28న డీఎస్సీ–03 టీచర్ల సమావేశం
అనంతపురం ఎడ్యుకేషన్ : డీఎస్సీ–2003 ఉపాధ్యాయులు నియామకంలో అప్పటి ప్రభుత్వ ఉదాసీనత వల్ల జాప్యం జరిగి పాత పెన్షన్ కోల్పోయి కొత్త పెన్షన్ విధానంలోకి నెట్టబడిందని దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టు ద్వారా పాత పెన్షన్ సాధనకు కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 28న ఉదయం 9.30 గంటలకు ఉపాధ్యాయ భవనంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.
సమావేశానికి జిల్లా వ్యాప్తంగా డీఎస్సీ–03 ఉపాధ్యాయులు అందరూ హాజరుకావాలని ప్రతినిధులు డి. వరదరాజులు, కె.మధుప్రసాద్, ఎంఎంవీ ప్రసాద్, కేసీ హాజీవలి, ఎస్. ఆదినారాయణ, పి. చంద్ర, మునెయ్య పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు 96401 04914,94904 83640 నంబర్లలో సంప్రదించాలని కోరారు.