Eastern Europe
-
ఏ సీమ దానవో.. ఎగిరెగిరి వచ్చావు..
సాక్షి, హైదరాబాద్: ఆయా దేశాల్లో జీవించే పక్షులు అక్కడి ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వివిధ దేశాలకు వలస వెళుతుంటాయి. కేవలం 12 సెం.మీ సైజు ఉండే ‘రెడ్–బ్రెస్టెడ్ ఫ్లైక్యాచర్’పేరుతో పిలిచే ఈ పక్షిది అద్భుత ప్రయాణం. ఈ పక్షులు వివిధ ఖండాలు, సముద్రాల మీదుగా ఎగురుతూ, వేలాది మైళ్లు ప్రయాణం చేసి హైదరాబాద్ మహానగరానికి వలస వస్తున్నాయి. ప్రస్తుతం తూర్పు ఐరోపా దేశాల్లో తీవ్రస్థాయిలో చలి పెరిగి, మంచుమయమై పోతున్న సమయంలో సమశీతోష్ణస్థితి ఉన్న దక్షిణాసియాలోని మనదేశానికి.. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌కు ఈ పక్షులు చేరుకుంటున్నాయి.ప్రతి ఏడాది నవంబర్ నుంచి మార్చి దాకా విదేశాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో పక్షులు నగరానికి వలస వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు సత్ఫలితాలు ఇస్తోందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా...గతంలో వివిధ రకాల పక్షులకు, ప్రధానంగా వలస పక్షులకు ఆవాసంగా ఉన్న అమీన్పూర్ చెరువు పరిసర ప్రాంతాల్లో ఈ పక్షి దర్శనమిచ్చి పక్షి ప్రేమికులను ఆనందపరిచింది. సాధారణంగా పక్షులు ఎక్కడ గూడును ఏర్పాటుచేసుకుని పిల్లలి్నకంటాయో అక్కడికే మళ్లీ వలస వస్తాయని నిపుణులు చెబుతున్నారు.తాము గతంలో ఉన్న ప్రదేశంలో గూడు చెదిరినా, చెట్లు, నీళ్లు, పరిసరాల్లో మార్పులు సంభవించినా మళ్లీ అవి అక్కడకు రావని వెల్లడించారు. సాధారణంగా ఇది ‘బ్రీడింగ్ టైమ్’కాబట్టి ఇక్కడకు వచ్చి గూడు ఏర్పాటు చేసుకుని పిల్లల్ని పెడుతుంటాయని తెలిపారు. ఈ సందర్భంగా సాక్షి ప్రతినిధితో హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అధ్యక్షుడు ఆడేపు హరికృష్ణ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వలసపక్షుల రాకపై ఆయన మాటల్లోనే... ‘ప్రస్తుతం నగరంలో ‘రెడ్–బ్రెస్టెడ్ ఫ్లై క్యాచర్’పక్షి కనువిందు చేస్తోంది. మనదేశానికి వలస రావడానికి కొన్నిరోజుల ముందు నుంచే బాగా ఆహారం తీసుకుని, శరీరంలో పెద్దమొత్తంలో కొవ్వు నిల్వ అయ్యేలా చూసుకుంటుంది. సముద్రాల మీదుగా ప్రయాణం సాగిస్తున్నపుడు ఈ కొవ్వునే ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. మరే దేశంలో లేని విధంగా మనదేశంలో 1,300 రకాల పక్షిజాతులున్నాయి. వీటిలో అత్యధికశాతం అంటే 70 శాతం దాకా వలస పక్షులు హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తుంటాయి. – ఆడేపు హరికృష్ణ ,అధ్యక్షుడు, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ -
యూరప్‌లో వరద విలయం
