డ్యూక్ నయా కలెక్షన్ అమేజీంగ్..!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ క్లాతింగ్ బ్రాండ్.. డ్యూక్ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ‘స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ 2021’ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. అంతర్జాతీయ ఫ్యాషన్ సంస్కృతిని దృష్టిలో ఉంచుకుంటూనే, స్వావలంభన, భారత్ భావాలకు అనుగుణంగా భారత్లో వీటిని ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. టీషర్ట్స్, షర్ట్స్, డెనిమ్, ట్రౌజర్స్, టాప్స్, జెగ్గింగ్స్, యాక్టివేర్, స్పోర్ట్స్వేర్, యాక్ససరీస్, ఫుట్వేర్, వంటివి వీటిలో ఉన్నాయి. ధరల శ్రేణి రూ.425-2,499 వరకూ ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: చేనేత చీరల్లో ప్రస్తుతం వేటికి డిమాండ్ ఉంది?