dus ka dum
-
ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్!
ఇద్దరు సూపర్‌స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనబడితే ఆ కిక్కే వేరు. అది కూడా ఇండియా వైడ్‌గా పాపులారిటీ ఉన్న స్టార్స్ అయితే అది వైరల్ కావల్సిందే. ప్రస్తుతం ఇలాంటి ఓ పిక్ సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. లోక నాయకుడు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్.. బాలీవుడ్ కండలవీరుడు,సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ల పిక్స్ నెట్టింట్లో జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోన్నాయి. కమల్ సినిమా విశ్వరూపం వివాదాల మధ్య విడుదలై ఘన విజయం సాధించింది. మళ్లీ ఇన్నేళ్లకు విశ్వరూపం2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ ట్రెండింగ్‌గా మారింది. హాలివుడ్ స్థాయిలో ఉన్న యాక్షన్ సీన్స్ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను కమల్ ప్రారంభించాడు. బాలీవుడ్లో రియాల్టీ షోలు ఫేమస్. వాటికి హోస్ట్‌గా సల్మాన్ మరింత ఫేమస్. సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘దస్కాదమ్’ షోలో కమల్ ప్రత్యక్షమయ్యారు. ఈ మూవీ విశేషాలను కమల్ పంచుకున్నట్లు సమాచారం. ఈ షో జూలై 22న ప్రసారం కానుంది. -
మరోసారి బుల్లితెరపై సల్మాన్...
రియాలిటీ షో ‘బిగ్‌బాస్’కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా మరో కార్యక్రమం ద్వారా బుల్లితెరపై మెరవబోతున్నారు. విజయవంతమైన ‘దస్ కా దమ్’ మూడో సిరీస్‌కు సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన తొలి ప్రోమోను ఈ కండల వీరుడు తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ఇలాంటి టీవీ షోలను ఆసక్తికరంగా నడిపించడంలో ఈ ‘దబాంగ్’ హీరోకు మంచి ప్రావీణ్యం ఉందనే చెప్పవచ్చు. తన ఆసక్తికర వాఖ్యలతో ప్రేక్షకులను కట్టిపడేయడం సల్మాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. 20 వారాలపాటు ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికిగాను సల్మాన్ 78కోట్ల రూపాయలు తీసుకోనున్నట్లు సమాచారం. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ నుంచి ‘దస్ కా దమ్’ కార్యక్రమం ప్రారంభంకానున్నట్లు సమాచారం. ఈ సారి ‘దస్ కా దమ్’ కార్యక్రమంలో సామాన్యులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు టీవీ నటులు కూడా పాల్గొననున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో నేషనల్ సర్వేకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. సమాధానాలను శాతాలలో (పర్సంటేజ్) చెప్పాల్సి ఉంటుంది. సరైన లేదా సమీప సమాధానం చెప్పినవారు 10 వేల నుంచి 10 కోట్ల రూపాయల వరకూ గెలుచుకుంటారు. -
‘దస్ కా దమ్’ అదుర్స్