EcoSport
-
భారత్‌కు భారీ షాక్.. దేశం నుంచి వెళ్లిపోతున్న ప్రఖ్యాత కార్ల కంపెనీ!
Ford Ends Production units In India భారతీయులు ఎక్కువ ఇష్టపడే కార్లు జాబితా తీస్తే అందులో తప్పకుండా ఫోర్డ్ కూడా ఉంటుంది. ఈ అమెరికన్ కంపెనీ భారత్ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకుంది. అయితే భారీ నష్టాలు కారణంగా ఈ సంస్థ దేశం నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. గత దశాబ్ద కాలంగా సుమారు 2 బిలియన్ డాలర్ల నష్టాలను చవిచూశామని కంపెనీ వెల్లడించింది. ఫోర్డ్‌కు భారతదేశంలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఒకటి గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలోని సనంద్‌లో ఉండగా, మరొకటి తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉంది. సనంద్ ప్లాంట్ నుంచి, ఫోర్డ్ వారి ఫిగో, ఫ్రీస్టైల్, ఆస్పైర్ వంటి చిన్న కార్లను ఉత్పత్తి చేసేది. చెన్నై ప్లాంట్ నుంచి, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, ఎండీవర్‌లను ఉత్పత్తి చేస్తుంది. 9 సెప్టెంబర్ 2021న ఫోర్డ్ కంపెనీ భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగానే సనంద్ ప్లాంట్‌లో ఉత్పత్తిని అక్టోబర్ 2021లో నిలిపివేసింది. కార్లు, ఇంజిన్లు ఎగుమతి ప్రయోజనాల కోసం చెన్నై ప్లాంట్‌ని ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చింది. ప్రస్తుతం చెన్నై యూనిట్‌ని కూడా నిలిపివేయడంతో దేశంలో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసినట్లైంది. ఎకోస్పోర్ట్ ఫోర్డ్‌కు ఆటోమొబైల్ రంగంలో మంచి గుర్తింపును తీసుకొచ్చిందనే చెప్పాలి. దీని తర్వాత మార్కెట్లో ఇతర కార్లకు గట్టి పోటిని కూడా ఇవ్వగలిగింది ఫోర్డ్. అయితే కంపెనీ తీసుకొచ్చిన కొత్త డిజైన్ కార్లు మార్కెట్లో ఆశించినంతగా క్లిక్ కాలేదు. చివరికి, ఫోర్డ్‌కు భారీ నష్టాలు రావడంతో దేశం నుంచి నిష్క్రమించడం తప్ప వేరే మార్గం కనపడలేదు. చదవండి: Reliance Industries: ఇది టీజర్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. రిలయన్స్ వార్నింగ్ -
ఈ కార్లపై 30వేల డిస్కౌంట్ ఆఫర్
ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ ఇండియా తన కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. తన కాంపాక్ట్ ఎస్యూవీ ఎకో స్పోర్ట్, సెడాన్ ఆస్పైర్, హ్యచ్ బ్యాక్ ఫిగో కార్లపై 30,000 రూపాయల వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నట్టు తెలిపింది. జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో కొత్త పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించడానికి ఈ డిస్కౌంట్ ఆఫర్లను తీసుకొచ్చినట్టు పేర్కొంది. ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారుపై 20వేల రూపాయల నుంచి 30వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభించనుంది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.7.18 లక్షల నుంచి రూ.10.76 లక్షల వరకు ఉంది. అదేవిధంగా ఫిగో, ఆస్పైర్ వాహనాలపై కూడా వేరియంట్ ను బట్టి 10వేల రూపాయల నుంచి 25వేల రూపాయల వరకు డిస్కౌంట్ ను లబ్దిని పొందవచ్చట. ఫిగో ధర ప్రస్తుతం ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.4.75 లక్షల నుంచి రూ.7.73 లక్షల వరకూ ఉండగా.. ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ ధర రూ.5.44 లక్షల నుంచి రూ.8.28 లక్షల వరకు ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చే లోపలే ఈ ప్రయోజనాలను వినియోగదారులకు అందించడం చాలా సంతోషంగా ఉందని ఫోర్డ్ ఇండియా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ రైనా చెప్పారు. ఇప్పటికే లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ కూడా జీఎస్టీ అమలు నేపథ్యంలో మేడిన్ ఇండియా మోడల్స్ రేట్లకు భారీగా కోత పెట్టింది. మరో లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ కూడా ఎక్స్ షోరూం ధరలపై 12 శాతం వరకు ప్రయోజనాలను వినియోగదారులకు అందించనుంది. -
మార్కెట్లోకి ఫోర్డ్ న్యూ ఎకో స్పోర్ట్
న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమేకర్ ఫోర్డ్ ఇండియా కొత్త కంపాక్ట్ సెడాన్ ఎస్ యూవీ ఎకో స్పోర్ట్ ను గురువారం మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎక్స్ షోరూం ఢిల్లీలో దీని ధర రూ.8.58లక్షల నుంచి రూ.9.93లక్షల మధ్య ఉండనున్నట్టు కంపెనీ తెలిపింది. మూడు వేరియంట్లు ట్రెండ్ ప్లస్, టైటానియం, టైటానియం ప్లస్ లో ఈ వెహికిల్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ తో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజీన్, 1.5 లీటరు డీజిల్ ఇంజీన్, 1.0 లీటర్ ఎకోబూస్ట్ ఇంజీన్ సామర్థ్యాలతో ఈ వేరియంట్లను రూపొందించామని ఫోర్డ్ తెలిపింది. అన్నీ బ్లాక్ ఎక్స్ టీరియర్స్ తోనే ఈ బ్లాక్ ఎడిషన్ మార్కెట్లోకి వచ్చింది. బ్లాక్ గ్రిల్స్, బ్లాక్ ఔట్ మౌల్డెడ్ హెడ్ ల్యాంప్స్, 16 అంగుళాల బ్లాక్ అలాయ్ వీల్స్, బ్లాక్ మిర్రర్ కవర్స్, బ్లాక్ ఫాగ్ ల్యాంప్ బెజిల్, బ్లాక్ రూఫ్ రెయిల్స్, రూఫ్ క్రాస్ బార్స్ తో ఈ బ్లాక్ ఎడిషన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. -
ఫోర్డ్ నుంచి చిన్నకారు
గౌహతి: ఫోర్డ్ ఇండియా కంపెనీ మరో చిన్న కారును మార్కెట్లోకి తేవాలనుకుంటోంది. 2015 కల్లా ఎనిమిది కొత్త వాహనాలను అందించే వ్యూహంలో భాగంగా ఈ చిన్న కారును తేనున్నామని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) వినయ్ పిపర్సానియా మంగళవారం తెలిపారు. ఇప్పటికే నాలుగు మోడళ్లను అందించామని, రెండేళ్లలో మరో నాలుగు కొత్త కార్లను తెస్తామని పేర్కొన్నారు. భారత్ తమకు అత్యంత ముఖ్యమైన మార్కెటని, ఇక్కడ అన్ని సెగ్మెంట్లలలో వాహనాలను అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఈ కంపెనీ ప్రస్తుతం చిన్న కార్ల సెగ్మెంట్లో ఫోర్డ్‌ఫిగో కారునే(పెట్రోల్, డీజిల్ వేరియంట్లలలో) విక్రయిస్తోంది. మిడ్నైట్ సర్ప్రైజ్: కాగా ఈ కంపెనీ మిడ్నైట్ సర్ప్రైజ్ పేరుతో కొత్త ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నెల 5న ఫోర్డ్ కంపెనీ కార్ల(ఈకో స్పోర్ట్ మినహా)ను బుక్ చేసిన వాళ్లకు అశ్చర్యకరమైన బహుమతిని అందిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ కంపెనీ ఫిగో, క్లాసిక్, ఫియస్టా, ఎండీవర్ కార్లను విక్రయిస్తోంది.