న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయాల్లో చివరి సంవత్సరం పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను పంజాబ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సరైంది కాదని పేర్కొంటున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో జరగాల్సిన ఆఖరి సంవత్సరం పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహించాలని యూజీసీ ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు మార్గదర్శకాల్లో సవరణలు సైతం చేసింది. ఆరు రాష్ట్రాల అభ్యంతరాలపై హెచ్చార్డీ శాఖ అధికారి ఒకరు స్పందిం చారు. విద్యార్థుల ఉన్న త చదువులు, భవిష్యత్తు ఉద్యో గ అవకాశాల దృష్ట్యా ఫైనలియర్ పరీక్షలు రాయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పా రు. రాష్ట్రాలు తమకు వీలైన సమయంలోనే ఈ పరీక్షలు నిర్వహించవచ్చని సూచిం చారు. ఆన్‌లైన్ విధానంలోనూ పరీక్షలు రాసే అవకాశం ఉందని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment