District Vigilance
-
సాదాసీదాగా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ చివరి స మావేశం శనివారం మొక్కుబడిగా.. సాదాసీదా గా ముగిసింది. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవి ర్భావం.. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో సాగిన సమావేశం ఏటీఆర్ (చర్యల నివేదిక) జోలికి వెళ్లలేదు. ఎజెండాలో చేర్చిన 11 ప్రధానమైన అంశాలపై మూడున్నర గంటల్లో చర్చించి మమ అనిపించారు. విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ మధుయాష్కీ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కో-చైర్మన్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, రాజ్యసభ సభ్యులు మహ్మద్ అలీఖాన్, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ వెంకటేశ్వర్రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రారంభోపన్యాసంలో మధుయాష్కీ 29వ రాష్ట్రంలో జిల్లా చివరి విజిలెన్స్, మానిటరింగ్గా పేర్కొం టూ... తెలంగాణవాదులు, అధికారులు, ప్రజలకు ‘తెలంగాణ’ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అసువులు బాసిన అమరవీరులకు రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ప్రొటోకాల్ పేరుతో ఆటంకాలు : అన్నపూర్ణ ఆవేదన ఆభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలపై స్పష్టత లేదంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి (ప్రస్తుతం మాజీ మంత్రి) సుదర్శన్ రెడ్డి, ఎన్పీడీసీఎల్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ తదితర అధికారు ల తీరు వల్ల ఆర్మూరు నియోజకవర్గానికి మంజూరైన సుమారు రూ.200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయలేని పరిస్థితి నెలకొందని ఎమ్మె ల్యే అన్నపూర్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సుదర్శన్‌రెడ్డి సమయం ఇవ్వకపోవడం... అధికారులు ఆయన రానిదే శిలాఫలకం వేయలేమని ‘ప్రొటోకాల్’ పేరిట హక్కులను హరించారని, నేడో, రేపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే తమ పరిస్థితి ఏంటని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్యేలు ఏ పనులు చేపట్టాలనుకున్నా తమ దృష్టికి తేవాలని, ప్రభుత్వ నిబంధనలు, ప్రొటోకాల్స్ని పరిగణలోకి తీసుకుని అభివృద్ధి పనులు సాగేలా చూస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సేద్యానికి పనికి రాని భూములను గుర్తించి ఆ భూముల్లో ఈత, తాటిచెట్ల పెంపకానికి చర్యలు తీసుకోవడం వల్ల 3.50 లక్షల గీత కార్మీకులకు ఉపాధి లభించేలా చూడాలన్నారు. అర్బన్ శాసనసభ్యులు యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ నగరంలో ఐదు తాగునీటి ట్యాంకులు నిర్మాణమై ట్రయిల్న్ ్రకూడా పూర్తి అయినందున ప్రజలకు తాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు వెయ్యిమందే కనెక్షన్లకు దరఖాస్తులు చేసుకున్నారని, 25 వేల మందికి అవకాశం ఉందని కలెక్టర్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కమిషనర్ మంగ తాయారును ఆదేశించారు. రూ.23 కోట్ల నష్టపరిహారంపై సభ్యుల ఆందోళన 2010 నుంచి జిల్లాలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలో రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అన్నపూర్ణమ్మ, యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది ఆంధ్ర ప్రాతానికి చెందిన మూడు జిల్లాలకు రూ.800 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం జిల్లా ప్రజలపై వివక్ష చూపిందన్నారు. శుక్ర, శనివారాల్లో కురిసిన వడగళ్లకు భారీగా పంటలు దెబ్బతిన్నాయని, తక్షణమే సర్వే జరిపించి పరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రద్యుమ్న స్పందిస్తూ రెండు రోజులుగా కురిసిన వర్షం కారణంగాా దెబ్బతిన్న గ్రామాల్లో వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేస్తున్నారని, పూర్తికాగానే నివేదిక ప్రభుత్వానికి పంపిస్తామన్నా రు. కాగా 11 అంశాల ఎజెండాపై విజిలెన్స్, మాని టరింగ్ కమిటీలో చర్చించిన సభ్యులు.. రాష్ర్టపతి పాలన... ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నందున జిల్లా అభివృద్ధిని కలెక్టరే చూసుకోవాలంటూ ఆయనపై భారం వేశారు. ఎన్నికల పోటీ పరీక్షలో మేము బీజీ అయిపోతామంటూ.. కలెక్టర్ ఈ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరడంతో ‘ మాకు కూడా ఎన్నికల ఏర్పాట్ల బిజీ ఉంటుందం’టూ చలోక్తి విసిరారు. సభలో మధుయాష్కీ, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అన్నపూర్ణమ్మలు పార్టీలపై నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు, చలోక్తులు సభికులను పలుమార్లు నవ్వించాయి. సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఏజేసీ శేషాద్రి, వివిధశాఖల ఉన్నతాధికారులు శివలిం గయ్య, నగేశ్, వెంకటేశం, శ్రీనివాస్‌రెడ్డిలతోపాటు పలువురు పాల్గొన్నారు. -
సాదాసీదాగా..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం సాదాసీదాగా ముగిసింది. శనివారం ఎంపీ రాథోడ్ రమేష్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎజెండా ప్రకారం 28 అంశాలపై చర్చించాల్సి ఉండగా.. 15 అంశాలకే పరిమితం చేశారు. పైగా చర్చ జరిగిన అంశాలనూ అంతగా లోతుగా పట్టించుకోలేదు. చెన్నూర్ మండలం కత్తెరశాల వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు చేపట్టిన ధర్నాకు విజిలెన్స్ కమిటీ మద్దతు తెలిపింది. వాగుపై వంతెన నిర్మాణానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రధానంగా వ్యవసాయంలో పంట నష్టం, హౌసింగ్‌లో ఇళ్లను కట్టకుండానే బిల్లులు చెల్లించడం, కూలిపోయిన ఇళ్లు, పంచాయతీ రాజ్ శాఖలో వర్షాలకు చెడిపోయిన రోడ్లపై చర్చ కొనసాగింది. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, డ్వామాలో ఉపాధి హామీ కూలీ డబ్బుల చెల్లింపు, ఇందిర జలప్రభ కింద ఎస్సీ, ఎస్టీల వ్యవసాయ భూములకు సాగునీరు, ఆర్‌డబ్ల్యూఎస్‌లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు కల్పించాల్సిన గ్రామాలకు పైప్‌లైన్ సౌకర్యాలు, మార్కెట్ యార్డులో పత్తి కొనుగళ్లు, విద్యుత్, అంగన్వాడీలపై, పాఠశాలలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అహ్మద్‌బాబు మాట్లాడుతూ.. బేల మండలానికి మంజూరైన సబ్ మార్కెట్‌యార్డు ఏర్పాటుకు స్థలం గుర్తించామని, నాలుగు నెలల్లో కాంటాలతో కూడిన మార్కెట్‌యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. జిన్నింగ్‌మిల్లులో పత్తి కొనుగోళ్లు కుదరదని, అలాగైతే జిల్లా వ్యాప్తంగా చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఐసీడీఎస్‌లో అమృతహస్తం, సబల కార్యక్రమంపై పూర్తి వివరాలను తనకు అందజేయాలని పీడీ మీరాబెనర్జీని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, పంచాయతీ భవనాలు, మండల సమాఖ్య భవన నిర్మాణాలకు, ఇతర పనులకు మార్చి 31 వరకు కొత్తగా మంజూరు ఇవ్వలేమని డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. హౌజింగ్ పీడీ గంగారాం మాట్లాడుతూ.. అవతవకలు జరిగిన మండలాల్లో విచారణ చేపట్టి సంబంధిత ఏఈని సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. విద్యుత్ శాఖ ఎస్ఈ అశోక్ మాట్లాడుతూ.. కరెంటు లేని గ్రామాల్లో స్తంభాలు సరఫరా చేస్తామన్నారు. చెడిపోయిన రోడ్లకు మరమ్మతు కోసం టెండర్లు పిలిచామని ఎస్ఈ ఉమా మహేశ్వర్‌రావు పేర్కొన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీఆర్వో ఎస్ఎస్.