
యూజీసీ సెక్రెటరీ రజనీష్ జైన్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ వల్ల నిలిచిపోయిన పరీక్షలు, ప్రవేశాలు, అకడమిక్ క్యాలెండర్‌పై చర్చించేందుకు విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసరంగా సమావేశమైంది. విద్యా సంవత్సరంలో కోత, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌పై ఏర్పాటు చేసిన ప్యానెళ్లు ఇచ్చిన నివేదికలపై చర్చించారు. త్వరలో యూనివర్సిటీలు, కాలేజీలకు తగిన మార్గదర్శకాలు జారీ చేస్తామని యూజీసీ సెక్రెటరీ రజనీష్ జైన్ చెప్పారు.