distict govt hospital
-
‘మీడియా’ కథనంతో.. రిమ్స్‌ను తనిఖీ చేసిన కలెక్టర్..!
ఆదిలాబాద్: ‘పడకేసిన వసతులు’ శీర్షికన ఈనెల 6న ‘సాక్షి’ మెయిన్ పేజీలో ప్రచురితమైన కథనా నికి కలెక్టర్ రాహుల్ రాజ్ స్పందించారు. రిమ్స్‌లో పడకలు సరిపోక రోగులు తిప్పలు పడుతున్నారు. ఒకే పడకపై ఇద్దరు, ముగ్గురేసి ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించగా.. స్పందించిన కలెక్టర్ శుక్రవారం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ, ఫీవర్ వార్డులతో పాటు ఇతర వార్డుల్లో కలియ తిరిగారు. అందుతున్న వైద్యసేవల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డైరెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో ఈనెలలో ఇప్పటివరకు 12 డెంగీ, రెండు మలేరియా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించినట్లు వివరించారు. వారానికి రెండుసార్లు డ్రైడే పాటించాలన్నారు. నీరు నిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కలెక్టర్ వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేదంర్ రాథోడ్, జిల్లా మలేరియా నివారణ అధికారి శ్రీధర్, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, వైద్యులు సుమలత, శ్యాంప్రసాద్ తదితరులు ఉన్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
ఎర్రగుంట్ల:ఎర్రగుంట్లలోని వేంపల్లి రోడ్డులో ఉన్న ఆశ్రమం సమీపంలో బుధవారం లారీ ఢీకొని వెలుర్తి ప్రభాకర్‌రావు(60) దుర్మరణం చెందాడు. మతుడి బంధువులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వెలుర్తి ప్రభాకర్‌రావు ఉదయాన్నే టిఫిన్ కోసమని సైకిల్లో ఇంటి వద్ద నుంచి బయలుదేరాడు. వేంపల్లి రోడ్డుపైకి రాగానే లారీ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కిడిక్కడే మతి చెందాడు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు. సంఘటన స్థలంలో మతదేహంపై పడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మతుడి భార్య పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జీ డాక్టరు ఎంవీ సుదీర్‌రెడ్డి సంఘటన స్థలానికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
ఎర్రగుంట్ల:ఎర్రగుంట్లలోని వేంపల్లి రోడ్డులో ఉన్న ఆశ్రమం సమీపంలో బుధవారం లారీ ఢీకొని వెలుర్తి ప్రభాకర్‌రావు(60) దుర్మరణం చెందాడు. మతుడి బంధువులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వెలుర్తి ప్రభాకర్‌రావు ఉదయాన్నే టిఫిన్ కోసమని సైకిల్లో ఇంటి వద్ద నుంచి బయలుదేరాడు. వేంపల్లి రోడ్డుపైకి రాగానే లారీ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కిడిక్కడే మతి చెందాడు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు. సంఘటన స్థలంలో మతదేహంపై పడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మతుడి భార్య పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జీ డాక్టరు ఎంవీ సుదీర్‌రెడ్డి సంఘటన స్థలానికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.