electrical contractors
-
ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలో పనులకు ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచాలని తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఉత్తర డిస్కంతో సమానంగా దక్షిణ డిస్కంలో కాంట్రాక్ట్ పనుల ధరలను సవరించాలని కోరింది. అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ఇక్కడ మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుతో సమావేశమయ్యారు. పనుల అంచనా వ్యయాల్లో పీఎఫ్, ఈఎస్ఐ, సెస్, కాంట్రాక్టర్ల అలవెన్సులను కలపాలని కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్కే మాజిద్, సంయుక్త కార్యదర్శి సదానందం, ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వతాలు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
దుబ్బాక, న్యూస్‌లైన్: విద్యుత్తు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి కూలి పనులకు వచ్చిన ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన విషాద సంఘటన మండలం హబ్షీపూర్ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని హబ్షీపూర్ శివారులో గల ఎస్సీ భూముల్లో ఇందిర జలప్రభ పథకం కింద ఏర్పాటు చేసిన బోరు బావులకు విద్యుత్ సరఫరా చేసేందులో ఇచ్చేందుకు దాదాపు 15 రోజులుగా లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు కాంట్రాక్టర్ మహేందర్‌రెడ్డి దక్కించుకోగా.. ఇతను మోహన్‌రావు అనే సబ్ కాంట్రాక్టర్‌కు పనులు అప్పజెప్పారు. అందులో భాగంగానే శుక్రవారం బొప్పాపూర్‌కు చెందిన పట్నం అశోక్ (25)తో పాటు గ్రామానికి చెందిన యువకులు పనులు చేస్తున్నారు. సాయంత్రం సమయంలో కరెంట్ ఫోల్స్ ఏర్పాటు చేసి వాటి కి తీగలను బిగించే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈ ప్రాంతంలో దుబ్బాక, హబ్షీపూర్ గ్రామాలకు రెండు ఫీడ ర్ల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. అయితే వీరు పని చేసే చోట దుబ్బాక ఫీడర్‌గా భావించిన కాంట్రాక్టర్ స్థానిక సబ్‌స్టేషన్ నుంచి దుబ్బాక ఫీడ ర్కు ఎల్సీ తీసుకున్నాడు. కానీ అక్కడ హబ్షీపూర్ ఫీడర్ నుంచి విద్యుత్తు సరాఫరా అవుతుంది. అయితే అశోక్ కరెంట్ స్తంభం పైకి ఎక్కి కరెంట్ తీగలను బిగించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ లెనిన్ బాబు, ట్రైనీ డీఎస్పీ రషీద్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. దుబ్బాక ప్రభుత్వాస్పత్రి బంధువులు, కుటుంబ సభ్యులతో దద్దరిల్లింది. చేతికందిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని మృతుడి తల్లిదండ్రులు స్వామి, పోచవ్వలు విలపించారు.