
ఇద్దరు సూపర్‌స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనబడితే ఆ కిక్కే వేరు. అది కూడా ఇండియా వైడ్‌గా పాపులారిటీ ఉన్న స్టార్స్ అయితే అది వైరల్ కావల్సిందే. ప్రస్తుతం ఇలాంటి ఓ పిక్ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. లోక నాయకుడు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్.. బాలీవుడ్ కండలవీరుడు,సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ల పిక్స్ నెట్టింట్లో జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోన్నాయి.
కమల్ సినిమా విశ్వరూపం వివాదాల మధ్య విడుదలై ఘన విజయం సాధించింది. మళ్లీ ఇన్నేళ్లకు విశ్వరూపం2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ ట్రెండింగ్‌గా మారింది. హాలివుడ్ స్థాయిలో ఉన్న యాక్షన్ సీన్స్ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను కమల్ ప్రారంభించాడు.
బాలీవుడ్‌లో రియాల్టీ షోలు ఫేమస్. వాటికి హోస్ట్‌గా సల్మాన్ మరింత ఫేమస్. సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘దస్‌కాదమ్’ షోలో కమల్ ప్రత్యక్షమయ్యారు. ఈ మూవీ విశేషాలను కమల్ పంచుకున్నట్లు సమాచారం. ఈ షో జూలై 22న ప్రసారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment