DISTRICT TOPER
-
శభాష్ రూప శ్రీలేఖ!
- ‘జూనియర్’ ఎంపీసీలో 465 మార్కులతో జిల్లా టాపర్ అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో రూప శ్రీలేఖ 470 మార్కులకుగాను 465 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. నారాయణ జూనియర్ కళాశాలలో చదువుతున్న శ్రీలేఖ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ప్రథమస్థానం దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. ప్రణాళిక ప్రకారం చదివితే మార్కులు సాధించడం సులువేనంది. అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం బాగా కలిసొచ్చిందని, ఇదే స్ఫూర్తితో ద్వితీయ సంవత్సరంలోనూ కష్టపడి చదువుతానని చెప్పింది. -
లీడ్ ఇండియా జిల్లా టాపర్గా ప్రవీణ
రాజోలు : లీడ్ ఇండియా ప్రతిభా పరీక్షల్లో బి.సావరం శోభన పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని జిల్లెళ్ల మెర్సీ ప్రవీణ జిల్లా టాపర్గా నిలిచిందని కరస్పాండెంట్ ఆంటోని గురువారం తెలిపారు. ఈ మేరకు లీడ్ ఇండియా సంస్థ ప్రవీణకు బంగారు పతకం, ప్రశంసాపత్రం అందజేసిందన్నారు. ప్రతిభా పరీక్షల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజోలు, సోంపల్లి, బి.సావరం సర్పంచ్లు మట్టా కృష్ణకుమారి, పొలమూరి శ్యాంబాబు, కుంపట్ల మంజులతాదేవితోపాటు ఉపాధ్యాయులు ప్రవీణను అభినందించారు.