viswaroopam-2
-
ఇక ఆ సన్నివేశాలు చెయ్యను
తమిళసినిమా: సంచలన తారల్లో నటి అండ్రియా ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు నచ్చిన పనిచేయడానికి ఏమాత్రం వెనుకాడని నటి ఈమె. ఆ మధ్య యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో రోమాన్స్ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినా, డోంట్‌కేర్, వ్యక్తిగత విషయాల గురించి ఇతరులకు బదులివ్వాల్సిన అవసరం లేదని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చింది. నటిగానే కాకుండా మంచి గాయని కూడా అయిన ఆండ్రియా ఏ తరహా పాత్రనైనా చాలెంజ్‌గా తీసుకుని నటించేది. అలా వేశ్య పాత్రలో నటించడానికీ వెనుకాడలేదు. ఇక ఇటీవల విడుదలైన విశ్వరూపం–2 చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించి శభాష్ అనిపించుకుంది. ఇంతకుముందు గ్లామరస్ పాత్రల్లోనూ నటించిన ఆండ్రియా తరమణి లాంటి చిత్రాల్లో మంచి నటనను ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ధనుష్‌తో నటిస్తున్న వడ చెన్నై చిత్రంలోనూ చాలా వైవిధ్యభరతమైన పాత్రలో కనిపించనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉంది. దీంతో తన పంథాను మార్చుకుందట. చాలా సెలెక్టెడ్ చిత్రాలే చేస్తున్న ఈ భామ ఇకపై గ్లామర్ పాత్రల్లో నటించరాదన్న నిర్ణయం తీసుకుందట. నటనకు అవకాశం ఉన్న కథా పాత్రలనే అంగీకరించనున్నట్లు పేర్కొంది. ఇకపై ఇమేజ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించనున్నట్లు చెప్పింది. కాబట్టి దానికి భంగం కలిగించే లిప్‌లాక్, హీరోలతో సన్నిహితంగా నటించడం, హద్దులు మీరిన గ్లామర్ పాత్రల్లో నటించడం వంటి విషయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కథ వినే ముందే దర్శక నిర్మాతలకు చెప్పేస్తోందట. ఇప్పటి వరకూ అండ్రియా వేరు ఇకపై వేరు అని ఈ సంచలన నటి అంటోంది. చూద్దాం ఈ అమ్మడు తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందో. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో వడచెన్నై, కా అనే రెండు చిత్రాలే ఉన్నాయన్నది గమనార్హం. -
శ్రీరెడ్డి వ్యవహారం గురించి అడుగుతున్నారు..
తమిళసినిమా: మహిళలకు ధైర్యం అవసరం అంటోంది నటి ఆండ్రియా. తనకు నచ్చిన విధంగా జీవించే అతి కొద్ది మంది నటీమణుల్లో ఈ జాణ ఒకరని చెప్పకతప్పదు. విమర్శలను, వివాదాలను అసలు పట్టించుకోని నటి ఆండ్రియా. తొలుత గాయనిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత నటిగా తెరపైకి వచ్చింది. అలా పచ్చైక్కిళి ముత్తుచ్చారం, ఆయిరత్తిల్ ఒరువన్, విశ్వరూపం, తరమణి చిత్రాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషించి తనకంటూ సొంత ఇమేజ్ను సంపాదించుకున్న ఆండ్రియా తాజాగా కమలహాసన్‌తో నటించిన విశ్వరూపం–2 చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ముచ్చట్లు చూద్దాం. విశ్వరూపం చిత్రానికి కొనసాగింపుగానే విశ్వరూపం–2 ఉంటుంది. ఇందులో అశ్విత పాత్రలో నటించాను. తొలి భాగంలో కంటే రెండో భాగంలోనే అశ్విత ఎవరన్నది ప్రేక్షకులకు అర్థం అవుతుంది. చిత్రంలో ఫైట్స్ కూడా చేశాను. ఇంతకు ముందు కాలక్షేపం కోసమే చిత్రాల్లో నటించాను. అయితే విశ్వరూపం చిత్రంలో నటించిన తరువాత సామాజిక బాధ్యత ఎక్కువైంది. