కోల్కతా ఐఐఎంలో కొలువుల జాతర
కోల్కతా: ఈ సంవత్సరంలో ఈ-కామర్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఐఐఎం కోల్ కతాలో నిర్వహించబోయే క్యాంపస్ ప్లేస్ మెంట్ విభాగంలో మరో రెండున్నర రోజుల్లో 2013-15 బ్యాచ్ ఈ-కామర్స్ విద్యార్థులకు 100 శాతం ప్లేస్ మెంట్లు రాబోతున్నాయి. మొత్తం 438 సీట్లున్న ఈ-కామర్స్ విభాగంలో 47 మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మందికి క్యాంపస్ ప్లేస్ మెంట్లు దక్కనున్నాయని కోల్ కతా ఐఐఎం ఒక ప్రకటనలో తెలిపింది.
అమెజాన్, స్పాన్ డీల్, ఫ్లిప్ కార్ట్, ఓలాకేబ్స్, గ్రూప్ ఆన్, క్వికర్, అర్బన్ లాడర్, కార్ ట్రేడ్ వంటి పలు కంపెనీలు క్యాంపస్ ప్లేస్ మెంట్లు నిర్వహించనున్నాయి. ఒక్క ఫైనాన్స్ విభాగంలోనే 100కు పైగా విద్యార్థులు ఉద్యోగావకాశాలు పొందనున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్, గోల్డ్ మేన్ సాచ్స్, సిటీబ్యాంక్, బిఎన్పీ పరిబాస్, డచ్ బ్యాంక్, అవెండస్ కాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ ఐబీడీ, ఎడెల్వీస్, అలీగ్రో అడ్వైజర్స్ ఇంకా మరికొన్ని ఫైనాన్స్ సంస్థలు మొదటి రోజు ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయని ఐఐటీ కోల్ కతా ప్రకటించింది.
ఒక్క కన్సల్టింగ్ విభాగంలోనే దాదాపు 20 శాతం మంది ఉద్యోగాలు పొందనున్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, బైన్ అండ్ కో, మెక్కిన్సే, ఏటీ కియర్నీ, అసెంచర్ మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ కంపెనీలు ఈ విభాగంలో ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయి. మొత్తం 18 ఆఫర్లలో అసెంచర్ దే అగ్రభాగం. సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాలు 19 శాతం ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. పి అండ్ జీ, రెకిట్ బెన్ కిసర్, కెలాగ్స్, ఐటీసీ, ఫిలిప్స్, కోకాకోలా, పెప్సికో, మాండెలెజ్, డాబర్, అల్షాయా రిక్రూటెడ్ పీపీఓ కంపెనీలు ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి.