Employee JAC
-
ఏపీలో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ
-
ఏపీలో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో మరో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటైంది. అశోక్బాబు, బొప్పరాజు సంఘాల వల్ల ఉద్యోగులు నష్టపోతున్న కారణంగా ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ సమాఖ్య ఏర్పాటు చేసినట్లు నూతన జేఏసీ కన్వీనర్ వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పుడున్న ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సమస్యల కోసం పోరాడకుండా ప్రభుత్వ భజన చేస్తున్నాయని మండిపడ్డారు. ఐఆర్, ఇళ్ల స్థలాలు ఇచ్చారంటూ సన్మానాలు, పాలాభిషేకాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ‘ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం అమరావతిలో ఎకరానికి కోటికి పైగా రూపాయలు ఇస్తే.. దానికి సంబరాలు చేసుకున్నారు. ప్రైవేటు సంస్థలకు రూ. 30 లక్షలకు, రూ. 50లక్షలకు ఇచ్చిన ప్రభుత్వం....ఉద్యోగుల దగ్గర కోటి రూపాయలు వసూలు చేసి.. స్థలాలు ఇస్తుందా’ అని ప్రశ్నించారు. మీకసలు సిగ్గుందా? కొత్తగా ఏర్పడే ఉద్యోగ సంఘాల సమాఖ్య ఉద్యోగుల సమస్యలపై పోరాడుతుందన్న వెంకట్రామిరెడ్డి... ‘సీపీఎస్ కోసం అనేక పోరాటాలు చేసాము. అయినా ప్రభుత్వం స్పందించలేదు. 54 సంఘాలు ఇప్పటి వరకు మాకు మద్దతు ఇచ్చాయి. అమరావతి జేఏసీలో ఉన్న ఉద్యోగ సంఘాలు కుడా మద్దతు తెలుపుతున్నాయి. మేము ఏర్పాటు చేస్తున్న సమాఖ్యలో వారంతా కలుస్తున్నారు. కొంతమంది రాజకీయ పదవుల కోసం సిగ్గు లేకుండా ప్రభుత్వం భజన చేస్తున్నారు. అసలు మీకు సిగ్గుందా.. ఉద్యోగుల సమస్యలు మీకు పట్టవా’ అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన... టీడీపీతోనే రాష్ట్రభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు. -
'అధిష్టానం తొత్తుగా మంత్రి కొండ్రు మురళి'
కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రి కొండ్రు మురళి, ఉద్యోగ సంఘాల నేతల మధ్య వాడివేడి చర్చకు దారి తీసింది. మంత్రి కొండ్రు మురళీ తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సోమవారం మధ్నాహ్నం జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న సమ్మెను మంత్రి కొండ్రు మురళి తప్పుపట్టినట్టు సమాచారం. ప్రభుత్వ స్కూళ్లను మూయించి..ప్రైవేట్ స్కూళ్లను ఎలా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి ప్రశ్నించారు. మీ పిల్లలు చదివే స్కూళ్లను మూయించకుండా.. ప్రభుత్వ స్కూళ్లను ఎలా మూయిస్తున్నారని మంత్రి కొండ్రు నిలదీయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజకీయ నేతలు ప్రజల్లోకి వెళ్లి ఉద్యమిస్తే..మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఉద్యోగ సంఘాల నేతలు ధీటుగానే జవాబిచ్చారు. అంతేకాకుండా అధిష్టానానికి తొత్తుగా వ్యవహరిస్తున్నావంటూ కొండ్రు మురళీ తీరును ఉద్యోగ సంఘాల నేతలు తప్పపట్టారు. ఇదిలా ఉండగా.. శ్రీకాకుళం జిల్లాలోని మంత్రి కొండ్రు మురళి కార్యాలయానికి సమైక్య ఉద్యమకారులు తాళం వేసినట్టు తెలిసింది.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రులు విజ్క్షప్తి చేశారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించిన తర్వాతే తాము ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. బుధవారం మధ్నాహ్నం ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నట్టు తెలిసింది.