Elamanchili Assembly Constituency
-
యలమంచిలి నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ (ఫోటోలు)
-
మునగపూడిలో షర్మిలకు చేదు అనుభవం.!
నాతవరం: మునగపూడి రచ్చబండ కార్యక్రమంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె వ్యవహారశైలిని విమర్శిస్తూ స్థానిక వైఎస్సార్ అభిమానులు నిలదీశారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత వైఎస్సార్ పేరును.. ఆయన మరణాంతరం చార్జిషీట్లో చేర్చి వారి కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిన విషయాన్ని శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ సాక్షిగా ప్రశ్నించారు. వైఎస్సార్ బిడ్డగా అలాంటి పార్టీలో మళ్లీ ఎందుకు చేరారు..? అంటూ వైఎస్సార్ అభిమాని లోవరాజు నిలదీశారు. వైఎస్సార్‌ను, ఆయన కుటుంబాన్ని అవమానించిన పార్టీలో కాకుండా మరే పార్టీని గెలిపించమన్నా.. వైఎస్సార్ బిడ్డగా మద్దతు ఇచ్చేవాళ్లమని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి సమస్యలు లేవని సీఎం జగన్మోహన్రెడ్డి పాలనను ప్రశంసించారు. దీంతో షర్మిల ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. పది నిమిషాలపాటు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశారు. ఈ క్రమంలో అతడి నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు మైక్ లాక్కోన్నారు. అంతలోనే షర్మిల కలగజేసుకుని తనను మాట్లాడనివ్వండని నాయకులకు సూచించారు. లోవరాజు మాట్లాడుతున్నంత సేపు సభలో ఉన్న వారంతా ఈలలతో సందడి చేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ వైఎస్సార్ పేరు చార్జిషీట్లో చేర్చిన విషయం సోనియా, రాహుల్ గాంధీలకు తెలియదని తన దగ్గర బాధపడ్డారన్నారు. రాష్ట్రంలో అధికార పక్ష, ప్రతి పక్ష నాయకులు బీజేపీ పెద్దల కాళ్లకు మొక్కుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులాంటివి పూర్తవ్వాలంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి, రుద్రరాజు, పీసీసీ సభ్యుడు శ్రీరామమూర్తి, నర్సీపట్నం నియోజకవర్గం ఇన్చార్జి సుబ్బ న్న, సన్యాసిరావు పాల్గొన్నారు. -
20న యలమంచిలి..30న అరకులోయ
సాక్షి, విశాఖపట్నం/కొమ్మాది: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం నుంచి 30వ తేదీ వరకు జరగనున్న రెండో విడత సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార మొదటి విడత బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. అదే ఉత్సాహంతో నరసన్నపేట నుంచి రెండో విడత యాత్ర బుధవారం నుంచి ప్రారంభమైందన్నారు. ఎండాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో రెండవ విడత సామాజిక సాధికార యాత్ర ఉత్తరాంధ్ర షెడ్యూల్ విడుదల చేశారు. గురువారం రాజాం, 18న విశాఖ తూర్పు, 20న యలమంచిలి, 21న పాతపట్నం, 22న విశాఖ దక్షిణ, 23న బొబ్బిలి, 24న పాలకొండ, 25 పెందుర్తి, 27 ఎచ్చెర్ల, 28న నెల్లిమర్ల, 29న కురుపాం, 30న అరకులోయలో ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నాలుగున్నరేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు. యాత్రలో భాగంగా నాడు–నేడు పనులను పరిశీలిస్తున్నామని.. ఎక్కడైనా లోపాలుంటే సరిచేయాలని అధికారులకు వివరిస్తున్నామన్నారు. జనసేన నాయకుల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదన్నారు. నాడు–నేడు ద్వారా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆ పార్టీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా అంతిమ విజయం వైఎస్సార్ సీపీదేనన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్, సమన్వయకర్త కె.కె.రాజు, పార్టీ ఉపాధ్యక్షుడు దామా సుబ్బారావు, పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవిరెడ్డి, పేడాడ రమణికుమారి, ద్రోణంరాజు శ్రీవత్సవ తదితరులు పాల్గొన్నారు. -
యలమంచిలి: జగనన్న.....
యలమంచిలి: జగనన్న కాలనీల పూడిక కోసం చించినాడలో తవ్వుతోన్న పెరుగులంక భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందినదేనని మాలమహానాడు జాతీ య అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు అన్నారు. అక్కడ తవ్విన మట్టితో కొంతేరులో పూడ్చిన జగనన్న కాలనీని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దళితుల భూమిలో మట్టి తవ్వి వైఎస్సార్సీపీ నాయకులు రూ.లక్షలు దండుకుంటున్నారని, అడ్డొచ్చిన దళితులను కొట్టారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గ్లోబెల్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తన కమిటీ సభ్యులతో ఆ భూముల గురించి తెలుసుకున్నట్టు చెప్పారు. టీడీపీ హయాంలో ఇదే రామానాయుడు చించినాడలంకలోని దళితుల భూ మిలో మట్టి తీసుకెళ్లి టిడ్కో ఇళ్ల నిర్మాణానికి వాడార ని గుర్తుచేశారు. ఇప్పుడు జగనన్న కాలనీలకు ఇసుక తరలిస్తుంటే దళితుల భూముల్లో ఇసుక తోలుకుపోతున్నారని, అడ్డొచ్చిన దళితులను కొట్టారని రామానాయుడు అసత్య ప్రచారం చేయడం రాజకీయ లబ్థి కోసమే ఎద్దేవా చేశారు. 1983లో ఏనుగువానిలంకలో 52 ఎకరాల పెరుగులంక భూమికి 389, 390 సర్వే నెంబర్లు కేటాయించి, చించినాడకు చెందిన 228 ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారికి డి ఫాం పట్టాలు ఇచ్చారని తెలిపారు. నేడా భూములన్నీ అగ్రవర్ణ టీడీపీ నాయకుల గుప్పిట్లో ఉన్నాయని ఆరోపించారు. రామానాయుడు వారికి కొమ్ము కాస్తూ దళితులకు అన్యాయం జరుగుతుందనడం అవివేకమన్నారు. ప్రస్తుతం ఆ భూమలపై విచారణ చేసి, అనర్హుల చేతుల్లో ఉంటే స్వాధీనం చేసి పేద దళితులకు పంచాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలుగా చించినాడ గ్రామం సీపీఎం నాయకుల పాలనలో ఉందని, ఆ సమయంలో దళితుల శ్మశాన వాటిక లేదనే సంగతి వారికి తెలియదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో రామానాయుడుకు ఈ సమస్య కనిపించలేదా అన్నారు. ఎవరు మాత్రం దళితులుగా పుట్టాలని కోరుకుంటారని వ్యాఖ్యానించిన చంద్రబాబును దళితులు ఎప్పటికీ నమ్మరని, ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత కులాల మధ్య చిచ్చుపెట్టిన చరిత్రహీనుడని వివరించారు. దళితులంతా గ్రహించి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా వైఎస్సార్సీపీ అధికారంలోనికి రావడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే నిమ్మల ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. మంగ రాజు వెంట మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి మై లాబత్తుల మైకేల్‌రాజు, పుచ్చకాయల శ్రీకాంత్, బీ రా సునీల్‌బాబు, బిరదా సందీప్, రోహిత్ ఉన్నారు.