రాజు, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జేడీఏ రోజ్‌లీల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇళ్లు కట్టకుండానే బిల్లులు చెల్లించారు.. - రాథోడ్మ్రేష్, ఆదిలాబాద్ ఎంపీ ఏజెన్సీ ప్రాంతమైన పిట్టగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కొసాయి గ్రామంలో గిరిజనులకు, కోలాంలకు, ఎస్సీ, ఎస్టీలకు 20 ఇళ్లు మంజూరయ్యాయి. కానీ.. వారు నిర్మించకుండానే అధికారులే బిల్లులు కాజేశారు. ఇందిర జలప్రభ కింద ఎంత మంది లబ్ధిదారులున్నారు.. ఏయే పనులు చేపట్టాల్సి ఉందో అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు - వివేక్, ఎంపీ, పెద్దపల్లి భీమిని, నెన్నెల, బెల్లంపల్లి మండలాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చాలా అవకతవకలు జరిగాయి. రచ్చబండ కార్యక్రమంలో కూడా ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. దండేపల్లి మండలం వెల్గనూరులో పశుసంవర్ధక శాఖకు చెందిన డాక్టర్ రావడం లేదు. ఇందిరా జలప్రభ కింద ఎస్సీ, ఎస్టీల వ్యవసాయ భూముల్లో బోర్లు వేయకుంటే ఆ పథకం ఫెయిల్ అయినట్లే. ఇటిక్యాల, కోటపల్లి, కాసిపేటలో ఆర్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించిన పనులు ఇంకా ప్రారంభం కాలేదు. రోడ్లు సరిగా లేవు.. - గుండా మల్లేష్, ఎమ్మెల్యే, బెల్లంపల్లి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాకు కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఇంటర్ కనెక్టివిటి కింద చేసి గ్రామాలలో పనులు జరిగేలా చూడాలి. క్లస్టర్ విలేజ్ ట్రైనింగ్ క్యాంప్‌కు ఒక్క గ్రామం, మండలం కానీ ఎంపికకాలేదు. వర్షాలకు రోడ్లు పూర్తి అధ్వానంగా మారాయి. టేకులపల్లి నుంచి మండల కేంద్రానికి వెళ్లాలంటే 15 నుంచి 20 కిలో మీటర్లు వెళ్లాల్సి వస్తుంది. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బెల్లంపల్లి మార్కెట్‌యార్డు విస్తరణకు ప్రభుత్వ భూమి కావాలి. మార్కెట్‌యార్డు పక్కన ఉన్న ఐదారు ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించాలి. రాత్రిపూట చీకట్లో ప్రజలు.. - కావేటి సమ్మయ్య, ఎమ్మెల్యే, సిర్పూర్ సిర్పూర్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, బల్బులు లేక ప్రజలు చీకట్లో ఉంటున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి ఇంకా డబ్బులు చెల్లించలేదు. రోడ్లు బాగా చెడిపోయాయి. పత్తి తీసుకురావాలంటే ఇబ్బందులు.. - గేడం నగేష్, ఎమ్మెల్యే బోథ్ బోథ్ వ్యవసాయ మార్కెట్‌యార్డుకు పత్తి తీసుకురావాలంటే రైతులు ఇబ్బందులు పడుతున్నా రు. నియోజకవర్గంలోని చాలా మండలాల్లో రోడ్లు చెడిపోయి ఉన్నాయి. పనులు చేపట్టాలి. సబ్‌మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలి.. - జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ బేల మండలంలో సబ్ మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం 2008లో మంజూరు చేసింది. కానీ ఇంత వరకు సబ్ మార్కెట్‌యార్డు ఏర్పాటు కాలేదు. బేలలో మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిన్నింగ్ మిల్లుల ద్వారా బేలలో పత్తి కొనుగోలు చేయాలి. జైనథ్‌లో మార్కెట్ యార్డు ఉన్న జిన్నింగ్ మిల్లులు లేవు. ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లే లేవు.. - వేణుగోపాలచారి, ఎమ్మెల్యే ముథోల్ ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు లేవు. రెండేసి రేషన్‌కార్డులు ఉన్నాయి. కుభీర్‌లో 12 ఇండ్లు కాలిపోయాయి. ఇండ్లు పూర్తిగా కట్టుకున్న వారు బిల్లుల కోసం తిరుగుతున్నరు. ఉపాధి కూలీ డబ్బులు అందించాలి. ఆరు గ్రామాలకు ఒక పోస్టాఫీసు మాత్రమే ఉంది. దీని వల్ల ఇబ్బంది అవుతంది. ఆధార్, నగదు బదిలీలాగే వ్యక్తి గత మరుగుదొడ్లను కూడా జిల్లాలో మొదటి స్థానంలో నిలపాలి. ఐసీడీఎస్ అధికారులకు ఫోన్ చేసినా స్పందించడంలేదు. -
తలతిక్క సమాధానాలొద్దు!
