dinakaran arrested
-
దినకరన్ నివాసంలో పోలీసుల సోదాలు
న్యూఢిల్లీ: ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్ట్ అయిన దినకరన్ నివాసంలో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. కాగా విచారణ నిమిత్తం ఆయనను న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీకి అప్పగించిన దృష్ట్యా, దినకరన్‌ను ఇవాళ ఢిల్లీ పోలీసులు చెన్నైకు తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా తొమ్మిదిమంది సభ్యుల బృందం దినకరన్‌ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆయన సతీమణిని కూడా పోలీసులు విచారణ చేయనున్నట్లు సమాచారం. కాగా అన్నాడీఎంకే పార్టీ చిహ్నం కోసం రూ.50 కోట్లు ఎరగా వేయడం వెనుక దినకరన్ ఒక్కడి హస్తం మాత్రమే ఉండే అవకాశాలు లేవని, ఆ పార్టీకి చెందిన వారికి కూడా ఈ విషయాలు తెలిసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఈ కేసులో పది కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్టు సంకేతాలు ఉన్నా, పట్టుబడింది మాత్రం రూ.1.3 కోట్లే కావడంతో మిగిలిన మొత్తంపై లెక్క తేలాల్సి ఉంది. ఈ మొత్తం ఎవరి చేతిలో ఉన్నాయో, దీని వెనుక మరెవ్వరి హస్తం అయినా ఉండొచ్చన్న సంకేతాలతో, తదుపరి అరెస్టు ఎవరో, తదుపరి ఉచ్చు ఎవర్ని బిగుసుకుంటుందో అనే దానిపై ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్నాయి. -
దినకరన్‌కి ఐదు రోజుల పోలీస్ కస్టడీ
-
దినకరన్‌కి ఐదు రోజుల పోలీస్ కస్టడీ
న్యూఢిల్లీ: ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్ట్ అయిన అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అయిదు రోజులు పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ క్రైం బ్రాంచ్ డీసీపీ మాట్లాడుతూ ఈ కేసులో దినకరన్ ప్రమేయంపై కావాల్సినన్నీ ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అయితే మరింత సమాచారం బయటకు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. కాగా దినకరన్‌తో పాటు ఆయన సన్నిహితుడు మల్లికార్జునను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా వరుసగా నాలుగు రోజుల పాటు దినకరన్‌ను ప్రశ్నించిన ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు.. ఎట్టకేలకు ఆయనను గతరాత్రి అరెస్టు చేశారు. తమ వర్గానికి రెండాకుల గుర్తు తెచ్చుకోవడం కోసం ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వజూపారన్న నేరంలో దినకరన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దినకరన్‌తో పాటు ఆయన స్నేహితుడు మల్లికార్జునను కూడా అరెస్టు చేశారు. పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసినా, దినకరన్‌ను దాచిపెట్టారన్నది మల్లికార్జునపై ఉన్న అభియోగం. వీళ్లిద్దరినీ బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అలాగే దినకరన్‌ను తమ కస్టడీకి అనుమతించాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు...అయిదురోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. -
అర్ధరాత్రి హైడ్రామా.. దినకరన్ అరెస్టు
తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ (53) .. మంగళవారం అర్ధరాత్రి హైడ్రామా నడుమ అరెస్టయ్యారు. వరుసగా నాలుగు రోజుల పాటు దినకరన్‌ను ప్రశ్నించిన ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు.. ఎట్టకేలకు ఆయనను అరెస్టు చేశారు. సోమవారం కూడా రాత్రి 1 గంట వరకు దినకరన్‌ను ప్రశ్నించిన పోలీసులు.. మంగళవారం సైతం అదే పద్ధతిలో అర్ధరాత్రి వరకు ప్రశ్నిస్తుండటంతో అసలు అరెస్టు ఉంటుందా లేదా అన్న అనుమానాలు తలెత్తాయి. ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా దినకరన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు అర్ధరాత్రి సమయంలో ప్రకటించారు. తమ వర్గానికి రెండాకుల గుర్తు తెచ్చుకోవడం కోసం ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వజూపారన్న నేరంలో దినకరన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దినకరన్‌తో పాటు ఆయన స్నేహితుడు మల్లికార్జునను కూడా అరెస్టు చేశారు. పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసినా, దినకరన్‌ను దాచిపెట్టారన్నది మల్లికార్జునపై ఉన్న అభియోగం. వీళ్లిద్దరినీ బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదే కేసులో ఇంతకుముందు అరెస్టయిన మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్‌ను తాను కలిసినట్లు దినకరన్ పోలీసుల విచారణలో అంగీకరించారు. అయితే, తాను అతడికి డబ్బులు మాత్రం ఏమీ ఇవ్వలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అంటున్నారు. ఏప్రిల్ 16వ తేదీన దక్షిణ ఢిల్లీలోని ఓ హోటల్లో రూ. 1.3 కోట్ల నగదుతో చంద్రశేఖర్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని తాను ఎన్నికల కమిషన్ అధికారులకు ఇవ్వాల్సి ఉందని విచారణలో సుఖేష్ చెప్పాడు. అంతకుముందు మంగళవారం నాడు.. లంచాల ఆరోపణలపై దినకరన్ మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ఢిల్లీ పోలీసులను కోర్టు ప్రశ్నించింది. అసలే దినకరన్, శశికళ ఇద్దరినీ పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్న పన్నీర్ సెల్వం వర్గానికి.. ఇప్పుడు అతడి అరెస్టుతో మార్గం మరింత సులభతరమైంది.