ఫోర్డ్ నుంచి చిన్నకారు
గౌహతి: ఫోర్డ్ ఇండియా కంపెనీ మరో చిన్న కారును మార్కెట్లోకి తేవాలనుకుంటోంది. 2015 కల్లా ఎనిమిది కొత్త వాహనాలను అందించే వ్యూహంలో భాగంగా ఈ చిన్న కారును తేనున్నామని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) వినయ్ పిపర్సానియా మంగళవారం తెలిపారు. ఇప్పటికే నాలుగు మోడళ్లను అందించామని, రెండేళ్లలో మరో నాలుగు కొత్త కార్లను తెస్తామని పేర్కొన్నారు. భారత్ తమకు అత్యంత ముఖ్యమైన మార్కెటని, ఇక్కడ అన్ని సెగ్మెంట్లలలో వాహనాలను అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఈ కంపెనీ ప్రస్తుతం చిన్న కార్ల సెగ్మెంట్లో ఫోర్డ్‌ఫిగో కారునే(పెట్రోల్, డీజిల్ వేరియంట్లలలో) విక్రయిస్తోంది.
మిడ్‌నైట్ సర్‌ప్రైజ్: కాగా ఈ కంపెనీ మిడ్‌నైట్ సర్‌ప్రైజ్ పేరుతో కొత్త ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నెల 5న ఫోర్డ్ కంపెనీ కార్ల(ఈకో స్పోర్ట్ మినహా)ను బుక్ చేసిన వాళ్లకు అశ్చర్యకరమైన బహుమతిని అందిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ కంపెనీ ఫిగో, క్లాసిక్, ఫియస్టా, ఎండీవర్ కార్లను విక్రయిస్తోంది.