dog auction
-
బెస్ట్ ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడిన శునకం
లాక్డౌన్లో ఏం చేస్తున్నారు? అంటే ఠక్కున వినిపించేవి.. తినడం, తొంగోవడం. పోనీ ఈ రెండింటి మధ్యలో ఏం చేస్తున్నారూ? అంటే ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ పనిలో... పిల్లల నుంచి పెద్దల దాకా టిక్‌టాక్, ఫోన్ కాల్స్, చాటింగ్, వీడియో కాల్స్, వెబ్ సిరీస్.. అబ్బో.. ఈ లిస్టు చాలా పెద్దది. మనుషుల సంగతి సరే, మరి జంతువులు.. పాపం, బయటకెళ్లి ఆడుకోలేవు, తోటి జంతువులను చూడనూ లేవు. ఇక ఇంట్లో మనుషులను చూసి చూసీ వాటికీ తెగ బోర్ కొట్టేస్తున్నాయి. ఇది గుర్తించిన లైకా అనే పెంపుడు కుక్క యజమాని జెరెమీ హోవార్డ్ ఓ ఐడియా వేశాడు. (పీక్కుతింటున్నా.. 5 గంటల పాటు ఓపికగా ) తన కుక్క బెస్ట్ ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేశాడు. ఇంకేముందీ వీడియో కాల్లో ప్రత్యక్షమైన తన స్నేహితుడు హెన్రీని చూసి ఈ పెంపుడు కుక్కది ఒక అరుపు కాదు.. అక్కడ హెన్రీ కూడా పట్టలేని సంతోషంతో గదిలో గెంతులు వేస్తున్నాడు. కానీ వీళ్లేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క అర్థం కాదు లెండి. వీటి ఆనందాన్ని అంతటినీ కెమెరాల్లో బంధించిన హోవార్డ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముందీ.. శునకాల్లో విశ్వాసమే కాదు.. ప్రేమ కూడా ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (చైనా: స్కూళ్లకు పిల్లలు.. వాళ్ల తలపై..) -
కుక్కను కాల్చి చంపిన వ్యక్తి
-
కుక్కే కదా అని కాల్చేశాడు
సాక్షి, హైదరాబాద్: రోజూ మొరుగుతూ ఇబ్బంది పెడుతుందన్న కారణంతో బర్రెల షెడ్డులో కాపలాగా ఉంటున్న కుక్కను ఓ వ్యక్తి ఎయిర్‌గన్‌తో కాల్చి చంపిన ఘటన సరూర్‌నగర్ ఠాణా పరిధిలోని బాపూ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఎడమ భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో కుక్క అక్కడికక్కడే చనిపోయింది. వివరాలు.. రాజు, దేవేందర్, సుదర్శన్ ముగ్గురు అన్నదమ్ములు కలసి ఓల్డ్ సరూర్‌నగర్ చౌడీ వద్ద బర్రెల షెడ్డును నిర్వహిస్తున్నారు. ఈ షెడ్డులో జాకీ అనే కుక్క కాపలాగా ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆ షెడ్డు నుంచి బయటకు వచ్చిన కుక్క.. బాపూ కాలనీలోని జిమ్‌కోచ్, బ్యాంక్ ఉద్యోగి అవినాశ్ కరణ్ ఇంటికి వెళ్లింది. దీంతో అతడు తన వద్ద ఉన్న ఎయిర్ గన్‌తో కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయింది. దీంతో కుక్క యజమానులు సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఐపీసీ 429, 336 సెక్షన్లతోపాటు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ యాక్ట్ సెక్షన్–11 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఎయిర్‌గన్ కలిగి ఉండటంతో ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. -
పన్ను చెల్లించలేదని కుక్కను వేలం వేశాడు
బెర్లిన్ : అప్పు చెల్లించకపోతే ఆస్తులను వేలం వేస్తారని తెలుసు కదా. ఇదే పద్దతిని ఫాలో అయ్యాడు ఓ పన్ను వసూలు అధికారి. అయితే ఇక్కడ అతడు వేలం వేసింది భూముల్ని, విలువైన ఆస్తుల్ని కాదు.. కుక్కను. అవును పెంపుడు కుక్కను వేలం వేసి వచ్చిన సొమ్మును పన్ను బకాయి కింద జమ చేసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన జర్మనీలో చోటు చేసుకుంది. అయితే బాధిత కుటుంబం గురించి పూర్తి వివరాలు తెలియలేదు. పన్ను బకాయి పడ్డ సదరు యజమాని గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విధులకు కూడా హాజరు కాలేదట. ఈ క్రమంలో అతడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌ను సకాలంలో కట్టలేకపోయాడు. కుక్క పన్నుతో సహా పలు ఇతర పన్నులు బకాయిపడ్డాడు. ఈ నేపథ్యంలో పన్ను వసూలు అధికారి ఆ కుటుంబానికి చెందిన పలు విలువైన ఆస్తులతో పాటు వారికి బహుమతిగా లభించిన పెంపుడు కుక్కను కూడా వేలం వేశాడు. ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన కుక్క కాస్తా దాదాపు రూ. 60 వేలకు అమ్ముడయ్యింది. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. సదరు అధికారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు. ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం తగదు.. అతడు నిబంధనలను అతిక్రమించి మూగ జీవి పట్ల క్రూరంగా వ్యవహరించాడు. అతని మీద చర్యలు తీసుకోవాల’ని డిమాండ్ చేస్తున్నారు. పన్ను వసూలు కోసం కుక్కను అమ్మాడంటే.. మనుషుల్ని కూడా అమ్ముతాడనడంలో సందేహం లేదని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
వేలంలో రూ. 15 లక్షలు పలికిన కుక్క!
గొర్రెలను కాసేందుకు వాటి పెంపకందారులు ఉపయోగించే ఒక కుక్క.. బ్రిటన్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. వేలంలో దాన్ని ఏకంగా దాదాపు రూ. 15 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. డెనెగల్ కౌంటీలో పెరిగిన ఈ 16 నెలల కుక్కను ఉత్తర యార్క్‌షైర్‌లోని స్కిప్టన్లో వేలం వేస్తే ఈ కళ్లు తిరిగే ధర పలికింది. దీనికి మహా అయితే రూ. 2 లక్షల వరకు వస్తుందని భావించానని, కానీ చాలా మంచి రేటు వచ్చిందని కుక్క అసలు యజమాని పాడ్రైగ్ డోహెర్టీ ఆనందపడ్డారు. ఉత్తర ఐర్లండ్‌కు చెందిన ఓ అజ్ఞాత వ్యక్తి ఈ కుక్కను కొనుగోలు చేశాడు. తన ఫాంలో పనికోసం దీన్ని ఉపయోగించుకుంటానని అతడు చెప్పాడట. ఇంతకుముందు ఇలాంటి జాతికే చెందిన ఓ కుక్కను 2013లో దాదాపు రూ. 10 లక్షలకు వేలం పాడుకున్నారని, ఆ రేటు కంటే ఇది చాలా ఎక్కువని స్కిప్టన్ ఆక్షన్ మార్ట్ ప్రతినిధులు చెప్పారు. అసలు సిసలైన చాంపియన్ షీప్ డాగ్‌లా ఇది పెరిగిందని, అందుకే ఇంత రేటు వచ్చిందని వేలం శాల ప్రతినిధి ఒకరు చెప్పారు. గొర్రెలను కాయడంలో ఇది చాలా పనిమంతురాలని, దీనికి అద్భుతమైన సత్తా ఉందని దాని యజమాని డోహెర్టీ చెప్పారు.