కుండపోత వర్షాలు మధ్య, తూర్పు యూరప్‌లో బీభత్సం సృష్టిస్తున్నాయి. బోరిస్ తుఫాను ధాటికి విపరీతమైన వర్షపాతం నమోదవుతోంది. రొమేనియా, ఆ్రస్టియా, జర్మనీ, స్లొవేకియా, హంగేరీ సహా పలు మధ్య యూరోపియన్ దేశాల్లో భారీ వర్షాలు కురిశాయి. చెక్ రిపబ్లిక్ కూడా ఎడతెరిపి లేని వానలతో అతలాకుతలమవుతోంది. భారీ సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేశవ్యాప్తంగా 90 చోట్ల వరద హెచ్చరికలను ప్రకటించారు. ఓపావా సహా పలు నగరాల్లో వేలాది మందిని ఇళ్లను వదిలి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ప్రభుత్వం కోరింది. రాజధాని ప్రేగ్నూ వరద విలయం సృష్టిస్తోంది. దక్షిణ బొహెమియా ప్రాంతంలో వరదల దెబ్బకు ఓ డ్యామ్ బద్దలైంది. 1997 నాటి ‘శతాబ్దపు వరద’ల కంటే పరిస్థితి దారుణంగా ఉందని చెక్ ప్రధాని పీటర్ ఫియాలా వాపోయారు. నైరుతి పోలెండ్‌లోని ఒపోల్ ప్రాంతంలో నది ఉప్పొంగడంతో పట్టణం వరద ముంపుకు గురైంది. దేశంలో రెండో అతి పెద్ద నగరం క్రాకోవ్ కూడా వరదలో చిక్కుకుంది. కరెంటు లేక, టెలిఫోన్ నెట్వర్క్ పని చేయక జనం నరకం చూస్తున్నారు. ఆస్ట్రియాలో వియన్నా పరిసరాలను విపత్తు ప్రాంతంగా ప్రకటించారు. భారీ వర్షాలు మంగళవారం దాకా కొనసాగుతాయన్న అంచనాలు మరింత భయపెడుతున్నాయి. – ప్రేగ్ -
ఉక్రెయిన్‌కు స్పీడుగా సహాయం
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో పాటు తూర్పు యూరప్‌లోని మిత్రదేశాలకు మరింత సాయం వేగంగా అందించేందుకు వీలు కల్పించే బిల్లుకు అమెరికా హౌస్ ఆఫ్ కామన్స్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీనికింద రష్యా ఆక్రమణను నిరోధించేందుకు ఈ దేశాలకు అమెరికా ఆయుధ సంపత్తిని అందిస్తారు. తమ మద్దతుతో రష్యాపై ఉక్రెయిన్ గెలుస్తుందని యూఎస్ ప్రతినిధి గ్రెగరీ మీక్స్ చెప్పారు. ఆ దేశానికి మరో 3,000 కోట్ల డాలర్ల సాయమందించేందుకు అమెరికా కాంగ్రెస్ మద్దతు కోరతానని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. డోన్బాస్‌పైనే ఫోకస్ తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌పై రష్యా దాడులను కొనసాగిస్తోంది. వాటిని ఉక్రెయిన్ సమర్థంగా అడ్డుకుంటోందని బ్రిటన్ తెలిపింది. ఐరాస చీఫ్ గుటెరస్ కీవ్‌లో పర్యటిస్తుండగానే ఆ నగరంపై రష్యా తీవ్ర దాడులకు దిగింది. అక్కడి మిలటరీ ఫ్యాక్టరీపై దాడి చేశామని ప్రకటించింది. వరదలతో నిరోధం కీవ్‌ను సమీపించకుండా రష్యా సేనలను నిరోధించేందుకు పరిసర గ్రామాలను ప్రజలు నీటితో ముంచెత్తుతున్నారు. దీనివల్ల మౌలిక వసతులు దెబ్బతింటున్నా పర్లేదంటున్నారు. శత్రువుల ఆక్రమణ ముప్పు కన్నా ఆస్తి నష్టం ఎక్కువేమీ కాదని చెప్పారు. ఇటీవలే దెమిదివ్ గ్రామ ప్రజలు ఇలాగే రష్యా సేనలను నిలువరించారు. ఘోస్ట్ ఆఫ్ కీవ్ మృతి ఉక్రెయిన్ సైన్యం కీలకమైన జవానును కోల్పోయింది. ‘ఘోస్ట్ ఆఫ్ కీవ్’గా పేరు పొందిన మేజర్ స్టెపాన్ టారాబాల్కా(29) గత నెలలో రష్యా బాంబు దాడుల్లో మృతి చెందినట్లు తాజాగా తెలిసింది. అతను 40 రష్యా యుద్ధ విమానాలను నేలకూల్చాడని ఉక్రెయిన్ చెబుతోంది. ‘ఉక్రెయిన్’ వైద్య విద్యార్థులకు సుప్రీం ఊరట న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి మధ్యలోనే స్వదేశానికి వచ్చిన వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఉక్రెయిన్‌తో పాటు ఇతర దేశాల నుంచి మధ్యలో వచ్చిన వాళ్లు స్థానిక కాలేజీల్లో అడ్మిషన్ పొందేందుకు రెండు నెలల్లో పథకం రూపొందించాలని జాతీయ వైద్య కమిషన్‌ను శుక్రవారం ఆదేశించింది. స్వదేశీ కాలేజీల్లో చేరికకు అవసరమైన క్లినికల్ ట్రైనింగ్‌ను ఈ పథకంలో భాగంగా అందిస్తారు. చైనా వర్సిటీకి చెందిన ఓ వైద్య విద్యార్థిని సూత్రప్రాయంగా రిజిస్టర్ చేసుకోవాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్ఎంసీ సుప్రీంలో సవాలు చేసింది. మానవాళికి కరోనా కొత్త సవాళ్లు విసిరిందని విచారణ సందర్భంగా ఎన్ఎంసీకి జస్టిస్ గుప్తా, జస్టిస్ రామసుబ్రమణ్యంతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చైనా వర్సిటీలో క్లినికల్ శిక్షణ పూర్తి చేసుకోనంత మాత్రాన విద్యార్థి ప్రతిభ వృథా కాకూడదని అభిప్రాయపడింది. వారికి ఒక్క అవకాశం ఇవ్వాలని సూచించింది. ఇలాంటి విద్యార్థులను ఎన్ఎంసీ ఒక నెలలో పరీక్షించవచ్చని, సరైన శిక్షణ పొందారని కమిషన్ భావిస్తే దేశీయంగా 12 నెలల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసేందుకు వారికి వీలు కల్పించవచ్చని తెలిపింది. -
ఒక్కరోజులో 2.3 లక్షల కేసులు
వాషింగ్టన్: కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 2,30,000 కోవిడ్ కేసులు నిర్ధారణ అయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. వీటిలో 66,000 కేసులు ఒక్క అమెరికాలోనే నమోదయ్యాయి. గత మూడు రోజులుగా వరసగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఒక్క శుక్రవారం రోజే 24 గంటల వ్యవదిలో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 2,28,000 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఐరోపా దేశాలను కమ్మేస్తోంది తూర్పు ఐరోపా దేశాల్లో కరోనా జనాన్ని ఊపిరిసలపనివ్వడం లేదు. క్రొయేషియాలో మాస్క్‌ల వాడకం, హంగేరీలో ప్రయాణాలపై నిషేధం, క్వారంటైన్ వంటి చర్యలకు పూనుకుంటున్నారు. రొమేనియాలో ఆదివారం 456 కరోనా కేసులు నమోదయ్యాయి. సెర్బియాలో ఇప్పటి వరకు 18,000 మందికిపైగా కరోనా సోకగా, 382 మంది మరణించారు. అమెరికాలో ఇప్పటి వరకు ఎక్కడా లేనంతగా ఫ్లోరిడాలో ఒకే ఒక్క రోజులో 15,299 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవగా, 45 మరణాలు సంభవించినట్టు వైద్య విభాగం తెలిపింది. కాలిఫోర్నియాలో బుధవారం ఒక్కరోజులో 11,694 కేసులు నమోదవగా, న్యూయార్క్‌లో ఏప్రిల్ 15న ఒకేరోజులో అత్యధికంగా 11,571 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఫ్లోరిడా ఈ రికార్డుని బద్దలు కొట్టింది. ఫ్లోరిడాలో వారంలో సగటున రోజుకి 73 లెక్కన 514 మరణాలు సంభవించడం రికార్డు. -
అందమైన కావ్యం
