emergency number 112
-
మద్యం మత్తులో తాగుబోతు చేసిన పని... షాక్‌లో పోలీసులు!
Man Called The Emergency Helpline Of Haryana Police: ప్రతి రాష్ట్రానికి కొన్ని ఎమర్జెన్సీ నెంబర్లు ఉంటాయి. ప్రజలకు అత్యవసర సమయాల్లో సహాయ సహకారాలు అందించే నిమిత్తం అధికారులు ఈ ఫోన్ నెంబర్లను కేటాయిస్తారు. అయితే కొందరు వాటిని దుర్వినియోగం పరిచి విలువైన సమయాన్ని వృద్ధా చేస్తుంటారు. అచ్చం అలాంటి సంఘటనే హర్యానాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...హర్యానాలో అ్యతవసర హెల్పలైన్ నెంబర్ 112 ఒకటి ఉంది. ప్రజలు ఆపదల్లో ఉన్నప్పుడు లేదా ఏదైన ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఈ హెల్ప్‌లైన్ నెంబర్ కాల్ చేస్తే పోలీసులు వచ్చి తక్షణ సాయం అందిస్తారు. అయితే ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌కి ఒక తాగుబాతు కాల్ చేసి సహాయం అడుగుతాడు. దీంతో పోలీసులు హుటాహుటిన ఆ తాగుబోతు ఉన్న చోటుకి తరలివస్తారు. అయితే అక్కడ ఆ తాగుబోతు పోలీసు కారు వచ్చిందా అని అక్కడకి వచ్చిన పోలీసులను అడిగాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కి గురై ఎందుకు ఈ ఎమర్జెన్సీ నెంబర్ కాల్ చేసావని ప్రశ్నించారు. ఆ వ్యక్తి సాయంత్రం ఐదు గంటలకు రైళ్లు, కార్లు తిరగకపోవడంతో అసలు పోలీసులు పనిచేస్తున్నారో లేదో అనే సందేహం వచ్చిందని అందువల్ల తెలుసుకునేందుకు కాల్ చేశానని చెబుతాడు. దీంతో పోలీసులకు ఒక్కసారిగా మతిపోతుంది. సదరు వ్యక్తి రాయ్పురానిలోని తప్రియా గ్రామానికి చెందిన 42 ఏళ్ల నరేష్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఈ ఎమర్జెన్సీ నెంబర్‌కు ఎందుకు కాల్ చేయాలో కూడా వివరించడమే కాక ఎందుకు తాగుతున్నావని నరేష్‌ని ప్రశ్నించారు కూడా. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. पीने के बाद जनता को पुलिस की याद आती है। 2 दिन से पुलिस की गाड़ी नही दिखी तो 112 पे फ़ोन मिला लिया 😀😀. घटना पंचकूला की है । ( PS - Police resources are already scarce , don't misuse them 🙏) @police_haryana @112Haryana pic.twitter.com/5aQFLhs3Aq — Pankaj Nain IPS (@ipspankajnain) February 9, 2022 (చదవండి: మోడల్‌గా మారిన 60 ఏళ్ల కూలీ!) -
ఢిల్లీలో అందుబాటులోకి డయల్ 112
న్యూఢిల్లీ: అత్యవసర సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ నంబర్ 112ను ఢిల్లీ పోలీసులు బుధవారం అందుబాటులోకి తెచ్చారు. కాల్ చేసిన వ్యక్తి లోకేషన్ ట్రేస్ చేసి వారికి అతి త్వరగా సేవలను అందించనున్నారు. ఎవరైనా ఈ హెల్ప్‌లైన్ సేవలు వినియోగించుకోవాలంటే 112 నెంబరుకు డయల్ చేస్తే నెట్వర్క్ సిగ్నల్స్ లేదా జీపీఎస్ ద్వారా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌కు కనెక్ట్ అవుతుంది. అక్కడ వారికి అవసరమయ్యే సేవలను అందిస్తారు. ఈ విషయం గురించి సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఈ కొత్త సేవలతో కంట్రోల్ రూమ్ కాస్తా కాల్ సెంటర్‌గా మారిందన్నారు. ఒకవేళ ప్రజలు తెలీకుండా 100, 101, 102 సేవలకు కాల్ చేసినప్పటికీ అంతిమంగా అది 112కు కనెక్ట్ అవుతుందని పేర్కొన్నారు. ‘డయల్ 112 అనేది ప్రజలకు వరంగా మారనుంది. ఇది కేవలం డబ్బు, సమయాన్ని ఆదా చేయడమే కాకుండా అత్యుత్తమ సేవలను అందించడానికి దోహదపడుతుంది’ అని స్పెషల్ పోలీస్ కమిషనర్ ముక్తేశ్ చంద్రా పేర్కొన్నారు. ప్రస్తుతం కంట్రోల్ రూమ్ సిబ్బంది సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అంతేకాక కంట్రోల్ రూమ్‌ను శాలిమార్‌బాగ్‌లోని కొత్త భవనానికి బదిలీ చేయడమే కాక పూర్తిగా కాగితరహిత సేవలను మాత్రమే వినియోగించనున్నారు. ఒకే దేశం ఒకే ఎమర్జెన్సీ నంబర్ అనే విధానం అమెరికాలోనూ అమల్లో ఉంది. అక్కడ అన్ని రకాల సేవలకుగానూ 911 అనే నంబర్‌నే వినియోగిస్తారు. -
అమెరికాలో 911..ఇక్కడ 112
న్యూఢిల్లీ : అమెరికాలో అత్యవసర సర్వీసులకు 911 నంబర్ ఉన్నట్లే, త్వరలో భారత్‌లో కూడా ఎమర్జన్సీ నంబర్ 112 అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా మహిళల ఒత్తిడికి సంబంధించి తొలుత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అన్ని విషయాలకు ఈ ఎమర్జన్సీ సర్వీస్ నంబర్‌ను ప్రవేశపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజా సంబంధ రవాణా వాహనాలలో ఓ బటన్ సర్వీస్ తీసుకురానున్నారు. ఈ ఎమర్జన్సీ నంబర్ కు వచ్చే కాల్స్ న్యూఢిల్లీలోని కేంద్ర కంట్రోల్ రూమ్‌కు వెళ్తాయి, తిరిగి అవే కాల్స్ సంబంధిత నగరాలకు ఆ కాల్స్‌ను కనెక్ట్ చేస్తారు. ఈ ఎమర్జీన్సీ సర్వీస్ కాల్స్ స్వీకరించి వివరాలు సేకరించేందుకు సుమారు 3000 నుంచి 4000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. ప్రతిరోజు 10 లక్షల కాల్స్ రావచ్చని అంచనాలున్నాయి. ల్యాండ్ లైన్, మొబైల్ నుంచి మాత్రమే కాదు యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.