Dynamic fare system
-
పండగ వేళ ఎక్స్ట్రా బాదుడు
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్‌లైన్స్ తరహాలో పీక్ సీజన్ సమయంలో అదనపు చార్జీలు వసూలు చేయాలని రైల్వేలు యోచిస్తున్నాయి. పండగ సమయంలోనూ ప్రయాణీకులపై అదనపు చార్జీలు ముక్కుపిండి వసూలు చేసేందుకు కసరత్తు సాగుతోంది. అయితే అదే సమయంలో అన్‌సీజన్‌లో చార్జీల్లో డిస్కౌంట్ ఆఫర్ చేసేందుకూ సన్నద్థమవుతున్నాయి. సీనియర్ రైల్వే అధికారులు, బోర్డు సభ్యులతో ఇటీవల రైల్వే మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయిన సందర్భంగా ఈ ప్రతిపాదనపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్న డైనమిక్ ప్రైసింగ్ విధానం ప్రవేశపెట్టాలని రైల్వే బోర్డు ఈ సమావేశంలో ప్రతిపాదించగా సానుకూల స్పందన వ్యక్తమైందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అవసరమైన సూచనలతో తూర్పు, పశ్చిమ, పశ్చిమ కేంద్ర రైల్వే జోన్లు సవివర ప్రజెంటేషన్‌తో ముందుకొచ్చాయి. అసౌకర్య వేళల్లో తిరిగే రైళ్లలో ప్రయాణీకులను ఆకర్షించేందుకు చార్జీల్లో భారీ రాయితీలు ఇవ్వాలని జోనల్ అధికారులు సూచించారు. ఖాళీ బెర్త్‌లపై 10 నుంచి 30 శాతం డిస్కౌంట్ ఇవ్వాలనీ అధికారులు సూచించారు.ఇక పీక్ సీజన్, పండుగ వేళల్లో చార్జీలను 10 నుంచి 20 శాతం మేర పెంచాలని పలు జోనల్ అధికారులు ప్రతిపాదించారు. వారాంతాలతో పాటు దీపావళి, దసరా, క్రిస్మస్ వంటి పండుగల సమయంలో అదనపు చార్జీలను వసూలు చేయాలని సూచించారు.హైస్పీడ్ రైళ్లలోనూ ఆ రూట్లోని ఇతర రైళ్లతో పోలిస్తే అదనపు చార్జీలు ఉండాలని ప్రతిపాదించారు. -
డిమాండ్‌ను బట్టి రైలు చార్జీల మోత
శతాబ్ది, రాజధాని, దురంతో టికెట్ల ధరలకు రెక్కలు! న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.500 కోట్ల ఆదాయమే లక్ష్యంగా రైల్వే శాఖ రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్ల టికెట్ ధరలను అమాంతం పెంచనుంది. 10 నుంచి 50 శాతం వరకు ధరలు పెరగొచ్చు. ఈ రైళ్లలోని రెండో తరగతి, మూడో తరగతి ఏసీ, చైర్ కార్ కోచ్‌లలో, దురంతో రైళ్లలోని స్లీపర్ క్లాస్‌లలో ఈ కొత్త ధరలను అమలుచేయనున్నారు. దళారులను అడ్డుకునేందుకు ఈ పద్ధతిని సెప్టెంబర్ 9 నుంచి ప్రయోగాత్మకంగా తెస్తున్నామని రైల్వే బోర్డు సభ్యుడు మొహమ్మద్ జంషెడ్ తెలిపారు. 3-4 నెలల తర్వాత ధరలను సమీక్షించనున్నారు. మొత్తం సీట్లలో 10 శాతం సీట్లను సాధారణ ధరలకు విక్రయిస్తారు. ఆ తర్వాత ప్రతీ పదిశాతం సీట్ల ధరలను పదిశాతం చొప్పున పెంచుతూ మొత్తం బెర్తుల్లో సగం బెర్తులను ఇలా అధిక ధరలకు విక్రయిస్తారు. దీంతో సెకండ్ ఏసీ, చైర్ కార్ ధరలు 59 శాతం, థర్డ్ ఏసీ ధరలు 40 శాతం పెరిగే వీలుంది. పౌరవిమానయాన రంగంలో అమల్లో ఉన్న వినూత్న ధరల విధానాన్ని ఇలా రైల్వేల్లో అమలుచేయనున్నారు. ఫస్ట్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలు, రిజర్వేషన్, సూపర్‌ఫాస్ట్, కేటరింగ్, సర్వీస్ చార్జీల్లో మార్పు లేదు. 42 రాజధాని, 46 శతాబ్ది, 54 దురంతో రైళ్లలో కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ఉదాహరణకు ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ముంబై రాజధాని రైల్లో థర్డ్ ఏసీ టికెట్ సాధారణ ధర రూ.1628 ఉంటే అది 10శాతం ఎక్కువతో రూ.1791, 50శాతం ఎక్కువతో రూ.2,279కు చేరనుంది. -