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరికి బాధ్యత అవసరం. ఎవరి పని వారు చేయడం కాదు. అదే విధంగా పాఠ్యాంశాల్లో విద్యను అభ్యసించడంతదో సరిపోదు. దేశపోకడలను తెలుసుకోవాలి. నటన విషయంలో నిబంధనలు విధిస్తున్నారా అని అడుగుతున్నారు. చిత్రాల్లో నటించడానికి ఎలాంటి నిబంధనలు విధించను. అయితే కథ నాకు నచ్చాలి. అదే ముఖ్యం. విశ్వరూపం–2 చిత్రం తరువాత వడచెన్నై చిత్రంలో నటించాను. ఆ తరువాత ఏ చిత్రంలోనూ నటించలేదు. ఆరు నెలలు ఖాళీగానే ఉన్నాను. ప్రస్తుతం వడచెన్నై డబ్బింగ్ జరుగుతోంది. ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల కథా చిత్రాల్లో నటిస్తున్నారే అని అడుగుతున్నారు. అలా నటించడం వల్ల నా స్థాయి తగ్గుతుందని భావించడం లేదు. నా కథా పాత్ర ఏమిటి? దర్శకుడు ఎవరు? అన్న అంశాలపైనే దృష్టి పెడతాను. నేను నటనతో పాటు గాయనీగానూ కొనసాగుతున్నాను. నా దృష్టిలో ఈ రెండూ ఒకటే. ఎందులో అవకాశం వస్తే అది చేస్తాను. ఇటీవల సంచలనంగా మారిన నటి శ్రీరెడ్డి వ్యవహారం గురించి అడుగుతున్నారు. ఆమె చెప్పేది నిజం అయితే వాటిని బహిరంగ పరచానికి చాలా ధైర్యం కావాలి. నాకైతే అలాంటి సంఘటనలు ఎదురు కాలేదు. అలా ఎవరికైనా జరిగితే ధైర్యంగా బయట పెట్టడం కరెక్ట్. అందుకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలి. ఇకపోతే ప్యూచర్ ప్లాన్ ఏమిటీ అని అడుగుతున్నారు. నేను మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేస్తానో తెలియదు. అలాంటిది ఫ్యూచర్ ప్లాన్ గురించి అడుతున్నారు. -
విశ్వరూపం–2కు తప్పని కష్టాలు
తమిళసినిమా: నటుడు కమలహాసన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కమలహాసన్ నటించి, నిర్మించిన విశ్వరూపం చిత్రం విడుదల సమయంలో పలు సమస్యలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా దానికి సీక్వెల్‌గా తెరకెక్కించిన విశ్వరూపం–2ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. పలు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొని ఎట్టకేలకు ఈ నెల 10వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర విడుదలపై నిషేధం విధించాల్సిందిగా కోరుతూ సాయిమీరా చిత్ర నిర్మాణ సంస్థ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో తమ సంస్థ కమలహాసన్ కథానాయకుడిగా నటించి, కథా, కథనం, దర్శకత్వం బాధ్యతలు వహించే విధంగా మర్మయోగి చిత్రానికి ఆయన సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ సంస్థతో 2008లో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. అందుకుగానూ చిత్ర నిర్మాణానికి రూ.6.90కోట్లు ఖర్చు చేసిందన్నారు. కమలహాసన్‌కు అడ్వాన్స్‌గా రూ.4కోట్లు చెల్లించిందన్నారు. అయితే కమల్ మర్మయోగి చిత్రాన్ని