ఆనందం దక్కేనా..?
నెల్లిమర్ల : ఎయిమ్స్ విద్యా సంస్థల చైర్మన్, టీడీపీ నాయకుడు కడగళ ఆనంద్‌కుమార్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి పోటీ పడుతున్నట్టు సమాచారం. విజయనగరం డివిజన్‌కు సంబంధించి వేరెవరూ ఆ పదవికి పోటీ పడకపోవడంతో ఎమ్మెల్యే లు పతివాడ నారాయణస్వామినాయుడుతో పాటు మీ సాల గీత కూడా ఆయనకే మద్దతు ప్రకటిస్తున్నట్టు స మాచారం. అయితే పార్వతీపురం డివిజన్‌కు చెందిన ఆ పార్టీ నేతలు కొంతమంది ఆయనకు అడ్డు తగులుతున్నట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ డివిజన్‌కే ఆ పదవి కేటాయించాలని గట్టిగా పట్టుబడుతున్నట్టు సమాచారం. దీంతో ఆనంద్‌కుమార్‌కు పదవి దక్కుతుందా.. లేదా అన్నది జిల్లాలో చర్చనీయాం శంగా మారింది.
నెల్లిమర్ల మండలం బొడ్డపేట గ్రా మానికి చెందిన కడగళ ఆనంద్‌కుమార్ స్వయానా నెల్లిమర్ల ఎంపీపీ సువ్వాడ వనజాక్షికి తమ్ముడు. అం తేకాకుండా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సువ్వాడ రవిశేఖర్‌కు బావమరిది. ఇటీవల జరిగిన స్థానిక, సా ధారణ ఎన్నికల్లో టీడీపీ తరఫున బాగా పని చేశారు. ఎంపీపీ ఎన్నికల్లో తన సోదరి గె లుపులో కీలకపాత్ర పోషించారు. కొన్ని పంచాయతీలను దత్తత తీసుకుని పార్టీ గెలుపునకు కృషి చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేసులో ఆయన ఉన్నట్టు తెలిసింది.
విజయనగరం డివిజన్ నుంచి ఈ పదవికి ఎవరూ పోటీ లేకపోవడంతో తనకు మద్దతు ప్రకటించాలని కోరుతూ నెల్లిమర్ల, విజయనగరం ఎమ్మెల్యేలను ఆయన కోరిన ట్టు సమాచారం. వారు కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్టు తెలిసింది.
* అయితే ఇదే పదవి కోసం పార్వతీపురం డివిజన్ నుంచి మరో ఇద్దరు నేతలు పోటీలో ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదవి తమ డివిజన్‌కు ఇవ్వాలని ఆ నేతలు పట్టుబడుతున్నట్టు తెలిసింది.
* ఈ మేరకు వారిని బుజ్జగించేందుకు విజయనగరం డివిజన్‌కు చెందిన కొంత మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆనంద్‌కుమార్ పార్టీ కి కావాల్సిన వ్యక్తని, ఈసారికి డ్రాప్ అయిసొమ్మని వారిని వారిస్తున్నట్టు తెలిసింది.