digital board
-
Hyderabad to Bengaluru: ఎన్‌హెచ్ 44 ఇక ‘సూపర్’ హైవే
సాక్షి, అనంతపురం: హైదరాబాద్ (తెలంగాణ) నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగళూరు (కర్ణాటక)కు వెళ్లే జాతీయ రహదారి–44 సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా మారనుంది. ట్రాఫిక్ క్లియరెన్స్ సమయంతో పాటు ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకునేందుకు అవసరమైన సమాచారం డిజిటల్ బోర్డులపై ప్రదర్శించేలా ఈ రహదారిని అత్యాధునికంగా మార్చేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అంచనాలు రూపొందించింది. త్వరలో క్షేత్రస్థాయి పరిశీలనకు రానుంది. ఇప్పటికే సర్వే మొదలైంది. ప్రస్తుతమున్న నాలుగు వరుసలను ఆరు వరుసల రహదారిగా విస్తరిస్తారు. రహదారికి ఇరువైపులా ఏడు మీటర్ల వెడల్పుతో సర్వీసు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సరిహద్దు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు 251 కిలో మీటర్లు ఉంది. ఢిల్లీ –ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే తరహాలోనే హైదరాబాద్ – బెంగళూరు రహదారిని పూర్తి స్థాయిలో రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు. రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థ అనుసంధానం చేయగానే జాతీయ రహదారుల సంస్థకు చెందిన ఓ విభాగం ఆయా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఇందుకు సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. చదవండి: (Subha Muhurtham: మళ్లీ కల్యాణ ఘడియలు వచ్చేశాయి..) సర్వే పనులు ప్రారంభించాం హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి–44ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసల రోడ్డుగా మారుస్తున్నాం. ఈ జాతీయ రహదారి తెలంగాణ సరిహద్దు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఆంధ్రప్రదేశ్‌లో 251 కిలో మీటర్లు ఉంది. ఇప్పటికే రహదారి విస్తరణకు సర్వే చేస్తున్నారు. త్వరలోనే రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థ అనుసంధానంతో సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా మారనుంది. త్వరలో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల సమస్య తీరనుంది. – జేఎల్ మీనా, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎన్హెచ్ఏఐ -
షరామామూలే..!
→ టమాటా మండీ నిర్వాహకులు, వ్యాపారులు సిండికేట్ → టమాట మార్కెట్లో కనిపించని డిజిటల్ బోర్డుల జాడ → పట్టించుకోని మార్కెటింగ్‌శాఖ అధికారులు అనంతపురం రూరల్ : టమాట మార్కెట్లో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అనంతపురం రూరల్ మండల పరిధిలోని కక్కలపల్లి గ్రామ సమీపంలోని టమాట మండీ మార్కెట్ నిర్వాహకులు, వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను మోసం చేస్తున్నారు. ప్రతి రోజు రైతులు టన్నుల కొద్ది టమాటలను మార్కెట్‌కు తీసుకువచ్చి మద్దతు ధర లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. టమాటను మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినాlఎవరూ పట్టించుకోవడం లేదు. మంత్రి మాటలు బేఖాతరు నెల క్రితం మంత్రి పరిటాల సునీత మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి టమాట మండీని పరిశీలించారు. టమాట ధరలను తెలిపే డిజిటల్ బోర్డులను ప్రతి మండీ ఎదుట ఏర్పాటు చేసి టమాట రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు రైతులకు కనీస మౌలిక వసతులను కల్పించాలని మండి నిర్వహకులకు సూచించినా వారు ఏమాత్రం పట్టించు కోలేదు. ఎక్కడ టమాట ధరలు తెలిపే బోర్డులు కూడా కనిపించడం లేదు. ఒక మండీలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు కూడా పనిచేయడం లేదు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రయోజనంలేదు మార్కెట్‌కు టమాటలను తీసుకువచ్చే రైతులకందరికీ కనిపించే విధంగా మార్కెటింగ్ శాఖ అధికారులు బహిరంగ ప్రాంతంలో ధరలు తెలిపే డిజిటల్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఒక మార్కెట్ లోపలి భాగంలో డిజిటల్ బోర్డును అధికారులు ఏర్పాటు చేశారు. మిగిలిన మండీలకు టమాటాలను తీసుకెళ్లే రైతులకు ధరలు తెలియక వ్యాపారులు చెప్పిన ధరలకే సరుకును అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారు. డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయిస్తాం: హిమశైల, ఏడీ, మార్కెటింగ్‌శాఖ వివిధ ప్రాంతాల్లోని మార్కెట్లలో టమాట ధరలను తెలిపే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం.