England domestic cricket
-
రాయల్ లండన్ వన్డే కప్ విజేత గ్లామోర్గన్
రాయల్ లండన్ వన్డే కప్ (ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్) 2024 ఎడిషన్ విజేతగా గ్లామోర్గన్ జట్టు అవతరించింది. నిన్న జరిగిన ఫైనల్లో ఆ జట్టు సోమర్సెట్పై 15 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా షెడ్యూల్డ్ తేదీన మ్యాచ్ రద్దు కాగా రిజర్వ్ డేలో నిర్వహించారు. ఈ రోజు కూడా వరుణుడు ఆటంకం కలిగించడంతో 20 ఓవర్స్ ఫార్మాట్లో మ్యాచ్‌ను జరిపారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లామోర్గన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సామ్ నార్త్ఈస్ట్ అజేయ అర్ద సెంచరీతో (49 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. బిల్లీ రూట్ (39), విలియమ్ స్మేల్ (28), వాన్ డెర్ గుగ్టెన్ (26 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సోమర్సెట్ బౌలర్లలో జార్జ్ థామస్, అల్ఫీ ఒగ్బోమ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. బెన్ గ్రీన్, అల్డ్రిడ్జ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సోమర్సెట్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. సోమర్సెట్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ ఉమీద్ (45), సీన్ డిక్సన్ (44), ఆర్చీ వాన్ (32 నాటౌట్) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. గ్లామోర్గన్ బౌలర్లలో ఆండీ గార్విన్, బెన్ కాల్లావే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డేనియల్ డౌట్వెయిట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రెండు నెలల పాటు సాగిన ఈ టోర్నీలో నిన్నటితో ముగిసింది. గ్లామోర్గన్ వన్డే కప్ టైటిల్ సాధించడం ఇది రెండో సారి. 2021 సీజన్లో ఈ జట్టు డర్హమ్‌పై విజయం సాధించి, తొలి టైటిల్ చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా లీసెస్టర్‌ఫైర్ ఉంది. చదవండి: రాణించిన గబ్బర్.. అయినా డీకే జట్టు చేతిలో ఓటమి -
రాయల్ లండన్ వన్డే కప్-2023 విజేతగా లీసెస్టర్‌షైర్
ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్ అయిన రాయల్ లండన్ వన్డే కప్-2023ను లీసెస్టర్‌షైర్ ఎగరేసుకుపోయింది. నిన్న (సెప్టెంబర్ 16) జరిగిన ఫైనల్లో ఆ జట్టు.. హ్యాంప్‌షైర్‌ను 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడించి, తొలిసారి దేశవాలీ వన్డే ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్.. అజేయ శతకంతో విజృంభణ ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు వికెట్‌కీపర్ హ్యారీ స్విండెల్స్ లిస్ట్-ఏ కెరీర్లో తొలి శతకంతో విజృంభించాడు. 96 బంతులు ఎదుర్కొన్న స్విండెల్స్ 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 117 పరుగులు చేసి, తన జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు తోడ్పడ్డాడు. స్విండెల్స్కు శ్యామ్యూల్ ఈవాన్స్ (60), కెప్టెన్ లివిస్ హిల్ (42) సహకరించారు. హ్యాంప్‌షైర్ బౌలర్లలో బార్కర్, మేసన్ క్రేన్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. హోలండ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్‌షైర్ గెలుపు కోసం కడదాకా పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు ఆడి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవరల్లో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 265 పరుగులకు పరిమితమైంది. టామ్ ప్రెస్ట్ (51), లియామ్ డాసన్ (57) అర్ధసెంచరీలతో రాణించి, హ్యాంప్‌షైర్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు. వీరికి బెన్ బ్రౌన్ (33), జో వెదర్లీ (40) సహకరించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. లీసెస్టర్‌షైర్ బౌలర్లలో ముల్దర్, క్రిస్ రైట్, జోష్ హల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కొలిన్ అకెర్‌మ్యాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
పృథ్వీ షా సునామీ ఇన్నింగ్స్.. 129 బంతుల్లో డబుల్ సెంచరీ! కానీ...
Prithvi Shaw Slams Double Century- Fans Reacts- లండన్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో తొలిసారి ఆడుతున్న భారత క్రికెటర్ పృథ్వీ షా దేశవాళీ వన్డే కప్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. సోమర్‌సెట్‌తో బుధవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 153 బంతులు ఆడిన పృథ్వీ షా 28 ఫోర్లు, 11 సిక్స్‌లతో 244 పరుగులు సాధించి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అవుటయ్యాడు. పృథ్వీ షా అసాధారణ బ్యాటింగ్‌తో మొదట బ్యాటింగ్‌కు దిగిన నార్తంప్టన్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 415 పరుగులు సాధించింది. అనంతరం సోమర్సెట్ జట్టు 45.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటై 87 పరుగుల తేడాతో ఓడిపోయింది. రికార్డుల పృథ్వీ నార్తంప్టన్‌షైర్ జట్టు తరఫున మూడో మ్యాచ్ ఆడిన పృథ్వీ షా 81 బంతుల్లో సెంచరీ చేయగా... డబుల్ సెంచరీని 129 బంతుల్లో దాటాడు. ముంబైకి చెందిన పృథ్వీ షాకిది లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో (దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు) రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. లిస్ట్ ‘ఎ’లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల లిస్టులో మాత్రం.. జాబితాలో పృథ్వీ షాది ఆరో స్థానం. ఈ జాబితాలో తమిళనాడు క్రికెటర్ నారాయణ్ జగదీశన్ (277; అరుణాచల్‌ప్రదేశ్‌పై 2022లో) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. అప్పటి నుంచి నో ఛాన్స్! 2021లో భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరిపై పృథ్వీ షా 227 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2021 జూలైలో చివరిసారి శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు ఆడిన పృథ్వీ షా ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఇక తాజాగా ఇంగ్లండ్‌లో అతడు బ్యాట్ ఝులిపించడంతో టీమిండియా సెలక్టర్లను ఉద్దేశించి అభిమానులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మన వాళ్ల ప్రతిభను మనం గుర్తించకపోతే ఇదిగో ఇలాగే పక్క దేశాల్లో ఆడుకుంటారంటూ ఫైర్ అవుతున్నారు. ఇకనైనా పృథ్వీ వంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. చదవండి: మా కెప్టెన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.. అదే నా మెదడును తొలిచేసింది! అందుకే.. ✅ Sixth-highest score in List A history ✅ Second-highest List A score in 🏴 ✅ Highest-ever List A score for @NorthantsCCC @PrithviShaw with one of the all-time great knocks 👑#MBODC23 pic.twitter.com/NfXH7RHfqk — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 -
వీడియో వైరల్: ఫోన్ పగలగొట్టిన సంగక్కర..!
లండన్: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి రెండు సంత్సరాలు అయినా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర తన బ్యాటింగ్ సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఇంగ్లండ్ డొమెస్టిక్ టీ20 టోర్నీలో సర్రే-మిడిల్ సెక్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సంగక్కర తన బ్యాటును ఝులిపించాడు. 6 ఫోర్లు, 3 సిక్సులతో 70 పరుగులు బాదిన ఈ 40 ఏళ్ల లంక మాజీ ఆటగాడు ఓ సిక్స్ తో అభిమాని ఫోన్ పగలగొట్టాడు. స్టీవెన్ ఫిన్ ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన బంతిని సంగక్కర భారీ షాట్ తో సిక్స్ గా మలిచాడు. ఈ బంతిని అందుకోవడానికి ఆతృత చూపిన ఓ అభిమాని చేతిలో ఫోన్ తో క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. దీంతో బంతి మొబైల్ కు తగిలి కింద పడిపోయింది. వెంటనే ఫోన్ అందుకున్న ఆ అభిమాని పగిలిపోయిన ఫోన్ చూపిస్తూ ఆశ్ఛర్యం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2015లో టెస్టు క్రికెట్ కు సంగక్కర వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 134 టెస్టుల్లో 57.40 సగటుతో 12,400 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన ఏడాది నుంచి సర్రే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక సంగక్కర శ్రీలంక గెలిచిన 2014 టీ20 వరల్డ్ కప్ జట్టులో ,2007 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేరిన జట్టులో కీలక ఆటగాడు. అంతేగాకుండా సంగక్కర కెప్టెన్సీలో శ్రీలంక 2011 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరింది. 2015లో వన్డే, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగక్కర అంతర్జాతీయ టీ20 చివరి మ్యాచ్ ను 2014లో భారత్ తో ఆడాడు.