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి అందాలని, అర్హులైన ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ ఇవ్వాలని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం అధికారులకు సూచించారు. సంక్షేమం కోసం విడుదల చేసిన ప్రతి సద్వినియోగం కావాలని ఆ దిశగా పనిచేయాల్సి కోరారు. అభివృద్ధి పనులపై తలతిక్క సమాధానాలు వద్దని హెచ్చరిం చారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలకు ఎంపికైన లబ్ధిదారులకు బ్యాంక్ మంజురు పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదని లీడ్‌బ్యాంక్ మేనేజర్‌ను ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరం లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అధ్యక్షత వహించిన ఎంపీ మందా జగన్నాథం మాట్లాడుతూ..తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆక్షేపించారు. వివిధ సంక్షేమ పథకాల కోసం రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం సుమారు రూ.1000 కోట్లు విడుదల చేస్తుందని, ఈ నిధులను సద్విని యోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. ఎస్సీలతో సమానంగా బీసీల అభివృద్ధికి నిధులు ఖ ర్చుచేసి వారి అభ్యున్నతి కోసం పాటుపడాలని సూచించారు. అయిజ మండలంలో కేజీబీవీ పాఠశాల నూతన భవనం పూర్తికాకముందే అందులో తరగతులు నడిపించడంపై ఆర్వీఎం పీఓ పద్మహర్షపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు పూర్తి కాకుండానే తరగతులు నడిపించడం ఏమిటని నిలదీశారు. మూడు నెలలకు ఒకసారి మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. పూర్తి సమాచారంతో రావాలి ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 11.45 గంటలకు ప్రారంభమైంది. అప్పటివరకు ఒక్కొక్కరు గాఅధికారులు హాజరుకావడంతో ఎంపీ వారిపై ఆగ్రహం వ్య క్తంచేశారు. అన్ని సంక్షేమశాఖల అధికారులతో ప్రతి అంశా న్ని క్షుణ్ణంగా సమీక్షించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు అధికారు లు సమాధానం చెప్పలేకపోయారు. పూర్తి ఎజెండా, సమాచారంతో సమావేశానికి రావాలని సూచించారు. అంతకుముం దు కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ మాట్లాడుతూ..సమాజంలోని అ న్ని వర్గాలకు పథకాల అమలులో సామాజిక న్యాయం కల్పిం చేందుకు ఈ కమిటీ ఉపకరిస్తుందన్నారు. ఎవరికి కేటాయించి న నిధులను వారికి ఖర్చుచేసేందుకు కృషిచేయాలని అధికారులకు సూచించారు. సమావేశ ఎజెండాను ముందే ప్రజాప్రతినిధులకు ఇవ్వాలని కోరారు. కాగా, సమావేశానికి జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలకు సమాచారం ఉన్నప్పటికీ కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. సమావేశంలో ఏజేసీ డాక్టర్ రాజారాం, సాంఘిక సంక్షేమశాఖ డీడీ వి.జయప్రకాష్, బీసీ సంక్షేమాధికారి సంధ్య, గిరిజన సంక్షేమాధికారి ఉపేంద్రాచారి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు జరగడం లేదు నా నియోజకవర్గంలో సంక్షేమ కా ర్యక్రమాలు సక్రమంగా అమలు జరగడం లేదు. అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేజీ బీవీలో సిబ్బంది కొరతతో విద్యార్థు లు ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు బ్యాంకులు కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి. - అబ్రహం, ఎమ్మెల్యే అలంపూర్ పథకాలు ప్రజలకు చేరాలి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు చొరవ తీసుకోవడం లేదు. నానియోజకవర్గంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. కొన్ని హాస్టళ్లు శిధిలావస్థకు చేరుకున్నాయి. అధికారులకు చెప్పినా పరిస్థితి మారడం లేదు. సబ్‌ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసంఉపయోగించాలి. - రాములు, ఎమ్మెల్యే, అచ్చంపేట హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేపట్టాలి నా నియోజకవర్గంలో మంజురై న అభివృద్ధి పనులను పూర్తి చేసేం దుకు అధికారులు చొరవచూపాలి. హాస్ట ల్ విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలి. మం జురైన అభివృద్ధి పనులకు సరిపడా నిధులు కేటాయించాలి. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. - సీతమ్మ, ఎమ్మెల్యే దేవరకద్ర విద్యార్థుల మెస్‌చార్జీలు పెంచాలి ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కోట్లు మం జూరుచేస్తున్నా ఖర్చుచేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. నా నియోజకవర్గంలో హాస్టల్‌ను నిర్మించి మూడేళ్లు గడిచినా కరెంట్ లేకపోవడం శోచనీయం. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు దుర్భర జీవితం గడుపుతున్నారు. చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలి. - రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే వనపర్తి