పండుగల సీజన్లో ప్రయాణికులకు చార్జీల షాక్
50శాతం తత్కాల్ కోటాకు డివూండ్ ప్రాతిపదికన పెరిగిన చార్జీలు న్యూఢిల్లీ: పండుగల సీజన్లో రైల్వే ప్రయూణికులకు ఇది చేదువార్త. దేశవ్యాప్తంగా 80రైళ్లలోని తత్కాల్‌కోటా టికెట్లలో సగం టికెట్ల ధరలు గణనీయుంగా పెరిగాయి. ప్రయూణికుల డివూండ్ ప్రాతిపదికగా, తత్కాల్ టికెట్లలో సగం కోటాను ‘డైనమిక్ ఫేర్ సిస్టమ్’ పరిధిలోకి తేవాలని రైల్వేశాఖ నిర్ణరుుంచడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పండుగల సీజన్ వుధ్యలో ప్రయూణికుల రద్దీని సొవుు్మచేసుకోవడం ద్వారా రైల్వే ఆదాయూన్ని పెంచుకోవడమే లక్ష్యంగా రైల్వేశాఖ ఈ నిర్ణయుం తీసుకుంది. తత్కాల్ కోటాలోని తొలి 50శాతం టికెట్లు ప్రస్తుత చార్జీలతోనే బుకింగ్ జరిగాక, మిగిలిన 50శాతం టికెట్లకు ప్రీమియుం ధరలను వర్తింపజేస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియుర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ నెలలోనే అవులులోకి వచ్చిన ‘ప్రీమియుం తత్కాల్ టికెట్’ పథకాన్ని ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంచినట్టు రైల్వే బోర్డు (ట్రాఫిక్) సభ్యుడు డీపీ పాండే చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన 80రైళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నావున్నారు. ఇందుకోసం ఒక్కో జోన్లో ఐదేసి రైళ్లను గుర్తించాలని ఆయూ రైల్వే జోన్లను ఆదేశించినట్టు చెప్పారు. బ్లాకులో టికెట్లు విక్రయూనికి పాల్పడేవారి బెడదను అరికట్టేందుకే ఈ కొత్త చార్జీల వ్యవస్థను వర్తింపజేస్తున్నట్టు రైల్వే శాఖ చెబుతోంది. హైదరాబాద్-న్యూఢిల్లీ ఏపి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-హజరత్ నిజావుుద్దీన్ దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సికిందరాబాద్-హౌరా ఫలక్‌నువూ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-బెంగళూరు ఎక్ప్రెస్, సికిందరాబాద్-పాట్నా ఎక్‌ప్రెస్‌లకు కూడా ఈ పథకం వర్తింపజేస్తున్నారు. ‘డైనమిక్ ఫేర్ సిస్టమ్’ అంటే: ‘డైనమిక్ ఫేర్ సిస్టమ్’ ప్రకారం తత్కాల్ కోటాలో తొలి 50శాతం టికెట్లు ప్రస్తుత రేట్లతోనే బుక్ చేస్తారు. తదుపరి 10శాతం టికెట్లకు 20శాతం ఎక్కువగా చార్జీ వసూలు చేస్తారు. ఉదాహరణకు ఒక ‘థర్డ్‌ఏసీ’ రైల్వేబోగీలో 60సీట్లు అందుబాటులో ఉంటే, వాటిలో 30టికెట్లకు సాధారణమైన తత్కాల్ చార్జీలు వర్తిస్తారుు. మిగిలిన 30సీట్లలో పదిశాతం సీట్లకు, అంటే 3సీట్లకు, 20శాతం ఆదనపు చార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఆ తర్వాత మిగిలిన 27 సీట్లకు ఇదే పద్ధతిలో, 20శాతం అదనపు చార్జీ వర్తిస్తూపోతుంది.