టాలీవుడ్‌కు ఆండ్రియా | andriya In Tollywood Movie | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌కు ఆండ్రియా

Jul 14 2018 7:46 AM | Updated on Jul 14 2018 7:46 AM

andriya In Tollywood Movie - Sakshi

టీ.నగర్‌: తెలుగు చిత్రం ‘ఆయుష్మాన్‌భవ’లో నటించేందుకు ఆండ్రియా ఒప్పందం కుదుర్చుకున్నారు. గత ఏడాది విడుదలైన ‘అవళ్‌’ చిత్రం తర్వాత ఆండ్రియా మరే చిత్రం విడుదల కాలేదు. అయితే తమిళంలో ఆమె నటించిన రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. కమల్‌హాసన్‌ ‘విశ్వరూపం’ చిత్రంలో కమల్‌కు జంటగా నటించిన పూజాకుమార్‌కు సమానంగా ఆండ్రియాకు బలమైన కథా పాత్ర లభించింది. ఈ ఏడాది విడుదలకానున్న విశ్వరూపం–2 చిత్రంలో మొదటి భాగం కంటే అధిక సన్నివేశాలలో నటించారు.

ఆ చిత్రంలో డాన్స్‌ చేసిన ఆండ్రియా ఈ చిత్రంలో సైనిక దుస్తుల్లో సంచరిస్తుంటారు. వెట్రిమారన్‌ దర్శకత్వంలో ధనుష్‌ నటించిన వడచెన్నై చిత్రంలోను ముఖ్యపాత్రలో నటిం చారు. తెలుగులో చరణ్‌తేజ్‌ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆయుష్మాన్‌భవ’. స్నేహా ఉల్లాల్‌ కథానాయకిగా నటిస్తున్నా రు. ఇందులో జెనిఫర్‌ అనే పాప్‌ గాయనిగా నటించేందుకు ఆండ్రియా ఒప్పందం కుదుర్చుకున్నారు. త్వరలో ప్రారంభం కానున్న షూటింగ్‌లో ఆం డ్రియా పాల్గొననున్నారు. ఇంతేకాకుండా బాలాజీ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘సొల్లాదే యారుం కేట్టాల్‌’ అనే థ్రిల్లర్‌ చిత్రంలోను ఆం డ్రియా నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement