earnings season
-
ఒరుగు.. ఎంతో మెరుగు
కుల్కచర్ల వికారాబాద్: మామిడి ఒరుగుతో మండల పరిధి లోని చౌడాపూర్, మందిపల్, వీరాపూర్, కాముని పల్లి, రాంరెడ్డిపల్లి గ్రామాలలో ప్రజలు ఉపాధి పొ ందుతున్నారు. స్థానికంగా మామిడి తోటలు త క్కువగా ఉండటంతో ఇతర ప్రాంత్రాల నుంచి మామిడి కాయలు దిగుమతి చేసుకుని ఇక్కడి ఒ రుగు చేసి మార్కెట్లకు తరలిస్తున్నారు. దీంతో చా లా మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. గ్రా మాలలో నీడకు కూర్చుని ఒరుగు తయారు చేస్తున్నారు. రోజుకు 200 నుంచి 300 రూపాయల వరకు ఉపాధి పొందుతున్నారు. గాలివానకు మామిడి కాయలు రాలిపోవడంతో అవి వృథా కాకుండా వాటిని కోసి ఒరుగు తయారు చేసుకున్నారు. ఆదే ఉపాధిగా ఈ గ్రామాలలో ప్రతి సంవత్సరం సీజన్ వ్యాపారంగా మారింది. నిరుద్యోగ యువకులు మండల పరిధిలోని పలు గ్రామలలో ఉన్న మామిడి తోటలను పూత దశలోనే కొనుగోలు చేస్తున్నారు. వాటిని కాపలా కాసీ మామిడి కాయలు కోసి మహిళల చేత ఒరుగు తయారు చేస్తున్నారు. దీంతో స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు. మండల పరిధిలోని 6 గ్రామాలలో నెల రోజుల పాటు రోజు సూమారు 100 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ మామిడి తోటలు లభ్యం కాకుంటే అనంతపురం నుంచి మామిడి కాయలు తీసుకువచ్చి ఒరుగు తయారు చేస్తున్నామని అంటున్నారు. ఒక సంచి మామిడి కాయలను 150 రూపాయల నుంచి 200 రూపాయలు వరకు ఇచ్చి ఒరుగు తయారు చేస్తున్నారు. ఈ ఒరుగుకు హైదరాబాద్లో మార్కెట్ లేదని నిజామాబాద్ తీసుకెళ్లి మార్కెట్ చేస్తున్నామని హైదరాబాద్ ప్రాంతంలో మార్కెట్ ఉంటే బాగుండేదని, స్థానికంగా మార్కెట్ సౌకర్యాం కల్పించాలని ఒరుగు వ్యాపారులు కోరుతున్నారు. సీజన్లో ఉపాధి పొందుతున్నాం ప్రతి సీజన్లో రోజు కూలీ వరకు సంపాది స్తాం. మామిడి కాయలు చిన్నగా ఉన్న సమయంలో తోటలను రై తుల నుంచి కొనుగో లు చేస్తాం. రెండు నెలలు వాటిని కాపలా కాసి కాయలు పెద్దగా అయిన తరువాత కో సి ఒరుగు తయారు చేయిస్తున్నాం. ఒక్కొక్క సారి కాయలు చిన్నగా ఉన్నప్పుడు రాలి పో తాయి. అప్పడప్పడు నష్టం కూడా వస్తుంది. – వెంకటేష్, వ్యాపారి, విఠలాపూర్ రోజూ రూ. 200 సంపాదిస్తున్నాం ఈ ఒరుగు ఉన్నని రో జులు రోజుకు 200 సంపాదిస్తాం. ఎండకు వెళ్లి పనిచేయాలంటే చే యలేక పోతున్నాం. చె ట్ల కింద కూర్చుని మా మిడి కాయలు కోసి ఒరుగు తయారు చేస్తా ం. ఒక సంచికి 150 రూపాయలు ఇస్తారు, ఇ ద్దరం కలిసి రెండు నుంచి మూడు సంచులు కోస్తాం. – లక్ష్మమ్మ విఠలాపూర్, కుల్కచర్ల -
ఫలితాలు సీజన్: మార్కెట్లు అప్రమత్తత
ముంబై : రేపటి నుంచి నాలుగో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 144.87 పాయింట్లు పడిపోయి 29,643.48 వద్ద, నిఫ్టీ 33.55 పాయింట్ల నష్టంలో 9203.45 వద్ద క్లోజయ్యాయి. గురువారం టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఫలితాలతో త్రైమాసిక సీజన్ కు బోణి కొట్టబోతుంది. అంచనావేసిన దానికంటే ఫలితాలు మెరుగ్గానే ఉంటాయని తెలుస్తున్నప్పటికీ, ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తతో వ్యవహరించారు. దీంతో కంపెనీ షేర్లు ఫ్లాట్ గా ముగిశాయి. నార్త్ కొరియా, సిరియా ఆందోళన నేపథ్యంలో అటు గ్లోబల్ మార్కెట్లు కూడా ఒత్తిడిలో కొనసాగాయి. ఈ సెంటిమెంట్ కూడా దేశీయ మార్కెట్లపై పడిందని విశ్లేషకులంటున్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 289 పాయింట్ల రేంజ్ లో కొనసాగింది. నిఫ్టీ గరిష్టంగా 9246.40, కనిష్టంగా 9161.80 స్థాయిలను తాకింది. మంగళవారం క్లోజింగ్ తో ఈ ఏడాది 20 శాతం ఎగిసిన నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు ఇండెక్స్, సిండికేట్, ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్, ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంకు నష్టాలతో 1.3 శాతం పడిపోయింది. టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, విప్రో, హిందాల్కో, మారుతీ సుజుకి, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ లు కూడా నష్టాల్లో కొనసాగాయి. ఇదే సమయంలో భారతీ ఇన్ ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్, సన్ ఫార్మా, బీపీసీఎల్ లాభాలు ఆర్జించాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 18 పైసలు పడిపోయి 64.68 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 24 రూపాయల లాభంతో 29,217గా నమోదయ్యాయి.