DMK chief M.karunanidhi
-
ఐసీయూలో కరుణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మూత్రనాళ ఇన్ఫెక్షన్కు చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధికి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రక్తపోటు ఒక్కసారిగా తగ్గింది. దీంతో ఆయన్ని చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్సచేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రక్తపోటు నియంత్రణలోకి వచ్చిందని శనివారం రాత్రి ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కరుణానిధి కుటుంబ సభ్యులు వెద్యులతో చర్చించారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, కరుణానిధి కొడుకు స్టాలిన్, కుమార్తె కనిమొళి తదితరులు ఆసుపత్రిలో ఉన్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురై, కరుణానిధి కుటుంబానికి దూరంగా ఉంటున్న పెద్ద కొడుకు అళగిరి ఆస్పత్రికి తండ్రిని పరామర్శించడానికి వచ్చారు. తమిళనాడు గవర్నర్, రక్షణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ వాస్నిక్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. వైద్య సాయాన్నైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..కరుణానిధి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. కరుణానిధి నివాసానికి భారీగా అభిమానులు తరలివస్తున్న దృష్ట్యా ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇద్దరు కార్యకర్తల మృతి.. కరుణానిధి అనారోగ్యంపై వ్యాపించిన వదంతులతో ఇద్దరు డీఎంకే కార్యకర్తలు మరణించారు. వాట్సాప్‌లో కరుణ అనారోగ్యంపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి విని నామక్కల్ జిల్లా నామగిరిపేటకు చెందిన శివషణ్ముగం (64) గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. అలాగే, తిరువారూరు జిల్లా ముత్తుపేటకు చెందిన తమీమ్ (55) శుక్రవారం రాత్రి టీవీలో కరుణానిధి అనారోగ్యంపై వచ్చిన వార్తలు వింటూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. -
30 ఏళ్ల తర్వాత ముఖానికి మేకప్....
- 30 ఏళ్ల తర్వాత మేకప్ - లఘు చిత్రంలో నటనకు రెడీ డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ మళ్లీ నటుడిగా అవతారం ఎత్తేందుకు సిద్ధం అయ్యారు. 30 ఏళ్ల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోనున్నారు. ఎన్నికల ప్రచార నిమిత్తం లఘు చిత్రంలో స్వయంగా నటించేందుకు అన్నాడీఎంకేతో యాక్షన్‌కు దళపతి రెడీ అయ్యారు. సాక్షి, చెన్నై: రానున్న అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో ప్రజాకర్షణ దిశగా డీఎంకే పరుగులు తీస్తోంది. ఓ వైపు డీఎంకే అధినేత ఎం.కరుణానిధి తనదైన శైలిలో ముందుకు సాగుతుంటే, మరోవైపు పార్టీ దళపతి, కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రజల్ని ఆకర్షించడమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తోన్నారు. నియోజకవర్గాల బాటతో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం, టీవీల్లో ప్రకటనల నిమిత్తం ప్రత్యేకంగా ఓ లఘు చిత్రాన్ని రూపొందించేందుకు ఎంకే స్టాలిన్ నిర్ణయించారు. ఇందులో స్వయంగా తానే నటించేందుకు సిద్ధం అయ్యారు. ప్రత్యేక ఆకర్షణ:అన్నాడీఎంకే సర్కారు తీరు, ైవె ఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకె ళ్లడం కోసం ప్రత్యేక ఆకర్షణగా ఓ లఘు చిత్రాన్ని రూపొందించేందుకు స్టాలిన్ కసరత్తులు చేసి ఉన్నారు. అధికార పక్షంతో ఢీ కొట్టేందుకు ముఖానికి మేకప్ వేసుకుని మరీ సిద్ధం అవుతున్నారు. నగర శివారులోని ఓ థీమ్ పార్క్‌లో ఈ లఘు చిత్రం రూపొందించబోతున్నారు. ఇందులో ఎంకే స్టాలిన్ కీలక భూమిక పోషిస్తూ, అధికార పక్షాన్ని ఎండగట్టనున్నారు. ఈ లఘు చిత్రాన్ని తొలుత కలైంజర్ టీవీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. లఘు చిత్రంలో తన నటన ద్వారా ప్రజల్ని ఏ మేరకు ఆకట్టుకోబోతున్నారో వేచి చూడాల్సిందే. అయితే స్టాలిన్‌కు నటన కొత్త కాదన్న విషయం అందరికీ తెలిసిందే. 1987లో కరుణానిధి రూపొందించిన ఒరే రక్తం చిత్రంలో స్టాలిన్ నటించారు. ఇందులో విప్లవ యువకుడి పాత్రలో స్టాలిన్ అందరి మన్ననల్ని దక్కించుకున్నారు. దూరదర్శన్‌లో ప్రసారమై ప్రజాదరణ పొందిన కురింజి మలర్ ధారావాహికలో నటించి ప్రశంసలు అందుకోవడం గమనార్హం.