు ఖరీదైన కానుకను చిన్న ప్లాస్టిక్ కవర్లో చుట్టి హుండీలో వేశాడు. అందులో విలువైన డైమండ్ నెక్లెస్ ఉంది. హుండీ లెక్కింపు సందర్భంగా ఆ విలువైన కానుకను చూసి దేవాలయ బోర్డు సభ్యుల ఆశ్చర్యానికి గురయ్యారు. మొదట దానిని మామూలు ఆభరణంగానే దేవాలయ అధికారులు భావించారు. అయితే అది డైమండ్ నెక్లెస్ అని తెలుసుకున్న తర్వాత ఆలయ అధికారులు... దాని విలువ లెక్క కట్టేందుకు ముంబైలోని ప్రముఖ నగల వ్యాపారలను సంప్రదించాల్సి వచ్చింది. దాదాపు 9 క్యారట్ల విలువైన ఈ బంగారు ఆభరణం విలువ సుమారు రూ.85 లక్షలుగా వారు నిర్ధారించారు. మొదట ఆ ఆభరణం విలువ మామూలుగానే ఉంటుందని అనుకున్నామని, తీరా రూ.85 లక్షలు ఉందని తెలియడంతో ఆశ్చర్యానికి గురయినట్లు ఆలయ అధికారి నరేష్ మెహతా తెలిపారు. -
జీఐఏ డైమండ్ కోర్స్
జెమాలజీలో ప్రతిష్టాత్మకమైన జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా (జీఐఏ) నగరవాసులకు డైమండ్స్‌పై సెప్టెంబర్ 29 నుంచి ఐదు రోజుల కోర్సు అందజేస్తోంది. డైమండ్స్ విలువకు దోహదపడే అంశాలు, వాటి విలువను నిర్ధారించడంలో మెలకువలు, ఆభరణాల కొనుగోలులో పాటించాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ఈ కోర్సులో శిక్షణ ఇస్తారు. వజ్రాలు, రత్నాలపై ఆసక్తి గల ఔత్సాహికులెవరైనా ఇందులో చేరవచ్చు. వివరాల కోసం టోల్ ఫ్రీ నంబరు 1800-102-1566 లేదా మొబైల్ నంబరు 8108186683కు కాల్ చేయాలి. ఈ-మెయిల్ eduindia@gia.eduor లో కూడా సంప్రదించవచ్చు.