dikshalu
-
250వ రోజుకు బహుజన పరిరక్షణ సమితి దీక్ష
సాక్షి, గుంటూరు: మందడంలో బహుజన పరిరక్షణ సమితి దీక్ష 250వ రోజుకు చేరుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం, అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను టీడీపీ అడ్డుకోవడం నిరసిస్తూ దీక్ష కొనసాగుతోంది. దీక్షకు 643 ప్రజా, మహిళ, ఓసీ, బీసీ, మైనార్టీ, దళిత సంఘాలు మద్దతు తెలిపాయి. 250వ రోజు కొనసాగుతున్న దీక్షలో పలువురు పాల్గొని ప్రసంగించారు. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందని ప్రకటించడం హర్షణీయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. చదవండి: విషాదం: నాన్నా... ఇది తగునా !.. దారుణం: భార్య చేతిలో భర్త హతం -
18న గుడాటిపల్లికి టీపీసీసీ నేతలు
హుస్నాబాద్‌రూరల్ : గౌరవెల్లి ముంపు ప్రాంతంలో పర్యటించి తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీపీసీసీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, సునీతాలక్ష్మారెడ్డిని భూనిర్వాసితులు శనివారం కలిసి విన్నవించారు. గుడాటిపల్లిలో 60 రోజులుగా దీక్షలు చేపట్టిన ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 18న గౌరవెల్లి ముంపు ప్రాంతంలో పర్యటించనున్నట్లు నేతలు తెలిపారని భూనిర్వాసితులు పేర్కొన్నారు. కలిసిన వారిలో జి.రాజిరెడ్డి, చంద్రారెడ్డి, ఎన్.బాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, రాజిరెడ్డి, రమేశ్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, బాపురెడ్డి, భిక్షపతి ఉన్నారు. -
భక్తిపారవశ్యంతో సాయిదీక్షలు
కరీంనగర్‌కల్చరల్ : గురుపౌర్ణమిని పురస్కరించుకుని నగరంలో శ్రీషిర్డీసాయిమాలధారణ దీక్షలను సాయిభక్తులు స్వీకరించారు. శ్రీషిర్డీసాయి భక్తజన మండలి ఆధ్వర్యంలో సాయినాథ్ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 19న గురుపౌర్ణమి సందర్భంగా శ్రీవిజయగణపతి సాయిబాబా ఆలయంలో 24 గంటల పాటు భజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీషిర్డీసాయి భక్తజన మండలి అధ్యక్షుడు నలుమాచు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ తెలిపారు.