breaking news
Director of Municipal Administration
-
రెవెన్యూ ఉద్యోగుల్లో గుబుల్
ఎమ్మిగనూరు టౌన్: ఆస్తి పన్నుల అక్రమాలపై మున్సిపల్ పరిపాలన విభాగం డెరైక్టర్(డీఎంఏ) స్సెషల్ ఆడిట్‌కు ఆదేశించడంతో రెవెన్యూ ఉద్యోగుల గుండెల్లో గుబుల్ ప ట్టుకుంది. ఇటీవల నంద్యాల మున్సిపాలిటీలో ఆస్తి పన్ను విధింపులో చోటు చే సుకున్న అక్రమాలు బయటపడటంతో పాటు 11మంది రెవెన్యూ ఉద్యోగులపై వేటు పడిన విషయం విధితమే. దీంతో రాష్ర్టంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తిపన్ను విధింపుపై ఆన్లైన్, మాన్యువల్ రికార్డులను ర్యాండమ్ పద్ధతిలో అసిస్మెంట్లను పరిశీలించేందుకు స్పెషల్ ఆడిట్ నిర్వహించాలని డీఎంఏ నిర్ణయించారు. ఈ మేరకు రికార్టులను సిద్ధంగా ఉంచుకొని స్పెషల్ ఆడిట్ బృందానికి సహకరించాలని డీఎంఏ శనివారం రాత్రి మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మిగనూరు మునిపాలిటీలో ఐదేళ్లుగా భవనాలు, దుకాణాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం జోరందుకుంది. 2011లో నిర్వహించిన గృహాల గణన రికార్డుల మేరకు పట్టణంలో వివిధ భవనాలు 19,168 ఉన్నాయి. గణన తరువాత మూడేళ్లలో మరిన్ని భవనాలు వెలిశాయి. ప్రస్తుతం ఈ అసిస్మెంట్ల(భవనాలు) ద్వారా ఏడాదికి రూ.1.46కోట్ల ఆదాయం మున్సిపాలిటీకి సమకూరుతోంది. 2001నుంచి 2010వ సంవత్సరం వరకు ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో పాలన గాడి తప్పడంతో రూ.7.30కోట్ల అవినీతి చోటు చేసుకుంది. ఈ కుంభకోణంపై సీబీసీఐడీ అధికారులు రెండేళ్లుగా విచారణను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆస్తిపన్ను విధింపులోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. కొన్ని అసిస్మెంట్లకు ఇప్పటికీ పన్ను విధించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు గతంలో పనిచేసిన బిల్కలెక్టర్లు డబ్బుకు కక్కుర్తిపడి ఆస్తిపన్నును తగ్గించి మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టారన్న విమర్శలున్నాయి. ఈ సారి ఆడిట్ అధికారులు నిజాలు ఎంతవరకు నిగ్గుతేలుస్తారో వేసిచూడాలి. -
పౌర సేవలు లోపిస్తే చర్యలు
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీల్లో సిటిజన్ చార్టర్ ప్రకారం ప్రజలకు సకాలంలో, సక్రమంగా సేవలందించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్ డాక్టర్ బి.జనార్దనరెడ్డి హెచ్చరించారు. రీజియన్‌లోని మున్సిపల్ కమిషనర్లతో శుక్రవారం సాయంత్రం స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విధుల్లో భాగమైన పౌరసేవల విషయంలో అధికారులు, సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం తాజా సమాచారం కంప్యూటర్లలో అప్లోడ్ అవుతోందో.. లేదో కూడా చూడలేని దుస్థితిలో కమిషనర్లు ఉండడం దారుణమని వ్యాఖ్యానించారు. పారిశుద్ధ్య నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఆ స్థాయిలో పనులు కన్పించడం లేదని మండిపడ్డారు. ఈ విషయంలో బొబ్బిలి, సాలూరు మున్సిపాల్టీలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తడిచెత్త కంపోస్టింగ్ ఎందుకు చేయలేకపోతున్నారని శ్రీకాకుళం కమిషనర్ రామ్మోహనరావు, హెల్త్ ఆఫీసర్ రవికిరణ్‌లను ప్రశ్నించారు. వారినుంచి సరైన సమాధానం రాకపోవటంతో వారం రోజులపాటు సాలూరు మున్సిపల్ కమిషనర్ సుభాన్ ఖాన్ సహకారం తీసుకుని పనిచేయాలని ఆదేశించారు. ఆస్తి పన్ను వసూళ్లు, పార్కులు, మున్సిపల్ స్థలాల అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యం తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్ల పనితీరును సమీక్షించారు. పైలీన్ తుపాను, వరద నష్టాలకు సంబంధించిన ప్రత్యేక నిధులను వారంలోగా అందిస్తామని తెలిపారు. ఈ నిధులను సంబంధిత పనులకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికుల ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు సక్రమంగా జరగాలన్నారు. కొత్తగా మున్సిపాల్టీలుగా మారిన పాలకొండ, నెల్లిమర్లల్లో సిబ్బందికి జీతాలు రావడం లేదని కమిషనర్లు డెరైక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఆర్డీ ఆశాజ్యోతి, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శరత్‌బాబు, మున్సిపల్ కమిషనర్లు రామ్మోహనరావు, గోవిందస్వామి, విజయనగరం మెప్మా పీడీ వెంకటరమణ పాల్గొన్నారు.