పక్కోడు చెప్పాడనో, ఎదుటోడు పాటించాడనో లేకపోతే స్వాతంత్య్రం రోజునో, గణతంత్ర దినోత్సవం రోజునో గుర్తొచ్చేది కాదు దేశభక్తి అనేది. కన్నతల్లికి, కన్నభూమికి రుణపడి ఉండాలన్న బాధ్యత మనసులో ఉండాలి.. చేతల్లో కనిపించాలి. సరిగ్గా ఇలాంటి ఆలోచనలే ఉన్న కొందరు పౌరులు దేశ రక్షణకు ఎలా పాటుపడ్డారు? ఎటువంటి త్యాగాలు చేశారు? వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్న అంశాల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘విశ్వరూపం–2’. కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ, నటిస్తున్న చిత్రమిది. 2013లో ఆయన స్వీయ దర్శకత్వంలోనే వచ్చిన ‘విశ్వరూపం’ చిత్రానికి సీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ ఆకాడమీ ట్రైనింగ్ (ఓటీఏ)లో జరుగుతోంది. ‘‘విశ్వరూపం–2’ షూటింగ్ జరుపుతున్నాం. ఎగై్జటింగ్‌గా ఉంది.
ఓటీఏ చెన్నై నాతో పాటు దేశాన్ని గర్వపడేలా చేస్తుంది. ఇండియాలో లేడీ ఆఫీసర్స్‌ను ట్రైన్ చేసే ఏకైక ఆకాడమీ ఇదే. లేడీ ఆఫీసర్స్ అందరికీ సెల్యూట్. భరతమాతకు వందనం’’ అని పేర్కొన్నారు కమల్‌హాసన్. ‘‘చాలా కాలం తర్వాత ‘విశ్వరూపం–2’ ట్రాక్‌లోకి వచ్చింది. కమల్‌గారితో నటిస్తున్నందుకు ఆనందగా ఉంది. సినిమాలో నా లుక్ నచ్చింది. ఈ సినిమాలోని పాత్రలో భాగంగా హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నాను. 2018లో థియేటర్స్‌లో కలుసుకుందాం’’ అన్నారు ఆండ్రియా.
Comments
Please login to add a commentAdd a comment