పూర్తి చేయకుండా ఆ డబ్బుతో ఉన్నైపోల్ ఒరువన్ చిత్రం చేసుకున్నారన్నారు. దీంతో తమ డబ్బును తిరిగి చెల్లించాల్సిందిగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా కమలహాసన్ విశ్వరూపం–2 చిత్రాన్ని ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారన్నారు. తమ డబ్బు తిరిగి చెల్లించే వరకూ విశ్వరూపం–2 చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా కమల్ తరఫు న్యాయవాది రిట్ పిటిషన్‌కు గడువు కోరారు. న్యాయమూర్తి సీవీ. కార్తీకేయన్ ఈ కేసు విషయంలో నటుడు కమలహాసన్,ఆస్కార్ ఫిలింస్ సంస్థలకు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూ, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
‘సినిమా’ వదులుకునే ప్రసక్తే లేదు
సాక్షి, చెన్నై : రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, సినిమాల్ని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ వ్యాఖ్యానించారు. విశ్వరూపం–2 సాధించే విజయం మేరకు విశ్వరూపం–3 తీయడానికి తాను సిద్ధమేనని పేర్కొన్నారు. ఒక్క రూపాయి జీతం తీసుకుని ప్రజా సేవ చేయడం కష్టతరమేనన్నారు. కమల్ నటించి, రూపొందించిన విశ్వరూపం–2 ఆగస్టు పదో తేదీన తెరమీదకు రానుంది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం చెన్నైలో కమల్ మీడియాతో మాట్లాడారు. విశ్వరూపం–2 కథ ఎప్పుడో సిద్ధం చేసుకున్నా, దశావతారం, మన్మ«థ అంబు వైపు తన పయనం సాగిందన్నారు. దేశం రెండుగా చీలడానికి ప్రధాన కారణం మత రాజకీయాలేనన్న అంశం మేరకు ఈ కథ పుట్టుకొచ్చిందన్నారు. ఇందులో రాజకీయాలకు ఆస్కారం లేదని, అమెరికాకు వత్తాసు పలికే పరిస్థితులు, అంశాలు లేవని స్పష్టంచేశారు. అమెరికా, తీవ్రవాదుల మధ్య ఉన్న తప్పుల్ని ఎత్తి చూపించే చిత్రంగా విశ్వరూపం–2 ఉంటుందన్నారు. ఈ చిత్రం సాధించే విజయం మేరకు విశ్వరూపం–3 తీయడానికి తాను సిద్ధం అని వ్యాఖ్యానించారు. విశ్వరూపం–1 విడుదల సమయంలో పెద్ద వ్యతిరేకతే బయలుదేరిందని గుర్తుచేస్తూ, ఆ పరిస్థితి ప్రస్తుతం రాదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రంలో తన పార్టీ గురించి, తన పార్టీ జెండాలు, ఇతర అంశాల గురించి ఎలాంటి ప్రస్తావన ఉండదన్నారు. ఎంజీఆర్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కాలంలో సాంకేతిక అభివృద్ధి లేదని, అందుకే ఆయన తన చిత్రాల్లో జెండాను చూపించుకున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, అనేక మార్గాలు ప్రచారాలకు ఉన్నాయన్నారు. ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం కూడా సినిమాల్లో నటించారని గుర్తుచేస్తూ, తానూ రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, సినిమాల్ని వదులుకునే ప్రసక్తే లేదన్నారు. సినిమాల్లో నటిస్తూనే ఉంటానని పేర్కొంటూ, ఒక్క రూపాయి జీతం తీసుకుని ప్రజా సేవ సాగించడం కష్టతరమేనని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. -
ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్!
ఇద్దరు సూపర్‌స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనబడితే ఆ కిక్కే వేరు. అది కూడా ఇండియా వైడ్‌గా పాపులారిటీ ఉన్న స్టార్స్ అయితే అది వైరల్ కావల్సిందే. ప్రస్తుతం ఇలాంటి ఓ పిక్ సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. లోక నాయకుడు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్.. బాలీవుడ్ కండలవీరుడు,సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ల పిక్స్ నెట్టింట్లో జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోన్నాయి. కమల్ సినిమా విశ్వరూపం వివాదాల మధ్య విడుదలై ఘన విజయం సాధించింది. మళ్లీ ఇన్నేళ్లకు విశ్వరూపం2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ ట్రెండింగ్‌గా మారింది. హాలివుడ్ స్థాయిలో ఉన్న యాక్షన్ సీన్స్ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను కమల్ ప్రారంభించాడు. బాలీవుడ్లో రియాల్టీ షోలు ఫేమస్. వాటికి హోస్ట్‌గా సల్మాన్ మరింత ఫేమస్. సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘దస్కాదమ్’ షోలో కమల్ ప్రత్యక్షమయ్యారు. ఈ మూవీ విశేషాలను కమల్ పంచుకున్నట్లు సమాచారం. ఈ షో జూలై 22న ప్రసారం కానుంది. -
టాలీవుడ్‌కు ఆండ్రియా
టీ.నగర్: తెలుగు చిత్రం ‘ఆయుష్మాన్‌భవ’లో నటించేందుకు ఆండ్రియా ఒప్పందం కుదుర్చుకున్నారు. గత ఏడాది విడుదలైన ‘అవళ్’ చిత్రం తర్వాత ఆండ్రియా మరే చిత్రం విడుదల కాలేదు. అయితే తమిళంలో ఆమె నటించిన రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ చిత్రంలో కమల్‌కు జంటగా నటించిన పూజాకుమార్‌కు సమానంగా ఆండ్రియాకు బలమైన కథా పాత్ర లభించింది. ఈ ఏడాది విడుదలకానున్న విశ్వరూపం–2 చిత్రంలో మొదటి భాగం కంటే అధిక సన్నివేశాలలో నటించారు. ఆ చిత్రంలో డాన్స్ చేసిన ఆండ్రియా ఈ చిత్రంలో సైనిక దుస్తుల్లో సంచరిస్తుంటారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన వడచెన్నై చిత్రంలోను ముఖ్యపాత్రలో నటిం చారు. తెలుగులో చరణ్‌తేజ్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆయుష్మాన్‌భవ’. స్నేహా ఉల్లాల్ కథానాయకిగా నటిస్తున్నా రు. ఇందులో జెనిఫర్ అనే పాప్ గాయనిగా నటించేందుకు ఆండ్రియా ఒప్పందం కుదుర్చుకున్నారు. త్వరలో ప్రారంభం కానున్న షూటింగ్లో ఆం డ్రియా పాల్గొననున్నారు. ఇంతేకాకుండా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘సొల్లాదే యారుం కేట్టాల్’ అనే థ్రిల్లర్ చిత్రంలోను ఆం డ్రియా నటిస్తున్నారు. -
స్క్రీన్ ప్లే 11th June 2018
-
విశ్వరూపం–2 సూపర్!
