ఈశాన్య రాష్ట్రాల సహకారం అవసరం
అగర్తలా: భారత-బంగ్లాదేశ్ ల మధ్య అభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాల సహకారం అవసరమని బంగ్లా దేశ్ మాజీ విదేశాంగ మంత్రి దిపూ మోనీ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలపడాలంటే త్రిపురతో సహా ఈశాన్య రాష్ట్రాల భాగస్వామ్యం అవసరమని ఆమె పేర్కొన్నారు. బంగ్లాకు అత్యంత దగ్గరగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడితే ఇరు దేశాల మధ్య సఖ్యత మరింత పెరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే బుధవారం బంగ్లాదేశ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమయ్యింది. బంగ్లాకు ఉత్తరాది ప్రాంతాలతో పాటు, సన్నిహితంగా ఉండే దేశాలకు సంబందించి విదేశీ వ్యవహారాలపై ఆ కమిటీలో చర్చించారు.