e-commerce industry
-
సర్వే:ఈ పండుగ సీజన్లో జనం ఎక్కువగా కొనే వస్తువులు ఇవే?!
ఈ ఏడాది పండుగ సీజన్లో ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు స్థూలంగా 9 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను (జీఎంవీ) విక్రయించే అవకాశం ఉందని కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ తెలిపింది. గతేడాది ఇదే సీజన్లో నమోదైన 7.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే 23 శాతం వృద్ధి కనపర్చే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తి ఏడాదికి మొత్తం ఆన్లైన్ స్థూల జీఎంవీ 49–52 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండవచ్చని, గతేడాదితో పోలిస్తే 37 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని ఈ–కామర్స్ పండుగ సీజన్ నివేదికలో రెడ్‌సీర్ అంచనా వేసింది. ఆర్డర్ల రద్దు, వాపసు చేయడం మొదలైన వాటిని తీసివేయడానికి ముందు, స్థూలంగా అమ్ముడైన ఉత్పత్తుల మొత్తం విలువను స్థూల జీఎంవీగా వ్యవహరిస్తారు. కోవిడ్ తరవాత పరిసథితుల నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ గణనీయంగా పెరగడం.. అమ్మకాల వృద్ధికి దోహదపడగలదని రెడ్ సీర్ తెలిపింది. కొత్త మోడల్స్ ఆవిష్కరణల ఊతంతో మొబైల్స్ విక్రయాలు అత్యధికంగా ఉండగలవని, ఆ తర్వాత స్థానంలో ఎలక్ట్రానిక్స్..గృహోపకరణాలు మొదలైనవి ఉంటాయని పేర్కొంది. చదవండి: ఉద్యోగుల ధోరణి మారింది, ఈ వస్తువులపై పెట్టే ఖర్చు భారీగా పెరిగింది -
కోల్‌కతా ఐఐఎంలో కొలువుల జాతర
కోల్‌కతా: ఈ సంవత్సరంలో ఈ-కామర్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఐఐఎం కోల్ కతాలో నిర్వహించబోయే క్యాంపస్ ప్లేస్ మెంట్ విభాగంలో మరో రెండున్నర రోజుల్లో 2013-15 బ్యాచ్ ఈ-కామర్స్ విద్యార్థులకు 100 శాతం ప్లేస్ మెంట్లు రాబోతున్నాయి. మొత్తం 438 సీట్లున్న ఈ-కామర్స్ విభాగంలో 47 మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మందికి క్యాంపస్ ప్లేస్ మెంట్లు దక్కనున్నాయని కోల్ కతా ఐఐఎం ఒక ప్రకటనలో తెలిపింది. అమెజాన్, స్పాన్ డీల్, ఫ్లిప్ కార్ట్, ఓలాకేబ్స్, గ్రూప్ ఆన్, క్వికర్, అర్బన్ లాడర్, కార్ ట్రేడ్ వంటి పలు కంపెనీలు క్యాంపస్ ప్లేస్ మెంట్లు నిర్వహించనున్నాయి. ఒక్క ఫైనాన్స్ విభాగంలోనే 100కు పైగా విద్యార్థులు ఉద్యోగావకాశాలు పొందనున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్, గోల్డ్ మేన్ సాచ్స్, సిటీబ్యాంక్, బిఎన్పీ పరిబాస్, డచ్ బ్యాంక్, అవెండస్ కాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ ఐబీడీ, ఎడెల్వీస్, అలీగ్రో అడ్వైజర్స్ ఇంకా మరికొన్ని ఫైనాన్స్ సంస్థలు మొదటి రోజు ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయని ఐఐటీ కోల్ కతా ప్రకటించింది. ఒక్క కన్సల్టింగ్ విభాగంలోనే దాదాపు 20 శాతం మంది ఉద్యోగాలు పొందనున్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, బైన్ అండ్ కో, మెక్కిన్సే, ఏటీ కియర్నీ, అసెంచర్ మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ కంపెనీలు ఈ విభాగంలో ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయి. మొత్తం 18 ఆఫర్లలో అసెంచర్ దే అగ్రభాగం. సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాలు 19 శాతం ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. పి అండ్ జీ, రెకిట్ బెన్ కిసర్, కెలాగ్స్, ఐటీసీ, ఫిలిప్స్, కోకాకోలా, పెప్సికో, మాండెలెజ్, డాబర్, అల్షాయా రిక్రూటెడ్ పీపీఓ కంపెనీలు ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. -
9 వేల కోట్ల డాలర్లకు భారత్ ఈ కామర్స్!
* 2021కల్లా చేరే అవకాశం * ఈటెయిలింగ్ ఇండియా అంచనా ముంబై: ఈ కామర్స్ పరిశ్రమ జోరుగా వృద్ధి సాధిస్తోంది. ప్రస్తుతం 1,300 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ పరిశ్రమ 2021 కల్లా 9,000 కోట్ల డాలర్లకు (రూ. 5.5 లక్షల కోట్లు) పెరుగుతుందని ఈటెయిలింగ్ ఇండియా వ్యవస్థాపకులు అశిష్ జలాని చెప్పారు. ఈ 700 శాతం వృద్ధి కారణంగా కంపెనీల భవిష్యత్ ఆన్లైన్ ప్రకటనల బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా మార్పులు, చేర్పులు ఉంటాయని పేర్కొన్నారు. గతంలో రిటైల్ పరిశ్రమకు అనుబంధంగా ఉన్న ఈ కామర్స్ పరిశ్రమ కొన్ని సంవత్సరాల్లోనే పూర్తి స్థాయి పరిశ్రమగా ఎదిగిందని వివరించారు. యాపిల్ సంస్థ కారణంగా సంగీత పరిశ్రమలో భారీగా మార్పులు, చేర్పులు వచ్చినట్లుగానే ఈ కామర్స్ పరిశ్రమ రిటైల్ రంగాన్నే కాకుండా ప్రకటనల రంగాన్ని కూడా బాగానే ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. భారత్‌లో అధికులు తమ స్మార్ట్ఫోన్ల ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్ వంటి సంస్థల మొత్తం ట్రాఫిక్‌లో 35 శాతం స్మార్ట్ఫోన్ల ద్వారానే వస్తోందని వివరించారు. స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరుగుతుండడం, ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపడడం వంటి కారణాల వల్ల భవిష్యత్తులో వేల సంఖ్యలో కొత్త వినియోగదారులు అందుబాటులోకి వస్తారని వివరించారు. ఈ ఏడాది చివరి కల్లా అమెరికాలో కంటే కూడా భారత్‌లో ఇంటర్నెట్ను వినియోగించే వారి సంఖ్య అధికంగా ఉంటుందని గూగుల్ ఇండియా ఇటీవలనే పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 2018 కల్లా భారత్‌లో అన్లైన్ వినియోగదారుల సంఖ్య 50 కోట్లుగా ఉంటుందని అంచనాలున్నాయన్నారు.