అమెరికాలో 911..ఇక్కడ 112
న్యూఢిల్లీ : అమెరికాలో అత్యవసర సర్వీసులకు 911 నంబర్ ఉన్నట్లే, త్వరలో భారత్లో కూడా ఎమర్జన్సీ నంబర్ 112 అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా మహిళల ఒత్తిడికి సంబంధించి తొలుత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అన్ని విషయాలకు ఈ ఎమర్జన్సీ సర్వీస్ నంబర్ను ప్రవేశపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజా సంబంధ రవాణా వాహనాలలో ఓ బటన్ సర్వీస్ తీసుకురానున్నారు.
ఈ ఎమర్జన్సీ నంబర్ కు వచ్చే కాల్స్ న్యూఢిల్లీలోని కేంద్ర కంట్రోల్ రూమ్కు వెళ్తాయి, తిరిగి అవే కాల్స్ సంబంధిత నగరాలకు ఆ కాల్స్ను కనెక్ట్ చేస్తారు. ఈ ఎమర్జీన్సీ సర్వీస్ కాల్స్ స్వీకరించి వివరాలు సేకరించేందుకు సుమారు 3000 నుంచి 4000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. ప్రతిరోజు 10 లక్షల కాల్స్ రావచ్చని అంచనాలున్నాయి. ల్యాండ్ లైన్, మొబైల్ నుంచి మాత్రమే కాదు యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.