అజర్బైజాన్ పాక్షికంగా తూర్పు యూరప్‌లోనూ, పశ్చిమ ఆసియాలోనూ ఉన్న దేశం అజర్బైజాన్. 1920లో సోవియెట్ యూనియన్‌లో విలీనమైన ఈ దేశం... సోవియెట్ పతనానికి ముందు 1991 ఆగస్ట్ 30న స్వతంత్రదేశంగా అవతరించింది. 95 శాతం ముస్లిం జనాభా ఉన్న అజర్బైజాన్... ఆర్థికాభివృద్ధి, అక్షరాస్యతలో ఉన్నత స్థానంలో ఉంది. ఆధునిక విశ్వవిద్యాలయాలు ఉన్న ముస్లిం దేశాల్లో దీనిది రెండో స్థానం. పురాతన అశ్వజాతికి చెందిన కారాబాక్ గుర్రం వేగానికి, ఆవేశానికి, సౌందర్యానికి పేరుగాంచింది. ఇది అజర్బైజాన్ జాతీయ జంతువు. అధికార భాష అయిన అజర్బైజానీతో పాటు డజన్ వరకు స్థానిక భాషలు ఈ దేశంలో మాట్లాడతారు. జీవవైవిధ్యంలో అజర్బైజాన్ ముందు వరుసలో ఉంది. 106 జాతుల జంతువులు, 97 జాతుల చేపలు, 363 జాతుల పక్షులు ఈ దేశంలో ఉన్నాయి. బోలెడన్ని పురాతన నదులు, సరస్సులు ఉన్నాయి. ‘కురా’ ‘ఆరిస్’ నదులు అన్నిటికంటే ముఖ్యమైనవి. ఆయిల్, గ్యాస్, బంగారం, ఇనుము, టైటానియం, మాంగనీస్... మొదలైన నిధులు ఉన్న సుసంపన్నమైన దేశం అజర్బైజాన్. దేశంలో 54 శాతం వ్యవసాయ భూములే. వాటిలో చెరకు, పత్తి, పొగాకు మొదలైనవి పండిస్తారు. పాల సంబంధిత, మద్య ఉత్పత్తులు ఈ దేశ ప్రధాన ఉత్పత్తులు. విలువైన వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా స్వదేశంలోనే తయారుచేసుకునే ప్రయత్నాలు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. అజర్బైజాన్ 1991లో స్వతంత్రదేశంగా అవతరించిన తరువాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, ఇస్లామిక్ డెవెలప్మెంట్ బ్యాంక్, ఆసియన్ డెవెలప్మెంట్ బ్యాంకు మొదలైన వాటిలో సభ్యత్వం తీసుకుని ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సైనిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఒకప్పుడు అజర్బైజాన్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉండేది. సోవియెట్ యూనియన్ పతనం, ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలతో పర్యాటక రంగం దెబ్బతిని ఆకర్షణ కోల్పోయింది. 2000 సంవత్సరం నుంచి మాత్రం పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. పర్యాటక ఆదాయం పెరిగింది. అందుకే పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. భౌగోళిక విశిష్టత, అసాధారణ ప్రకృతి సంపదకు తోడు కళ, చారిత్రక, సాంస్కృతిక సంపద కూడా ఈ అగ్నితేజ దేశానికి అరుదైన ఆభరణాలు! టాప్ 10 1. అజర్బైజాన్ రాజ్యాంగం ఏ మతాన్నీ ‘అధికార మతం’గా ప్రకటించలేదు. 2. మాజీ ప్రపంచ చెస్ చాంపియన్ గ్యారీ కాస్పరోవ్ అజర్బైజాన్ రాజధాని ‘బకూ’లో జన్మించారు. 3. చమురు నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల అజర్‌బైజాన్‌కు ‘ద ల్యాండ్ ఆఫ్ ఫైర్’ అని పేరు. 4. అజర్బైజాన్ అధికార నామం ‘రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్’. 5. అజర్‌బైజానీ భాషలో ఎన్నో మాండలికాలు ఉన్నాయి. 6. రాజధాని ‘బకూ’కు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘గొబుస్తాన్ నేషనల్ పార్క్’లో వందలాది రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి. 7. దేశంలో నూతన సంవత్సర వేడుకలను ‘నౌరోజ్’ పేరుతో జరుపుకుంటారు. 8. పరిపాలనా సౌలభ్యం కోసం అజర్‌బైజాన్‌ను పది ‘ఎకనామిక్ రీజన్’లుగా విభజించారు. 9. ‘కురా’ అనేది అజర్బైజాన్లో పొడవైన నది. 10. అజర్బైజాన్ ప్రజల ప్రీతిపాత్రమైన పానీయం ‘టీ’.