తమిళసినిమా: విశ్వరూపం–2 చిత్రం సూపర్బ్‌గా వచ్చిందని ఆ చిత్ర సృష్టికర్త కమలహాసన్ పేర్కొన్నారు. ఈయన విశ్వరూపం చిత్ర షూటింగ్ సమయంలోనే పార్టు–2ను కూడా చాలా వరకు పూర్తి చేశారన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్ సంస్థ విడుదల హక్కులను పొంది చాలా కాలం పూర్తి చేయలేకపోయింది. దీంతో కొన్నేళ్లుగా మూలన పడ్డ విశ్వరూపం చిత్రానికి విముక్తి కలిగించే బాధ్యతను చివరికి కమలహాసనే తీసుకున్నారు. ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించి నిర్మిస్తున్న విశ్వరూపం–2 చిత్రంలో నటి పూజాకుమార్, ఆండ్రియ కథానాయికలుగా నటించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర తుది షెడ్యూల్ షూటింగ్‌ను కమల్ ఇటీవలే చెన్నైలో పూర్తి చేశారు. చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను అమెరికాలో నిర్వహించే పనిలో ఆయన ముమ్మరంగా ఉన్నారు. విశ్వరూపం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను అమెరికాలోనే పూర్తి చేశారన్నది గమనార్హం. ఇప్పుడు విశ్వరూపం-2 చిత్రానికి సౌండ్ ఎఫెక్ట్ కార్యక్రమాలను కమల్ అమెరికాలో రోజుకు 15 గంటల చొప్పున పని చేస్తూ పూర్తి చేశారు. ఈ విషయం గురించి ఆయన ట్విట్టర్లో పేర్కొంటూ చిత్ర సౌండ్ ఎఫెక్ట్, సన్నివేశాలు సూపర్బ్‌గా వచ్చాయి. ఇందుకు కృషి చేసిన యూనిట్ అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని కమల్ జనవరి చివరి వారంలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. శభాష్ నాయుడు చిత్రాన్ని పూర్తి చేసి ఆపై రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్లు తాజా సమాచారం. -
ఆన్ ట్రాక్
పక్కోడు చెప్పాడనో, ఎదుటోడు పాటించాడనో లేకపోతే స్వాతంత్య్రం రోజునో, గణతంత్ర దినోత్సవం రోజునో గుర్తొచ్చేది కాదు దేశభక్తి అనేది. కన్నతల్లికి, కన్నభూమికి రుణపడి ఉండాలన్న బాధ్యత మనసులో ఉండాలి.. చేతల్లో కనిపించాలి. సరిగ్గా ఇలాంటి ఆలోచనలే ఉన్న కొందరు పౌరులు దేశ రక్షణకు ఎలా పాటుపడ్డారు? ఎటువంటి త్యాగాలు చేశారు? వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్న అంశాల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘విశ్వరూపం–2’. కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ, నటిస్తున్న చిత్రమిది. 2013లో ఆయన స్వీయ దర్శకత్వంలోనే వచ్చిన ‘విశ్వరూపం’ చిత్రానికి సీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ ఆకాడమీ ట్రైనింగ్ (ఓటీఏ)లో జరుగుతోంది. ‘‘విశ్వరూపం–2’ షూటింగ్ జరుపుతున్నాం. ఎగై్జటింగ్‌గా ఉంది. ఓటీఏ చెన్నై నాతో పాటు దేశాన్ని గర్వపడేలా చేస్తుంది. ఇండియాలో లేడీ ఆఫీసర్స్‌ను ట్రైన్ చేసే ఏకైక ఆకాడమీ ఇదే. లేడీ ఆఫీసర్స్ అందరికీ సెల్యూట్. భరతమాతకు వందనం’’ అని పేర్కొన్నారు కమల్‌హాసన్. ‘‘చాలా కాలం తర్వాత ‘విశ్వరూపం–2’ ట్రాక్‌లోకి వచ్చింది. కమల్‌గారితో నటిస్తున్నందుకు ఆనందగా ఉంది. సినిమాలో నా లుక్ నచ్చింది. ఈ సినిమాలోని పాత్రలో భాగంగా హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నాను. 2018లో థియేటర్స్‌లో కలుసుకుందాం’’ అన్నారు ఆండ్రియా. -
దళిత సమస్యని తెరకెక్కిస్తున్న కమల్..?
-
‘పాపనాశం’లో కమల్ నిమగ్నం
నటుడు కమలహాసన్ పాపనాశం చిత్ర షూటింగ్లో పూర్తిగా లీనమైపోయాడు. ఆయన నటిస్తున్న విశ్వరూపం-2, ఉత్తమవిలన్ చిత్రాల షూటింగ్ పూర్తి కావడంతో తాజా చిత్రం పాపనాశం షూటింగ్లో పాల్గొంటున్నారు. మలయా ళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని సాధించిన దృశ్యం చిత్రానికి రీమేక్ పాపనాశం. ఈ చిత్రంతో కమల్ సరసన నటించే నటి ఎవరన్న విషయంపై శ్రీదేవి, సిమ్రాన్ మొదలగు సీనియర్ నటీమణుల పేర్లు ప్రచారమయ్యాయి. చివరికి కమల్‌తో నటించే అవకాశం నటి గౌతమికి దక్కింది. ఈ చిత్ర షూటింగ్ తిరునల్వేలి సమీపంలోని నంగునెరి, పాపనాశం ప్రాంతాలలో ముమ్మరంగ సాగుతోంది. కాగా చిత్ర షూటింగ్ విరామ సమయాల్లో కమల్ ఆ ప్రాంతాల్లోని ఆధ్యాత్మిక పండితుల్ని, సామాజిక సేవకులను కలుసుకోవడం విశేషం. నంగునేరిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడి తోడాద్రి నాదర్ వైష్ణవ మఠాన్ని సందర్శించి మఠంలోని జీయర్ను కలుసుకున్నారు. అక్కడాయన చొక్కా తీసి ఒంటికి విబూది పూసుకోవడంతో విమర్శలు ఎదరయ్యాయి. అనంతరం కమల్ ప్రముఖ పరిశోధకుడు టీ.పరమశివంను కలిశారు. తెన్‌కాశిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతానికి చెందిన సామాజిక సేవకుడు కృష్ణను కలిసి సంభాషించారు. కమల్‌లోని ఈ మార్పునకు పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
విశ్వరూపం-2 తర్వాత సూపర్‌స్టార్
రాబర్ట్ డి నీరో... వయసు 70. కానీ, హీరోగా ఫుల్ బిజీ. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటారు. అల్ పాసినో... వయసు 73. హీరోగా ఈయనగారూ బిజీయే. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేయాల్సిందే. ఇంతకీ ఈ ఇద్దరి పేర్లూ ఎక్కడా విన్నట్లు లేదే? అని హాలీవుడ్ సినిమాలు ఫాలో అవ్వనివారు అనుకోవడం సహజం. హాలీవుడ్ స్టార్స్‌లో ఈ ఇద్దరికీ ప్రముఖ స్థానమే ఉంది. ఇక, మన భారతీయ సినిమా విషయానికి వద్దాం. ఏడు పదుల వయసు దాటినవారు హీరోలుగా చలామణీ అవ్వడం చాలా చాలా అరుదైన విషయం. కమల్‌హాసన్ ఇటీవల ఈ విషయం గురించి ఆలోచించి ఉంటారు. అందుకే, ఇదే విషయాన్ని ప్రధానాంశంగా చేసుకుని సినిమా తీయాలనుకుని ఉంటారు. ప్రస్తుతం ఆయన ‘విశ్వరూపం-2’కి దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత పైన పేర్కొన్న కథాంశంతో కమల్ సినిమా చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇందులో సూపర్‌స్టార్‌గా కమల్ నటించబోతున్నారట. వయసు మీద పడినంత మాత్రాన సూపర్ స్టార్‌గా రాణించే అవకాశం లేదనే అభిప్రాయాన్ని మార్చే విధంగా ఈ చిత్రం ఉంటుందట. ఈ చిత్రంలో తన స్నేహితుడు మరియు మేనేజర్ పాత్రకు అనంత్ మహదేవన్‌ని అడిగారట కమల్. పలు హిందీ, మరాఠీ చిత్రాలకు దర్శకత్వం వహించడంతోపాటు పలు చిత్రాల్లో నటించారు అనంత్. ప్రస్తుతం ‘విశ్వరూపం-2’లో కూడా నటిస్తున్నారు. దాదాపు పది రోజుల క్రితం ఆయనకు కమల్ ఫోన్ చేసి, తదుపరి చిత్రం గురించి చెప్పారట. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది తెలియాల్సి ఉంది.