డబుల్ డెక్కర్ రైలులో పనిచేయని ఏసీలు
గంట పాటు డోన్‌లో నిలిపివేత
డోన్ రూరల్, న్యూస్‌లైన్: తిరుపతి నుంచి కాచిగూడకు బయలుదేరిన డబుల్ డెక్కర్ రైలులో గురువారం ఏసీలు పనిచేయలేదు. అలాగే నీటి సరఫరా కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డోన్ రైల్వేస్టేషన్‌కి 12 గంటలకు చేరగానే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
రైలులో అసౌకర్యాలపై డోన్ స్టేషన్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రైల్వే సిబ్బందితో మాట్లాడి.. ఏసీలకు మరమ్మతులు చేయించారు. అలాగే నీటి సరఫరాను పునరుద్ధరించారు. పనులు పూర్తికాగానే ఒంటి గంటకు డబుల్ డెక్కర్ రైలు కాచిగూడకు బయలుదేరి వెళ్లింది. ప్రయాణికులు దాదాపు గంట పాటు డోన్ రైల్వే స్టేషన్లో నిరీక్షించాల్సి వచ్చింది.