Domestic Investors
-
ఈక్విటీలపై ఎఫ్‌పీఐల ఆసక్తి
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెల(డిసెంబర్)లో ఇప్పటివరకూ దేశీ ఈక్విటీలలో నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. అనిశ్చుతులలోనూ రూ. 11,557 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో కోవిడ్ ఆందోళనల నేపథ్యంలోనూ దేశీ ఈక్విటీలపట్ల ఆసక్తి చూపారు. అయితే సమీప భవిష్యత్‌లో యూఎస్ స్థూల ఆర్థిక గణాంకాలు, కోవిడ్ పరిస్థితులు ఎఫ్‌పీఐ పెట్టుబడులపై ప్రభావం చూపనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ పేర్కొన్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం డిసెంబర్ 1–23 మధ్య ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 11,557 కోట్ల విలవైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. కాగా.. గత నెల(నవంబర్)లో ఎఫ్‌పీఐలు మరింత అధికంగా రూ. 36,200 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! ఇందుకు యూఎస్ డాలరు బలహీనపడటం, స్థూల ఆర్థిక పరిస్థితుల సానుకూలత దోహదం చేశాయి. అయితే అంతకుముందు అంటే అక్టోబర్‌లో నామమాత్రంగా రూ. 8 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. సెప్టెంబర్‌లో రూ. 7,624 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. -
అమ్మకానికి ఎయిర్ ఇండియా?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఏకైక స్వదేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రయివేటు పరం చేసేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. కుంభకోణాల ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియాను నష్టాలు వస్తున్నాయనే కారణంతో విక్రయించడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రుణ భారంతో ఉన్న ఎయిర్ లైన్స్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు దేశంలోని టాప్ థింక్-ట్యాంక్ నితి ఆయోగ్ సిఫార్సు చేసింది. సీనియర్ అధికారులు సమాచారం ప్రకారం ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) కు సమర్పించిన సిఫారసులలో ఎయిర్ ఇండియాలో 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియలో దేశీయ, ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ కు అవకాశం కల్పించాలని కోరింది. ఎయిర్ ఇండియాకు రూ.30 వేల కోట్ల రుణాల రైట్ ఆఫ్ సహా దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్‌ను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ సిఫారసుకు మద్దతుగా వివిధ అంతర్జాతీయ ఉదాహరణలకు ఇవ్వడం విశేషం. ముఖ్యంగా బ్రిటిష్ ఎయిర్వేస్, జపాన్ ఎయిర్ లైన్స్, ఆస్ట్రియన్ ఎయిర్ లో ఆయా ప్రభుత్వాలు మొత్తం వాటాలను విక్రయించినట్టు సూచించారు. అయితే దీనిపై స్పందించిన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు నీతి ఆయోగ్ సిఫారసులను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణపై హింట్ ఇచ్చిన నేపథ్యంలో నీతి ఆయోగ్ సిఫార్సులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గత వారంలో ఆర్థిక మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎయిర్ ఇండియా ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా 14 శాతం మార్కెట్ వాటాతో ,రూ 50 వేల కోట్లు అప్పుల్లో ఉన్నట్టు వ్యాఖ్యానించారు. మరోవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎయిర్ ఇండియా , ఇండియన్ ఎయిర్‌లైన్స్‌పై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఒప్పందం ద్వారా రూ. 70,000 కోట్ల విలువైన 111 బోయెంగ్ విమానాలను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ద్వారా మరింత అప్పుల ఊబిలోకి కూరకుపోయిందని సీబీఐ ఆరోపించింది. దీనికి సంబంధించి విమానయాన శాఖ, ఎయిర్ ఇండియాకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులపై కేసలు నమోదు చేసింది. సిబిఐ విచారణకు సహకరిస్తామని పౌర విమాన యాన శాఖమంత్రి అశోక్ గజపతి ప్రకటించారు. కాగా ఎయిర్ ఇండియా మొత్తం అప్పులు రూ. 60వేల కోట్లు. అందులో రూ. 21,000 కోట్ల విమానాల సంబంధిత రుణాలు, రూ .8 వేల కోట్ల మూలధన పెట్టుబడి ఉన్నాయి. -
విదేశీ ఫండ్స్‌పై భారతీయుల క్రేజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పుడు దేశీయ ఇన్వెస్టర్లు డాలర్లు, యూరోల్లో ఇన్వెస్ట్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. విదేశీ ఫండ్స్ ముఖ్యంగా అమెరికా, యూరో దేశాల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ అధిక లాభాలను అందిస్తుండటంతో వీటిపై ఆసక్తిని కనపరుస్తున్నారు. ఒకపక్క దేశీయ మ్యూచువల్ ఫండ్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు వైదొలుగుతుంటే, విదేశీ ఫండ్స్‌లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో అమెరికా, యూరప్ దేశాల ఫండ్స్ 40 నుంచి 50 శాతం దాకా రాబడులను అందించాయి. కాని ఇదే సమయంలో మన సెన్సెక్స్ కేవలం 13 శాతం, నిఫ్టీ 11 శాతం రాబడులను మాత్రమే అందించాయి. దేశీయ ఫండ్స్ కంటే అమెరికా, యూరప్ ఫండ్స్ అధిక లాభాలను అందించడానికి రూపాయి క్షీణత కూడా దోహదం చేసిందంటున్నారు నిపుణులు. గడిచిన ఏడాది కాలంలో అమెరికా మార్కెట్లు 26 శాతం రాబడిని అందిస్తే ఇదే సమయంలో రూపాయి విలువ 18 నుంచి 20 శాతం క్షీణించింది. కొత్త పథకాల వెల్లువ: ఇండియాతో పోలిస్తే గత రెండేళ్ళుగా అమెరికా వృద్ధి రేటు బాగుండటం, అక్కడి మార్కెట్లు పెరుగుతుండటంతో దేశీయ ఇన్వెస్టర్లు ఈ విదేశీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.శరత్ శర్మ చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో ఇండియాలో నిర్వహిస్తున్న అమెరికా ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.251 కోట్ల నుంచి రూ.658 కోట్లకు చేరిందంటే, వీటిపై ఏ విధంగా ఆసక్తి చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు విదేశీ ఫండ్స్‌ను ప్రారంభించడానికి అనుమతి కోరుతూ సెబీ తలుపులు తడుతున్నాయి. కోటక్, రెలిగేర్, పైన్ బ్రిడ్జ్ ఇండియాలు అమెరికా ఫండ్స్‌ను ప్రారంభించడానికి సెబీకి దరఖాస్తు చేసుకోగా, జేపీ మోర్గాన్, రెలిగేర్ సంస్థలు యూరోప్ ఫండ్, రిలయన్స్ జపాన్ ఫండ్స్‌ను ప్రారంభించడానికి రెడ్ హెర్రింగ్ ప్రోస్పెక్టస్ను దాఖలు చేసుకున్నాయి. ఇవికాకుండా ఎస్బీఐ వంటి మరికొన్ని సంస్థలు ఇదే ఆలోచనలో ఉన్నాయి. తాము కూడా గ్లోబల్ ఫండ్స్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నామని, ఇందుకోసం అమెరికాలో ఒక భాగస్వామిని వెతికే పనిలో ఉన్నామని, ఇదంతా ఇంకా ప్రారంభ దశలోనే ఉందని శర్మ పేర్కొన్నారు. రూపీ రిస్క్ ఉంటుంది అమెరికా మార్కెట్ లాభాలకు తోడు, దేశీయ కరెన్సీ పతనంతో దేశీయ ఇన్వెస్టర్లు రెండిందాల లాభపడ్డారని, కాని ప్రతీసారి అదే విధమైన పరిస్థితులు ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కూడా రూపాయి ఇదే విధంగా పతనమవుతుందని ఆశించడం ఆత్యాశ అవుతుందన్నది వారి అభిప్రాయం. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్ల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లే ఎక్కువ లాభాలను అందిస్తాయని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి పేర్కొన్నారు. ఒక్కసారి మన ఆర్థిక వ్యవస్థ కుదుటపడి, కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే రూపాయి విలువ పెరుగుతుందని, ఆ మేరకు ఈ ఫండ్స్ లాభాలు తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది కాలానికి ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయోచ్చని, అది కూడా మొత్తం పోర్ట్‌ఫోలియోలో 10 శాతం మించకుండా చూసుకోమని సతీష్ సూచిస్తున్నారు. టాప్5 విదేశీ ఫండ్స్ పథకం పేరు- ఎన్ఏవీ(రూ.లలో)- ఏడాది రాబడి% ఎఫ్టీ ఇండియా యూఎస్ ఆపర్చునుటీస్- 16.57 - 52 మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 - 207.36 - 46 ఐసీఐసీఐ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ -15.13 - 45 డీఎస్‌పీబీఆర్ యూఎస్ ఫ్లెక్సిబుల్ -14.06 - 39 డీడబ్ల్యూఎస్ గ్లోబల్ థీమటిక్ ఆఫ్‌షోర్- 12.74 - 37