బాబా హుండీలో భారీ కానుక | Diamonds Worth Rs. 85 Lakh Found In Shirdi Donation Box | Sakshi

బాబా హుండీలో భారీ కానుక

Published Fri, Apr 22 2016 3:45 PM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

బాబా హుండీలో భారీ కానుక

బాబా హుండీలో భారీ కానుక

షిర్డీ: షిర్డీ సాయి బాబాకు ఓ అజ్ఞాత భక్తుడు భారీ కానుకను సమర్పించుకున్నాడు. గుర్తు తెలియని భక్తుడొకడు ఖరీదైన కానుకను  చిన్న ప్లాస్టిక్ కవర్లో చుట్టి హుండీలో వేశాడు. అందులో విలువైన డైమండ్ నెక్లెస్ ఉంది. హుండీ లెక్కింపు సందర్భంగా ఆ విలువైన కానుకను చూసి దేవాలయ బోర్డు సభ్యుల ఆశ్చర్యానికి గురయ్యారు.
 
మొదట దానిని మామూలు ఆభరణంగానే దేవాలయ అధికారులు భావించారు. అయితే అది డైమండ్ నెక్లెస్ అని తెలుసుకున్న తర్వాత ఆలయ అధికారులు... దాని విలువ లెక్క కట్టేందుకు ముంబైలోని ప్రముఖ నగల వ్యాపారలను సంప్రదించాల్సి వచ్చింది.
 
దాదాపు 9 క్యారట్ల విలువైన ఈ బంగారు ఆభరణం విలువ సుమారు రూ.85 లక్షలుగా వారు నిర్ధారించారు. మొదట ఆ ఆభరణం విలువ మామూలుగానే ఉంటుందని అనుకున్నామని, తీరా రూ.85 లక్షలు ఉందని తెలియడంతో ఆశ్చర్యానికి గురయినట్లు ఆలయ అధికారి నరేష్ మెహతా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement